[‘ప్రసిద్ధ నగరాలు – బాలబాలికలకు క్విజ్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]


- లా చదువుకున్న ‘సిమ్’ ఎక్కడుందో చెప్పగలరా?
- ప్రసవాలు ఏ ఊరిలో చక్కగా జరుగతాయో చెప్పండి?
- పొట్ట నిండా వడలు ఉన్న ఊరు పేరు ఏమిటి?
- కెరటాలు మనల్ని బాదేసే ఊరు పేరు ఏమిటి?
- పాకానికీ, బోండాలకీ ఏ నగరం పేరుపొందింది?
- పొద్దున్నే నిద్రలేచే పూర్ ఏమిటో? దయ చూపించే ఊరేమిటో చెప్పండి?
- సాగరమథనంలో దేవతలు తాగిన దానిని గౌరవంగా సంభోదించేది ఏ ఊరిలోనో చెప్పగలరా?
- టీచర్లు అందరూ నివాసముండే గ్రామమేమిటి?
- అదృష్టం ఇప్పుడే పట్టిన ఊరేంటో చెప్పగలరా?
- హోమ్ సిక్ కలిగే ఊరు ఎక్కడుందో చెప్పండి?
- ముక్కు ఉన్న ఊరే పేరేమిటో చెప్పగలరా?
- పేరులో ‘బాదు’ అని ఉన్నా, ‘అహమ్మద్’ని కొట్టద్దు. ఇది ఏ ఊరు??
- పురానికి ‘జై’ కొట్టే ఊరేది?
- చెర్రీలున్న నగరమేది?
జవాబులు:
1.సిమ్లా 2. కాన్పూర్ 3. వడోదర, 4. అలహాబాద్ 5. మైసూర్ 6. ఉదయపూర్ 7. అమృత్సర్ 8. గుర్గావ్, 9. లక్నో 10. బెంగళూర్ 11. నాసిక్ 12. అహ్మదాబాద్ 13. జైపూర్ 14. పాండిచ్చేరి.

డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.