[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ప్రాపంచిక కోరికలు’ అనే రచనని అందిస్తున్నాము.]
భగవద్గీత 6వ అధ్యాయం, 10వ శ్లోకం:
యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః। ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః॥
యోగి అయిన సాధకుడు సదా తన మనస్సును, హృదయాన్ని, తన ఆలోచనలను, ఆత్మను భగవంతుని యందు నియుక్తం చేసి, అన్ని బంధాలకు దూరంగా ఒక ఏకాంత స్థలంలో ఒంటరిగా నివసిస్తూ, చిత్తశుద్ధితో, అభ్యాసయుక్తంగా మనస్సును నియంత్రించాలి. అతడు సమస్త కోరికల నుండి, భౌతిక సుఖాల నుండి, సాధనా దృష్టిని మరల్చే విషయ వాసనల నుండి ముక్తుడై వుండాలని పై శ్లోకం భావం.
నియంత్రిత మనస్సు మరియు శరీరంతో నిరంతరం ధ్యానంలో నిమగ్నమై, ఆనందం కోసం కోరికలు మరియు ఆస్తులను వదిలించుకోవాలి. ఈ సాధనా మార్గంలో ముఖ్య అంశం ఏకాంత ప్రదేశం ఆవశ్యకత. రోజంతా, మన చుట్టూ సాధారణంగా ప్రాపంచిక వాతావరణం ఉంటుంది. ఈ భౌతిక కార్యకలాపాలు, వ్యక్తులు మరియు సంభాషణలు అన్నీ మనస్సును మరింత ప్రాపంచికంగా మారుస్తాయి. ఈ కోరికల నుండి ఉత్పన్నమయ్యే ఆలోచనలు మనస్సును మరింత కల్లోలమయం చేస్తాయి. మనస్సును భగవంతుని వైపు మళ్లించాలంటే, ఏకాంత సాధన కోసం మనం రోజూ కొంత సమయం కేటాయించాలి. నిర్ధిష్ట ప్రదేశంలో నిర్ధిష్ట సమయంలో చేసే సాధన సత్ఫలితాలనిస్తుంది.
ప్రాపంచిక కోరికలు సముద్రపు నీరు లాంటివి, సముద్రపు నీరు ఎంత తాగినా దాహం తీరదు మరియు ప్రాపంచిక వ్యామోహం అన్నది ఎప్పటికీ తీరేది కాదు. మనస్సు ఈ కోరికల వాసనలకు బందీయై అనుక్షణం ఇంకా ఏదో కావాలి అనిపించేలా చేస్తుంది. కాబట్టి ప్రాపంచిక వ్యామోహం విడనాడి పరలోకం కోసం పాటుపడండి అంటూ మన శాస్త్రాలు కూడా సాధకులకు మార్గదర్శనం చేస్తున్నాయి.
భగవద్గీతలో మరొక శ్లోకంలో భగవానుడు ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా, నేను/నాది అన్న భావన లేకుండా, మరియు అహంకార రహితంగా ఉంటాడో, అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది అని కూడా చెప్పాడు.
అట్లే భగవంతుని కోసం ప్రార్థన చేసే వివిధ వర్గాల భక్తులలో నాలుగు రకాలు వుంటారని, నాలుగు వేర్వేరు కారణాల కోసం ప్రత్యేకంగా తనను వెతుకుతారని పేర్కొన్నాడు – సంపద, దుఃఖం నుండి ఉపశమనం, జ్ఞానం మరియు భగవంతుని పట్ల భక్తి. చివరి వర్గం ఆధ్యాత్మిక నిచ్చెనలో ఉన్నత స్థానంలో ఉంది, ఇది నిజమైన అన్వేషకుడు చివరికి భౌతిక మరియు ఇతర కోరికలను పక్కనపెట్టి జీవితంలోని అత్యున్నత లక్ష్యం అయిన మోక్షాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని సూచిస్తుంది. దీనిని బట్టి ప్రాపంచిక కోరికల కంటే భగవంతుని పొందేందుకు ఆధ్యాత్మిక కోరికలను కోరుకోవడం శ్రేయస్కరమని అర్థమవుతోంది.
ఆధ్యాత్మిక సాధన ప్రాపంచిక విషయాల పట్ల అయిష్టతతో ప్రారంభం కావాలని ఆధ్యాత్మికవేత్తలు ప్రబోధిస్తుంటారు. మనం ఈ లోకంలో జీవించవలసి వచ్చినప్పుడు, మన ప్రాపంచిక కోరికలు నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తాము. భగవంతుని దయ వల్లనే అన్నీ జరుగుతాయని మనం ఎప్పుడూ నమ్మాలి. మన ఆధ్యాత్మిక ప్రయత్నాలను నాశనం చేసే భౌతిక, ప్రాపంచిక కోరికలను మనం దూరంగా ఉంచుకోవాలి. ఈ కోరికలు మన మనస్సులో పుడతాయి. అవి పుట్టగానే వాటిని ఎప్పుడు తిరస్కరించాలో మరియు త్యజించాలో మనం తెలుసుకోవాలి. కోపం, కోరిక, దురాశ, మాయ, అహంకారం, గర్వం భగవంతునిపై దృష్టి పెట్టడానికి మన ప్రయత్నానికి ఆటంకం కలిగిస్తాయి. వాటిని వైరాగ్యం మరియు వివక్షతో ఎదుర్కోవడం నేర్చుకోవాలి.
ఆనందాన్ని అన్వేషిస్తూ భౌతిక ప్రాపంచిక కోరికల వెంటపడటం అనేది, ఎడారిలో ఎండమావి వెంట పడటం లాంటి వృథా ప్రయాసే అని మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి శాశ్వత ఆనందం కోసం, అనుపలభ్యమైన మానసిక ప్రశాంతత కోసం అనుక్షణం వాసనారహిత స్థితిని సాధించడం కోసం కృషి ప్రారంభించడం ఎంతో అవసరం. సాధనలో భాగంగా నెమ్మది నెమ్మదిగా కోరికలను తగ్గించుకుంటూ మనస్సును భగవంతుని వైపు మరల్చే ప్రయత్నం ప్రారంభించాలి.
ప్రపంచం నుండి మనల్ని మనం మూసివేసి, మనస్సును శుద్ధి చేయడానికి మరియు భగవంతునిపై దాని దృష్టిని పటిష్టం చేయడానికి చిత్తశుద్ధితో సాధన చేయాలి. ఈ విధంగా మనం ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు ఈ పద్ధతిలో సాధన చేస్తే, మనం ప్రాపంచిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ రోజంతా దాని ప్రయోజనాలను పొందుతాము.
You must be logged in to post a comment.
చదువు – అన్వీక్షికి – ఉగాది నవలల పోటీ (2023) విజేతల సన్మానసభ – నివేదిక
సరిగ్గా వ్రాద్దామా?-13
జ్ఞాపకాల తరంగిణి-34
గుంత
భాష – భవిత
సంచిక – పద ప్రతిభ – 102
హాస్యరంజని-3
నిరీక్షణ
చిన్నయ్య ఎండి కంకణం
‘కార్వేటినగరం కథలు’ బాలల బొమ్మల పుస్తక ఆవిష్కరణ సభ – నివేదిక
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®