Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-5

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-4: ఎకోనైట్ (Aconite)

దీనిని నాభి అనే విషతుల్యమైన మొక్క నుండి డా॥హానిమన్ తయారుచేశాడు. ఎకోనైట్ అనగా గ్రీకు భాషలో నేల లేకుండగనే పెరుగునది అని అర్థం. ఇది రాత్రి ప్రదేశాలలో పెరగడం వల్ల దీనికా పేరు వచ్చింది. నెపలస్ అనగా లాటిన్‌లో టర్నిప్/మూలిక అని అర్థం. దీని పూలు శిరస్త్రాణాన్ని పోలి ఉండడంతో దీన్ని మాన్స్‌హుడ్, వుల్ఫ్‌ బేన్ అంటారు. ఇది జ్వరానికీ, ఇన్ఫెక్షన్స్‌కు అన్ని తరుణ వ్యాధులకు ఉపయోగపడడంతో దీన్ని హోమియోపతిక్ లాన్సెట్ అంటారు. పుష్పించినపుడు సమూలంగా తీసిన రసంతో ఈ మందుని తయారుచేస్తారు.

స్థానాలు:

మనస్సు, కీళ్ళు, నరాలు, హృదయం, ఛాతీ, పొత్తికడుపు పై ప్రభావం చూపుతుంది.

వ్యాధులు:

తరుణ వ్యాధులు.

కారణాలు:

తేమలేని పొడిగాలికి గురైనా, ఈదురు గాలిలో తిరిగినా, చెమటను ఆపు చేయడం వల్ల, చెమట పట్టినప్పుడు చల్లని గాలులు తగిలినా, కోపానంతరం కలుగు వ్యాధులు, భయం, విచారం, దడుసుకోవడం, ఇన్ఫెక్షన్ తొలిదశలో ఉపయోగపడుతుంది, ఎండ వేడిమి, దెబ్బ తగలడం, శస్త్రచికిత్స తర్వాత ఉపయోగపడుతుంది

పర్సనాలిటీ:

రక్త పుష్టి కల్గి నల్లగా హిస్టీరియా తత్వంతో ఉల్లాసంగా కండర పుష్టి గల స్త్రీలు, ఒక చెంప ఎర్రగా, వేడిగా, రెండవ చెంప చల్లగా, పాలిపోయి ఉంటుంది.

పోలికలు:

దీన్ని ఆర్నికా, బెల్లడోనా, బ్రయోనియా, ఇపకాక్ మందులతో పోల్చవచ్చు.

విరుగుళ్ళు:

నక్స్, కాఫీ, ఎసిటిక్ ఆసిడ్, కామోమల్లా,

ఇది బెల్, కామోమిల్లా, పెట్రోలియం, సెపియా, సల్ఫర్ స్పాంజియా, విరేట్రం ఆల్బం లకు విరుగుడుగా పనిచేస్తుంది.

సహచరి:

ఆర్నికా, సల్ఫర్,

మయాజిమ్:

సోరా.

కాలపరిమితి:

అరగంట – 48 గంటలు.

ఉద్రేకం:

ఎడమవైపు పడుకున్నా, పొడి వాతావరణం, చుట్ట కాల్చినా, సాయంత్రం చలి గాలి, చుట్ట పొగ, అర్ధరాత్రి, భయం, ఎండ పడుకోవడం వల్ల, చల్లని పొడి గాలులు, చప్పుడు, వెలుతురు, వ్యాధిగ్రస్థమైన వైపు పడుకున్నా, రాత్రి లేచినపుడు వ్యాధి లక్షణాలు ఉద్రేకిస్తాయి.

ఉపశమనం:

ఆరుబయట గాలిలో, విశ్రాంతి, చెమట పట్టినా కప్పుకొనకుండుట వల్ల రిలీఫ్ ఉంటుంది.

మానసిక లక్షణాలు:

చావన్నా, చీకటన్నా, దెయ్యాలన్నా భయం. రోగి తాను తప్పక చనిపోవుదువని బంధువులకి వీడ్కోలు చెప్పడం. శారీరక, మానసిక స్థాయిలో టెన్షన్ వల్ల నొప్పులు బాధలు, ఫిట్స్, ఆందోళనతో స్థిమితంగా ఒక చోట ఉండలేరు. భరింపలేని ఆవేదన, తన ఎదుట జరిగినవన్నియు కలలో జరిగినట్లుగా భావించుట వంటి మానసిక లక్షణాలుంటాయి.

శారీరక లక్షణాలు:

తల: జలుబు వల్ల తల భారం, తల బద్దలగుచున్నట్లు, తల వెంట్రుకలు ఊడపీకినట్లు తలనొప్పి ఉండడం, లేచుట వల్ల ఉద్రేకించు తల త్రిప్పడం ఉంటుంది.

కన్ను:

కన్నులు ఎర్రబడి వేడి, మంటగా ఉండే కండ్ల కలక, వెలుతురు చూచుట కష్టంగా ఉంటుంది. కనురెప్పల వాపు, దళసరిగా, గట్టిగా ఉండడం, అకస్మాత్తుగా చూప మందుగిస్తుంది.

చెవి:

చల్లగాలి తగులుట వల్ల చెవినొప్పి, చెవి వాపు, చెలిలో హోరు, ధ్వనులు పుట్టడం, ధ్వని యందు అయిష్టం ఉంటుంది.

ముక్కు:

మంచు, చల్లగాలికి తుమ్ములు, నీరు కారడం, ముక్కు దిబ్బడ, ఎర్రని రక్తస్రావం ఉంటుంది.

ముఖం:

ఎర్రగా, వెచ్చగా, కందినట్లు, వాపుగా ఉండడం, దవడల్లో నొప్పి, ఎడమవైపు పార్శ్వపు నొప్పి, ముఖానికి సంబంధించిన నరాల బాధలు, ఒక బుగ్గ ఎర్రగా, రెండవ బుగ్గ పాలిపోయినట్లుండుట, ముఖం ముడతలు పడి ఉంటుంది

నోరు:

నోరు చేదుగా, దుర్వాసనగా, పొడిగా, తిమ్మిరిగా మొద్దుబారినట్లుంటుంది. నాలుక తెల్లగా ఆర్చుకొనిపోయి మంటగా, దురదలో మొద్దుబారినట్లుండి మాట్లాడుట కష్టంగా ఉంటుంది. కొండనాలుక పొడుగై, నాలుకకు తగులుచున్నట్లుండడం, చిగుళ్ళ వాపు, మంట, పంటినొప్పి, చల్లదనానికి ఎక్కువవడం, పండ్లు పటపట కొరకడం ఉంటుంది గొంతులో మంట, పోటు వల్ల ఆర్చుకొని పోవడం, టాన్సిల్ వాపు వల్ల గొంతు నొప్పి ఉంటుంది.

జీర్ణకోశం:

నీరు తప్ప తక్కినవన్ని రుచికి చేదుగా ఉండడం, గొంతునొప్పి, అధిక దాహం, జీర్ణకోశం నుండి గొంతు వరకు మంట. ఆహారం చూచిన వికారం, ఎక్కిళ్ళు, తీస్సులు, అధిక దాహం, అతి మూత్రంతో రక్తం, ఉత్యంతో కూడిన ఆకుపచ్చని వాంతులు, చల్లని పానీయాలు పడవు..

దాహం, ముత్రం రాకపోవడం, భయం, ఆతురత, నీరసం, రాత్రిళ్ళు ఆసనంలో దురద, నిద్రలేమి, జిగట రక్తంతో ఆకుపచ్చని కలం, రక్తవిరేచనాలు, మొలల బాధకిది మంచి మందు.

జలుబు వల్ల పిల్లల్లో మూత్రం బంధింపబడి, మూత్రావయవాల్లో మంట ఉండి బాధతో అరుస్తారు. యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మూత్రనాళంలో మంటగా ఉండి మాత్రం వేడిగా, ఎర్రగా, కొద్దిగా, బాధతో పోవడం ఉంటుంది.

జననేంద్రియ లక్షణాలు:

పురుషుల్లో జననేంద్రియాల వాపు వల్ల సంభోగేచ్ఛ తగ్గడం, వృషణాల్లో వాపు, నొప్పితో గట్టి పడతాయి.

స్త్రీలలో గర్భాశయ వ్యాధుల వల్ల జననేంద్రియం ఆరిపోయి వెచ్చగా, వాపుగా, బాధగా ఉంటుంది. తెల్ల మైల చిక్కగా, పచ్చగా, విస్తారంగా అవుతుంది. వయసు పిల్లల్లో బహిష్టులు అణగారి పోవడం వల్ల ముక్కు నుండి రక్తం కారడం, బహిష్టులు ఆలస్యంగా, విస్తారంగా అవుతాయి. గర్భధారణలో హిస్టీరియా, భయం, గర్భస్రావం కావడం ఉంటుంది. బాలింతల్లో ప్రసవానంతర నొప్పులు, బాలింత జ్వరం, స్తనాల్లో నొప్పి, మిల్క్ ఫీవర్ వంటి లక్షణాలుంటాయి.

శ్వాసకోశ లక్షణాలు:

చలిగాలి, చల్లని పానీయాల వల్ల, చుట్ట, సిగరెట్స్ త్రాగడం వల్ల జలుబుతో కూడిన దగ్గులు, దద్దుర్లు అణిచిపెట్టడం వల్ల వచ్చే ఉబ్బసం వల్ల గురక, ఊపిరి పీల్చినప్పుడు స్వరపేటిక బాధ, వాపు ఉండి కఫంతో పాటు రక్తం పడడం, గుండెలో బరువు, ఛాతీలో నొప్పి, దగ్గ, ఆయాసం వల్ల లేచి కూర్చోవడం మానసికోద్రేకం, సారాయి త్రాగిన, చల్లగాలి తగిలిన తర్వాత కొద్దిగా దగ్గినా, నెమ్మదిగా ఖాండ్రించినా రక్తపు వాంతులవుతాయి.

పిల్లల్లో చల్లగాలికి క్రూప్ దగ్గులో ఊపిరాడక నిద్ర నుండి తరుచు లేవడం, దగ్గినప్పుడల్లా కంఠం చేతిలో పట్టుకోవడం ఉంటుంది. మూత్రం బంధింపబడడం ఉంటుంది

గుండె దడ వల్ల అస్థిమితం, భయం, గుండెలో కుట్టినట్లు నొప్పిగా ఉండి ఎడమ భుజంలోకి లాగినట్లుంటుంది.

రుమాటిజమ్:

వ్రాయుచున్నప్పుడు వ్రేళ్ళలో వాపు వేడి, నొప్పిగా ఉంటుంది. అరిచేతుల్లో చెమటలు, చేతులు చల్లగా ఉంటాయి. పిక్కలు లాగినట్లుంటాయి. మెడ నరం పట్టి భుజాల మధ్య బాధ ఉండి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కాళ్ళు చేతులు మొద్దుబారి తిమ్మిరెక్కడం ఉంటుంది. వెర్రెక్కించే నొప్పులతో రాత్రి నిద్రపట్టదు, ముట్టుకున్నా సహించలేరు.

చర్మంపై దద్దుర్లు, మంట, అడ్చుకొని పోయి ఎర్రగా వాపులో వేడిగా ఉంటుంది.

జ్వరాలు:

పిల్లలకు పండ్లు వచ్చేటప్పుడు, ప్రేవుల్లో నులిపురుగులు ఉండడం వల్ల, జలుబు వల్ల జ్వరం రావడం, బాలింత జ్వరం, పైత్య జ్వరం, క్షయ జ్వరం, ఇన్ఫెక్షువస్ జ్వరాల్లో టైఫాయిడ్, రక్తదోషం వల్ల కల్లు జ్వరాల్లో ఉపయోగపడుతుంది. అకస్మాత్తుగా వచ్చి ఉన్నట్టుండి తగ్గిపోయే అక్యూట్ ఫీవర్స్‌కి ఇది మంచి మందు.

నిద్ర:

ఆవలింతల వల్ల నిద్ర మత్తుగా ఉండడం, పగలు జరిగినవి, చూసినవి రాత్రి కలలోకి రావడం, అర్ధరాత్రి తర్వాత అస్థిమితం వల్ల, ఆత్రుత వల్ల నిద్రనుండి మేల్కోవడం వంటి లక్షణాలున్నవారికి ఎనోనైట్ మంచి మందు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version