[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘ప్రేమ అభయం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఓ చెలీ..!
నీ కనుల కొలనులో
కన్నీళ్ళ అలలు చూసి
కలవర పడిపోయా..
నీ మధుర అదరాల
అదురు చూసి
అదిరిపోయా..
నీ చక్కని చెక్కిళ్ళపై
కన్నీటి చుక్కలు చూసి
బెదిరిపోయా..
నిను వీడి నేను
వెళతాననేగా నీ భయం
నీ గుండెలో గుడి కట్టుకుని
జీవితాంతం ఉంటానని
ఇస్తున్నా ప్రేమ అభయం