Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-6

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-5: ఆక్టియా స్పైకాటా (Actaea Spicata)

ది యూరోప్, ఆసియాలో పెరిగే హెర్బ్ క్రిస్టోఫర్, బేన్ బెర్రీగా పిలవబడే వృక్షజాతికి చెందినది. వసంతకాలంలో దీని వేరు నుంచి తీసిన కషాయంతో ఔషధ గుణాల్ని స్పెయిన్ దేశస్థుడగు డా॥ పెట్రోబ్ రాబట్టారు.

స్థానాలు:

కాళ్ళు, చేతులు, కీళ్ళ సంధులు.

వ్యాధులు:

చిన్న ఎకుకలల్లో వచ్చే కీళ్ళ వాతం, పంటినొప్పి, హెపటైటిస్‌కి ఉపయోగపడుతుంది.

పోలికలు:

ఆర్నికా, బ్రయోనియా, రూస్టాక్స్, కాలోఫైలం, లైకో-పోడియం, స్ట్రిక్టా తో పోల్చవచ్చు. నక్స్ తర్వాత ఉపయోగించదగ్గ మందు.

కారణాలు:

భయం, నిస్త్రాణా వల్ల కల్గు రోగాలు.

ఉద్రేకం:

కదలిక, స్పర్శ, వాతావరణం మార్పులు, చల్లగాలికి వ్యాధి లక్షణాలు ఎక్కువవడం.

ఉపశమనం:

శ్రమ పడినా, రాత్రిళ్ళు రిలీజ్ ఉంటుంది.

శరీర తత్వం:

మహా వాత తత్వం. ఇది కుడి వైపు పనిచేయు మందు. ఇది పురుషులకు ఎక్కువుగా ఉపయోగపడే మందు.

మానసిక లక్షణాలు:

రాత్రిళ్ళు చనిపోతానేమోననే భయం, ఆందోళన, నిద్రలో, మగతలో సంధి ప్రేలాపనలు, మానసిక వత్తిడి ఎక్కువవడం వల్ల కలిగే లక్షణాలు.

శారీరక లక్షణాలు:

తల:

త్రాగినట్లుగా తల త్రిప్పుతూ ఉండడం, నిలబడినప్పుడు నుదురులో ఖాళీగా ఉన్నట్లుండడం, కణతల్లో అదుర్లు ఉంటాయి. పంటినొప్పి వల్ల కణతల్లో పొడిచినట్లు ఉండడం, తలభారం నడిచినా ఎండలో తిరిగినా, రాత్రిళ్ళు ఎక్కువవడం, పీరియాడికల్ తలనొప్పి రావడం, తలలో వేడి చెమటలు పట్టడం, కనుబొమ్మల్లో నొప్పితో ముక్కు కారడం ఉంటుంది.

కళ్ళు:

కంటిలోనుండి తలలోకి నొప్పి, అన్ని వస్తువులు నీలి రయగా కనపడడం, దృష్టిలోపం ఉంటుంది.

చెవి:

తుమ్మినపుడు చెవిలో నొప్పి ఉంటుంది. పై దవడ ఎముకలో నొప్పి వల్ల ముఖ కండరాల్లోకి, కణతల్లోకి లాగినట్లు, పొడిచినట్లుండడం.

గొంతు:

చల్ల గాలి పీల్చినపుడు, మాట్లాడేటప్పుడు గొంతు నొప్పి.

నోరు:

నోటిలో దుర్వాసన, లాలాజలం ఎక్కువగా ఊరడం, బాధలో కూడిన పుల్లని తేన్పులు, వాంతులు ఉంటాయి.

ఇతర అవయవాలు:

ఉదరకోశంలో నొప్పి, చీల్చుచున్నట్లు, లాగినట్లుండడం, జీర్ణకోశంలో కేన్సర్ రావడం, నీళ్ళు త్రాగినచో వణుకు రావడం, కాలేయ ప్రాంతంలో నొప్పి, అదిమినచో బాధ ఉంటుంది. మూత్రావయవాల్లో రాళ్ళ వల్ల మూత్రపిండాల వద్ద నొప్పి, మూత్రంలో తెల్లని సుద్ద వంటి పదార్థం పోవడం ఉంటుంది. స్త్రీలలో భయం, చల్లదనానికి బహిష్టులు అణగారిపోతాయి.

చల్లగాలి వల్ల రాత్రిళ్ళు శ్వాస సరిగ్గా ఆడక, కష్టంగా ఉంటుంది. ఒక్కసారి ఊపిరి ఆగిపోయినట్లుండడం, ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది.

రుమాటిజమ్:

నడిచిన తర్వాత కాళ్ళు చేతులలో అలసట వల్ల నొప్పులు, వాపులు ఎక్కువవడం, చీలమండలం, బొటనవ్రేలు, మణికట్టు, మోచేతుల్లో, కాలివ్రేళ్ళల్లో పొడిచినట్లు నొప్పులు. కదలిక వల్ల నిస్త్రాణత అధికమవుతుంది. కీళ్ళు ఎర్రగా వాచి ముట్టుకున్నా, కదల్చినా అధికమవుతాయి. వ్రేళ్ళ సంధుల్లో చీల్చునట్లు వాపులు ఆకస్మాత్తుగా వస్తాయి. శరీరంలో కుడివైపు కీళ్ళలో బాధాలెక్కువగా వస్తాయి,

జ్వరంలో వణుకు, త్రేన్పులు, వెచ్చదనం వల్ల వాంతులు కావడం, నీళ్ళు త్రాగితే చలిలో వణుకు ఎక్కువవడం, జ్వరంలో సంధి, నిస్త్రాణత ఉంటాయి.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version