[ప్రభుత్వ హోమియో మెడికల్ ఆఫీసర్ డా. కె. ఉమాదేవి గారు అందిస్తున్న ఫీచర్ – ‘ప్రకృతి వనరులతో హోమియో వైద్యం’.]
హోమియో మందులు-17: ఆల్స్టోనియా స్కాల్ (Alstonia Scholaris)
పాలగరుడ, ఏడాకుల అరటి చెట్టు, ఏడాకుల పొన్నచెట్టు నుండి ఔషధ గుణాల్ని రాబట్టినవారు డా॥ హానిమన్. ఇది హిందూ దేశపు ఔషధం.
స్థానాలు:
దీనికి అన్నకోశం, ఆంత్రాలు, కీళ్ళపై ప్రభావం ఎక్కువ.
వ్యాధులు:
పొత్తికడుపు వ్యాధులు, మేహవాత నొప్పులు, నరాల బలహీనత ఉన్నవారికి ఇది మంచి మందు.
కారణాలు:
జననేంద్రియ, జీర్ణావయవాల దుర్లబత వల్ల వ్యాధులొస్తాయి.
స్వభావం:
ప్రతి చిన్నదానికి ఎగ్జైట్ కావడం వల్ల ముఖం పాలిపోయి ఉంటుంది.
పోలికలు:
చైనా.
మోతాదు:
3-30 పొటెన్సీలో వాడవచ్చు. మేహవాత నొప్పులకు, పుండ్లకు మదర్ టించర్‌ను కొబ్బరినూనె, గ్లిసరిన్‌లో కలిపి పైపూతగా వాడుతారు.
కాల పరిమితి:
1-5 రోజులు ఉంటుంది.
ఉద్రేకం:
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు, నడిచినా, ఎక్కువ అవుతుంది.
ఉపశమనం:
పడుకున్న రిలీఫ్ ఉంటుంది.
జీర్ణకోశ వ్యాధులు:
అన్నకోశం ఖాళీగా వున్నట్లు, పొత్తికడుపు లోపలికి లాగుతున్నట్లు భావన ఉంటుంది. వీరికి పొత్తికడుపు నొప్పి, అజీర్ణం ఉండి, భోజనం అయిన వెంటనే బాధ లేకుండా వచ్చు నీళ్ళ విరేచనాలు, రక్త విరేచనాలు, జిగట విరేచనాలు అవుతాయి. జ్వరంతో పాటు అతి నిస్త్రాణ ఉంటుంది.
బాలింతలలో పాలు తక్కువ కావడం, తెల్ల మైల పోవదం ఉంటుంది. స్త్రీలలో గుండెదడ, గర్భాశయ నిస్త్రాణ వల్ల బహిష్టు లోపాలుంటాయి. ఒవేరియన్ గ్రంథి లోపాలుంటాయి. గర్భిణీలలో వేవిళ్ళకు ఇది మంచి మందు.
జ్వరాలు, విరేచనాలు తరువాత వచ్చే నిస్త్రాణకు ఇది మంచి మందు. జీర్ణశక్తి తక్కువగా ఉంటడం వల్ల ఆహారం జీర్ణం కాదు. నాలుక మొదట్లో తెల్లని పూత ఉంటుంది.
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ, ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.
