Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-2

[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]

హోమియో మందులు-1: యాబ్రోటినం (Abrotanum)

ఇది ఉత్తర యూరోప్‌లో సదరన్ వుడ్ లేడీస్ లవ్‌గా పిలవబడే వృక్షజాతికి చెందిన ఆకులు, కాండం నుండి చేసిన కషాయంతో తయారవుతుంది. దీని ద్వారా గాడ్ఛెల్, కుషింగ్, డివెంటర్ ఔషధ గుణాల్ని రాబట్టడమైనది. ఇది లోతుగా పనిచేయు మందు.

స్థానాలు:

జీర్ణవయనాలు, చేతులు, కాళ్ళు, నరాలు, ఫైబ్రస్ టిష్యూ, సీరస్ మెంబ్రేన్స్

వ్యాధులు: జీర్ణకోశ వ్యాధులు, కండర వ్యాధులు, కీళ్ళ వ్యాధులు, హెక్టిక్ ఫీవర్, రుమాటిక్ ఫీవర్

పోలికలు:

సల్ఫర్, భైరాట కార్బ్, ఎథుజా, కాల్కేరియా కార్బ్

సహచరులు:

బ్రయోనియా, బెరీటా కార్బ్, అయోడియం స్టేనం, ఆంటింక్రూడమ్, ఎకోనైట్ బ్రయోనియా, హెపార్ సల్ఫ్ తర్వాత ఇది ఉపయోగించదగ్గ మందు.

ఉద్రేకం:

చల్లగాలిలో, రాత్రి, ఉదయం ఎక్కువవుతుంది

ఉపశమనం:

కదలిక వల్ల, నడిచినా రిలీఫ్ ఉంటుంది. ఇది చంటిపిల్లలు, చిన్న పిల్లలు, మధ్యవయస్సు స్త్రీలకు ఉపయోగపడే మందు. వీరిలో క్రూర అస్వభావిక టెంపర్మెంట్ ఉంటుంది.

స్వభావం:

రోగికి తగిన పోషణ లేక క్రిందిభాగం శుష్కించిపోయి ఉంటుంది. ముఖం పాలిపోయి, ముడతలు పడి చర్మం వదులుగా ఉంటుంది. చెమట, విరేచనాలు, రసి అణగారడం వల్ల రోగి కృశించిపోవడం దీని ప్రత్యేకత.

మయాజమ్:

సోరీ, ట్యూబర్‌క్యులార్ డయాథిసిస్. చలికి తట్టుకోలేరు. ఇది ఎడమ వైపు పనిచేయు మందు.

మోతాదు:

3 – 1M మదర్ టించర్‌ని సరిసమానంగా కాచి చల్లార్చిన నీటిలో కలిపి తేమ వల్ల, చలి వల్ల వచ్చే కాళ్ళు ఒరుపులకి, పుండ్లకు వాడాలి. ఎక్కువగా నడిచినా, నిలబడినా కాళ్ళ నరాలలో కలిగే నొప్పికి – పట్టించినా, కడిగినా నయమవుతుంది.

కారణాలు:

విరేచనాలు, ఇతర స్రావాలు ఉన్నట్టుండి ఆగిపోయినపుడు, పోషకాహర లోపం, తిన్నది వంటబట్టకపోవడం, జీర్ణశక్తి తక్కువగా ఉండడం, అరుగుదల లోపం వంటివి ముఖ్యకారణాలు.

మానసిక లక్షణాలు:

డిప్రెషన్, ఆందోళన, చిరాకు, కోపంతో అరవడం, ఎగ్జైట్‌మెంట్ వల్ల మెదడు మెత్తగా ఉన్నట్లు భావన, ఆలోచనా శక్తి తక్కువుగా ఉంటుంది. పెంకితనం ఎక్కువగా ఉంటుంది.

శారీరక లక్షణాలు:

తల నీరసంగా ఉండి నిలబెట్టలేరు. పిల్లల మెడ కృశించి ఉంటుంది. ఎడమ ప్రక్క భాగం చలి ప్రాకినట్లు ఉంటుంది. తలలో దురద ఉండి తగిన బాధగా ఉంటుంది. కంటి చుట్టూ నల్లని వలయాలుండి, పేలవంగా చూసినట్లు ఉంటుంది. మగ పిల్లలో ముక్కు పొడారి రక్తం కారుతుంది. ముఖం ముసలివారి లాగా ముడతలు పడి, శుష్కించి మొటిమలతో ఉంటుంది.

ఆకలి ఎక్కువగా ఉండి అజీర్ణం, కడుపులో మంట కడుపులో బిగపట్టినట్లు బాధ ఉండి దుర్వాసన గల వాంతులు, అజీర్ణ విరేచనాలుంటాయి. రాత్రిళ్ళు కోయుచున్నట్లు, నమిలి వేసినట్లు మంటతో నొప్పి ఉండి ఉదరంలో కడుప వ్రేలాడినట్లుండడం, చల్లగా ఉన్నట్లు భావన ఉంటుంది. స్వీట్స్ ఇష్టం. పొట్ట ఉబ్బరం. కొన్నిసార్లు మలబద్దకం ఉంటే, విరేచనాలుంటాయి. పాలలో ఉడికించిన రొట్టె తినవలెనని కోరిక ఉంటుంది. వ్యాధులు రూపాంతరం చెందడం (ఒక వ్యాది మరొక వ్యాధిగా మారడం) ఈ మందు ప్రత్యేకత. రోగలక్షణాలు ఒకదాని తర్వాత మరొకటి తారుమారవడం దీని ముఖ్య లక్షణం. విరేచనాలు తగ్గిన ఎడల కీళ్ళవాతం రావడం, కీళ్ళవాతం తగ్గిన మళ్ళీ విరేచనాలు లేదా గుండె రోగాలు లేదా ఫ్లూరసీ, ఫ్లూరైటిస్ వంటి ఊపిరితిత్తుల వ్యాధి లేదా మొలలు లేదా గవద బిళ్ళల వాపు కల్గుతుంది. మొలలు, నీళ్ళ విరేచనాలు మానినచో అజీర్ణ వ్యాధి కల్గుతుంది. గవద బిళ్ళల వాపు అణగారిపోయిన స్త్రీలలో స్తనాలు, పురుషుల్లో బీజాల వాపు కల్గుతుంది. పిల్లల్లో వరిబీజం రావడం, పిల్లల్లో కొంకి పురుగుల వల్ల తరుచు మలవిసర్జనానుమానం వల్ల పిల్లలు కృశించిపోవడం, చంటి పిల్లల్లో బొడ్డు నుండి రక్తం కారడం, ఎంత తిన్నా పిల్లలు చిక్కిపోవడం, తిన్నది తిన్నట్లే మలంలో పోవడం, జీర్ణశక్తి లోపం, అరుగుదల లోపం వల్ల పిల్లలు చిరాకుగా ఉంటారు.

స్త్రీలలో అండాశయాల్లో లాగినట్లు నొప్పి నడుంలోకి నస్తుంది. చల్లగాలికి శ్వాసకోశాల్లో బాధ. ఛాతిలో ఎడమవైపు భాగంలో కోయుచున్నట్లు నొప్పి రావడం, నాడీ బలహీనంగా ఉంటుంది

రుమాటిజమ్:

కాళ్ళు కృశించిపోవడం వల్ల నడవలేరు. కాళ్ళు తర్వాత, నడుం, రొమ్ము మెడ, ముఖం ఒక దాని తర్వాత శుష్కించిపోవడం జరుగుతుంది. రుమాటిజమ్‌తో గుండెలో ఇరిటేషన్, ముక్కు నుండి రక్తం కారడం, మూత్రంలో రక్తం పోవడం, ఆందోళన, కండరాల వణుకు వంటి పరిణామ లేర్పడతాయి. కాళ్ళు, చేతులు, వ్రేళ్ళ వాపు వల్ల కాళ్ళు చేతుల్లో క్రాంప్స్, కాళ్ళు వంగకపోవడం, మణికట్టు, చీలమండలంలో పచ్చిపుండు లాగా నొప్పితో వాపు ఉంటుంది. గౌట్, చిల్ బ్లెయిన్స్, ప్రాస్ట్ బైట్ వల్ల కాళ్ళు, చేతులు చలికి మొదు బారినట్లుండి సూదితో కుట్టినట్లుంటుంది. కాళ్ళు, చేతులు పచ్చి పుండు లాగా ఉండడం, రాత్రిళ్ళు వీపు, నడుంనొప్పి, చల్లగాలి వల్ల తేమగాలి వల్ల ఎక్కువవుతుంది. దురదతో ఉండు శీతలంచే శరీరంపై కల్గు వాపులకిది మంచి మందు.

క్షయ రోగంలో మిక్కిలి చలి, నిస్త్రాణంతో వచ్చే జ్వరంలోని ఇన్‌ఫ్లమేటరీ రుమాటిజమ్ వల్ల, ఇన్‌ఫ్లుయెంజా వల్ల వచ్చే జ్వరంతో నీరసించి, నడవలేకపోవడం, నిద్రలో అస్థిమితం, నిద్రలో తలకు అధిక చెమటలు పడతాయి. ఇవి ఈ మందు లక్షణాలు.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version