ఓ ఇంటి పెరట్లో పొట్లకాయ పాదు, దొండకాయ పాదు ఇంకా రకరకాల కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఆ ఇంటి యజమాని చక్కగా అన్నిరకాల కూరగాయల మొక్కల్ని ప్రేమగా పెంచుకుంటున్నాడు. పక్కపక్కనున్న పందిళ్లపై పాకి ఉన్న పొట్లకాయ, దొండకాయ తీగలు రోజు మాట్లాడుకుంటూ ఉంటాయి. పైకి మామూలుగా మాట్లాడుతున్నప్పటికి పొట్లకాయకు తాను బాగా పొడుగ్గా ఉంటానని అహంకారం ఉంది. పొడుగ్గా ఉంటే అందంగా ఉంటారని అనుకుంటుంది. ఇలా మొదలైన దాని అహంకారం పెరిగి పెరిగి పొగరుగా రూపుదిద్దుకున్నది.
పొట్లకాయకు తాను పొడుగ్గా అందంగా ఉంటాననే కాకుండా, దొండకాయ పొట్టిగా, అందవికారంగా ఉంటుందని అనిపించసాగింది. అలా ఆలోచన వచ్చిందే తడవుగా తాను దొండకాయకన్నా గొప్పదాన్నని అనుకోవడంతో పాటు దొండకాయను అవహేళన చేయడం మొదలు పెట్టింది. ఈ మాత్రం సమయం దొరికినా, ఏ చిన్నపాటి అవకాశం లభించిన దొండకాయను వదలడం లేదు. పొట్లకాయ మాటలకు దొండకాయ చాలా బాధపడుతోంది. కానీ ఏం చేయలేకపోతున్నది. దూరంగా పారిపోదామా అంటే జంతువులకు ఉన్నట్లు తమకు కాళ్ళు చేతులు లేవాయే. ఎక్కడ ఉన్నవాళ్లం అక్కడే ఉండాలి. తమ తల్లిదండ్రులు ‘ఇరుగుపొరుగుతో మంచితనంగా ప్రేమగా ఉండాలి’ అని చెప్పారు. అందుకే పొట్లకాయతో ఎంత ప్రేమగా ఉన్న అది ఊరుకోవడం లేదు. దాని పొడుగును చూసుకొని విర్రవీగుతోంది. దొండకాయ తననింత పొట్టిగా పుట్టించినందుకు దేవుణ్ణి తిట్టుకొంది. ‘నేనెందుకింత అందవిహీనంగా ఉన్నాను’ నేను చేసిన పాపమేమిటి? అనుకుంటూ రోజు తనలో తాను కుమిలిపోసాగింది.
ఈ వ్యవహారాన్నంతా ఆ పక్కనే ఉన్న కాకరపాదు గమనించింది. విషయం కొద్దిగా అర్థమైన పూర్తిగా తెలుసుకుందామని దొండకాయను పలకరించింది. అడిగిందే తడవుగా తన మనసులోని బాధనంతా చెప్పేసుకుంది దొండకాయ. “నేను పొట్టిగా ఉండటం నా తప్పా? పొట్లకాయ ఎలా కూరగాయగా మానవులకు పనిచేస్తుందో నేను కూడా అలాగే కూరగాయగా పనికొస్తున్నాను కదా!” అంటూ బోరుబోరున ఎడ్చింది. కాకరకాయ దొండకాయను ఊరడిస్తూ ఇలా చెప్పింది. “దేవుని దృష్టిలో గొప్ప, తక్కువ తేడా లేదు. అందరూ సమానమే. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది! కాబట్టి మొదట నువ్వు ఏడవడం మానేసి ప్రశాంతంగా ఆలోచించు! అన్నీ నీకే అర్థమవుతాయి!” అన్నది.
దొండకాయ కొద్దిగా ఏడుపు ఆపి కళ్ళ నీళ్ళు తుడుచుకొని సరిగా కూర్చుంది. అప్పుడు కాకరకాయ మరలా ఇలా చెప్పింది. “చూడు! నన్ను కూడా అందరూ చేదు చేదని అసహ్యించుకుంటారు. పిల్లలైతే నన్నసలు ముట్టుకొనే ముట్టుకోరు. ఇంకా నా చర్మం ముడుతలు పడి ఉంటుందని ముసలమ్మని అంటూ ఎగతాళి చేస్తారు. అయినా నేను ఇవేవి పట్టించుకొను. నన్ను ఇంతగా అసహ్యించుకున్నా షుగర్ వ్యాది ఉన్నోళ్ళు నన్ను ఎంతో ప్రేమగా తింటారు. నాలో షుగరు వ్యాధిని తగ్గించే గుణాలు ఉన్నాయట. మానవులు తినటానికి కూరగాయగా పనికిరావడమే కాకుండా వారి వ్యాధుల్ని కూడా తగ్గించగలుగుతున్నానన్నసంతోషం ముందు ఈ ఎగతాళులు ఎంత మాత్రం నన్ను బాధించవు! అలాగే నువ్వు కూడా ముందు బాధపడటం మానెయ్యి. చక్కగా తిని ఆరోగ్యంగా ఉండు. చూడు నీరసంతో ఎలా చిక్కి శల్యమయ్యావో!”. దాంతో దొండకాయ కొంత ఊరట చెందింది. “అంతేనంటావా! నాకు ఈ లోకంలో గుర్తింపు ఉందంటావా?” ఇంకా పూర్తిగా అనుమానం పోక అడిగింది.
“చూడు దొండకాయ మిత్రమా! అసలు నీ గొప్పదనం నీకు తెలియడం లేదు. మానవుల్లోని మహా మహాకవులు అందగత్తెలైన స్త్రీల పెదవుల్ని ‘దొండకాయ వంటి పెదవులు’ అని నీతో పోలుస్తారు తెలుసా! నేవ్వెమో కథలు చదవవు. నీకేమో పుస్తకాలు చదివే అలవాటే లేదాయే! అతిలోక సుందరులైన రంభ, ఊర్వశి, మేనకల్నైనా ఎర్రగా పండిన ‘దొండపండు వంటి పెదవులు’ అంటూ పొగడాల్సిందే. నీ ప్రత్యేకత ఎవరికీ లేదు!” అంటూ వివరిచింది.
ఇప్పుడు దొండకాయకు ఇంకాస్త ధైర్యం వచ్చింది. ‘నేను అందమైన ఆడవాళ్ళ పెదవుల్లా ఉంటానా’ అనుకుంది. ‘నేను ప్రత్యేకమైనదాన్నని నాకు తెలిసొచ్చింది. నాకు పిరికితనం పోయి ఆత్మవిశ్వాసం వచ్చింది. మరి ఈ పొట్లకాయ ఆగడాలు ఇలా భరించాల్సిందేనా! దీనికేం దారిలేదా!’ మళ్ళీ బేలగా అడిగింది. దానికి కాకరకాయ సమాధానంగా దొండకాయ తల నిమురుతూ ఇలా చెప్పింది. “చూడు మిత్రమా! ప్రతిదానికీ ఒక సమయమంటూ ఉంటుంది. ఆ సమయం వచ్చినపుడు ఏది ఎలా జరగాలో అలా అరుగుతుంది. దాని మాటలు పట్టించుకోవద్దు. సృష్టిలో ఎన్నో మొక్కలు ఉన్నాయి. ఏడిపించేవారిని వదిలేసి నీతో మంచిగా ఉండేవారితో స్నేహం చెయ్యి. ఏమి బాధపడకు. ధైర్యంగా ఉండు” అంటూ ఉపదేశించింది. దాంతో దొండకాయ పూర్తిగా శాంతించింది. పొట్లకాయను మరిచి మిగతా స్నేహితులతో సంతోషంగా ఉండసాగింది.
ఇలా ఉండగా ఒకరోజు ఉదయం నిద్రలేచేసరికి ఇంటి యజమాని పొట్లపాదును తీసేస్తున్నాడు. తీగలన్నీ పీకేసి చెట్టు మొదలును తవ్వేస్తున్నాడు. పొట్లకాయ విపరీతమైన బాధతో ఏడుస్తున్నది. తనను చంపొద్దని యజమానిని ప్రాధేయపడుతుంది మౌనంగా. యజమాని అలా ఎందుకు చేస్తున్నాడో దొండకాయకు అర్థం కాలేదు. ఎంటా అని పక్కనే ఉన్న కాకరచెట్టు వంక చూసింది.
అప్పుడు కాకరచెట్టు ఇలా చెప్పింది. “రాత్రి యజమాని వాళ్ళ చిన్న కొడుకు చీకట్లో పొడుగ్గా పెరిగిన పొట్లకాయను చూసి పాము అని జడుసుకున్నాడట. రాత్రి నుంచి జ్వరం తగ్గలేదు. పిల్లాడు బాగా భయపడ్డాడు. అందుకే యజమాని పొద్దున్నే ఈ చెట్టును పీకేస్తున్నాడు. చూశావా ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నువ్వు దాని పొగరు చూసి భయపడ్డావు. దాని ఆకారాన్ని చూసి పొట్లకాయ గర్వించింది కానీ పిల్లాడు పామని ఎలా భయపడ్డాడో చూడు. మన గొప్పదనాన్ని ఇతరులు గొప్పగా చెప్పుకోవాలి కానీ మనకు మనమే గొప్పనుకోకూడదు. నువ్వు ఇకనుంచైనా ఆత్మవిశ్వాసంతో మెలుగు. ఎవరేం చెప్పినా, ఎవరేం అన్నా పట్టించుకోవద్దు. నీ సంతోషమే నీకు ముఖ్యం.”
అప్పటి నుంచీ దొండకాయ సంతోషంగా ఉండసాగింది. ఏడిపించే వాళ్ళను వదిలేసి స్నేహితంగా ఉండేవాళ్ళతో కలిసి ఉండసాగింది.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అంబారి మీద అక్షరం
సినిమా క్విజ్-15
సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో.. 9
అన్నింట అంతరాత్మ-23: బహుళ ప్రయోజనకారి ‘బల్లను’ నేను!
వ్యామోహం-7
‘మేకల బండ’ నవల ఆవిష్కరణ – ప్రెస్ నోట్
మృత్తికానందం
ఎవరి కెరుక?
సభ్య సమాజానికి సంధించిన బాణం ‘లాయర్ విశ్వనాథ్’
ఒకటే మెట్టు
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®