Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రసిద్ధ నగరాలు – బాలబాలికలకు క్విజ్

[‘ప్రసిద్ధ నగరాలు – బాలబాలికలకు క్విజ్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

  1. లా చదువుకున్న ‘సిమ్’ ఎక్కడుందో చెప్పగలరా?
  2. ప్రసవాలు ఏ ఊరిలో చక్కగా జరుగతాయో చెప్పండి?
  3. పొట్ట నిండా వడలు ఉన్న ఊరు పేరు ఏమిటి?
  4. కెరటాలు మనల్ని బాదేసే ఊరు పేరు ఏమిటి?
  5. పాకానికీ, బోండాలకీ ఏ నగరం పేరుపొందింది?
  6. పొద్దున్నే నిద్రలేచే పూర్ ఏమిటో? దయ చూపించే ఊరేమిటో చెప్పండి?
  7. సాగరమథనంలో దేవతలు తాగిన దానిని గౌరవంగా సంభోదించేది ఏ ఊరిలోనో చెప్పగలరా?
  8. టీచర్లు అందరూ నివాసముండే గ్రామమేమిటి?
  9. అదృష్టం ఇప్పుడే పట్టిన ఊరేంటో చెప్పగలరా?
  10. హోమ్ సిక్ కలిగే ఊరు ఎక్కడుందో చెప్పండి?
  11. ముక్కు ఉన్న ఊరే పేరేమిటో చెప్పగలరా?
  12. పేరులో ‘బాదు’ అని ఉన్నా, ‘అహమ్మద్’ని కొట్టద్దు. ఇది ఏ ఊరు??
  13. పురానికి ‘జై’ కొట్టే ఊరేది?
  14. చెర్రీలున్న నగరమేది?

 

జవాబులు:

1.సిమ్లా 2. కాన్పూర్ 3. వడోదర, 4. అలహాబాద్ 5. మైసూర్ 6. ఉదయపూర్ 7. అమృత్‌సర్ 8. గుర్‌గావ్, 9. లక్నో 10. బెంగళూర్ 11. నాసిక్ 12. అహ్మదాబాద్ 13. జైపూర్ 14. పాండిచ్చేరి.

 

Exit mobile version