[సూర్యదీప్తి గారు రచించిన ‘ప్రబోధం’ అనే కవితని అందిస్తున్నాము.]
విసిగిపోయావా
జీవితంలో ఎదురయే ఆటుపోట్లకు
అయితే విజేతవే అవుతావు..
చస్తే బాగుండనిపిస్తుందా??
ఏకబిగిన చుట్టుముట్టిన సమస్యలకు
ఇదే బతకాల్సిన సమయం..
ఈ లోకం తప్పించుకోవాలనుందా??
సమాధానం లేని లక్షల సవాళ్లకు
ఇపుడే.. కొంచం తట్టుకుని నిలబడితే
రేపటి నీ చరిత్ర నువ్వే రాస్తావు..
వెరుపు వెన్ను విరిచెయ్
గెలుపు పిలుపు వినిపిస్తుంది..
అలుపెరుగని పోరాటం నీదైతే
కలల కోట కనబడుతుంది..
లే మిత్రమా!!!
ఆపకు పయనం..
అగాధంలో కూరుకుపోతున్న నీ అడుగుల్ని
ఆశాసౌధం వైపు నడిపించు..
అడుగు ముందుకువెయ్
అద్భుతాలు సాధిస్తావు..
ఆగిపోయావో,ఆహుతి అయిపోతావు..
ఆపకు పయనం.