మట్టి ఒడిన.. పుట్టి
ఏపుగ పెరిగిన
పచ్చని అక్షరాలలా
ఆకలి తీర్చే
అమృత నయనాలు.. నీవి
గుండె గూటిన
వ్రాలి
వలపు గాటు.. పెట్టి
మధుర కౌగిలిలో
మదన యుద్ధం.. చేసే
ప్రణయ శరఘాతపు
అమృత రస ఫలాలు.. నీవి
వంపులలో..
దాచుకున్న
నయగారపు.. కెంపులను
దోసిళ్ళతో పట్టి
అధర మధుపాత్రలో
తీయని గోరు
ముద్దుల ముద్దలు.. పెట్టి
సుడులు తిరిగే
సుఖ క్షేత్ర
వ్యవసాయ నిధికి.. చేరు
నేనో ‘ప్రణయ చిలుక’ను
డా. బాలాజీ దీక్షితులు పి.వి. హోమియోపతి వైద్యునిగా, కవిగా, గెస్ట్ లెక్చరర్‌గా, వ్యక్తిత్వ వికాస నిపుణినిగా, కౌన్సిలింగ్ సైకాలజీస్ట్గా ఇలా ఎన్నో రంగాలలో విశిష్టత చాటుకున్నారు. డా. దీక్షితులు ఇప్పటి వరకు 58 జాతీయ,అంతర జాతీయ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటికి 10 పరిశోధనా సమావేశాలలో పాల్గొన్నారు, దాదాపు 90 తెలుగు రచనలు వివిధ పత్రికలలో ప్రచురితం అయినాయి. వీరి సేవ మరియు ప్రతిభను గుర్తించి యూనివర్సిటీ అఫ్ సోత్ అమెరికా డాక్టరేట్ 2016లో ఇచ్చింది. ఇవిగాక అనేక అవార్డ్స్, రివార్డ్స్ అనేక సంస్థలు అందించాయి.