సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    తల్లాప్రగడ మధుసూదనరావు

    నరసింహయ్య గారి వ్యక్తిత్వాన్ని శంకించవలసిన అవసరం లేదు.
    కాని,
    ఆయన కొన్ని అభిప్రాయాలు వివాదాస్పదంగా ఉండేవి ఆ రోజులలో. ముఖ్యంగా వైట్ ఫీల్డ్ లోని కాలేజీని బెంగుళూరు యూనివర్శిటీకి అనుబంధం చేసే విషయంలో.
    ముఖ్యంగా సత్యసాయి బాబా విషయంలో.
    ప్రభుత్వంలోని మంత్రులు ఉన్నతాధికారుల పై సత్యసాయిబాబా ప్రభావం చాల ఎక్కువగా ఉండేదని ఆయన అభిప్రాయం. ఆ అభిప్రాయం కొంతవరకూ నిజం కూడ. అయితే ఆయన భక్తులకు వెరచి తను రాజీనామా చేసినట్లు నరసింహయ్య గారు చెప్పారు.
    1972లో నరసింహయ్య గారిని ఉపకులపతి గా నియమించడంలో అప్పటి రాష్ట్రపతి శ్రీ వివిగిరి రాష్ట్ర ముఖ్యమంత్రుల జోక్యం ఉందని పలు విమర్శలు పత్రికలలో వచ్చాయి.

    ఒకరి నమ్మకాలు విశ్వాసాలు వ్యక్తిగతాలు.

    ఈ మధ్యన చంద్రయానం , ఆదిత్య రాకెట్లు ప్రయోగించిన సందర్భంలో కూడ శాస్త్రవేత్తలు దేవాలయ సందర్శనలు చేయడం, భగవంతుని ఆరాధించడం చూసాము.
    అది తప్పా రైటా అని నిర్ణయించడం మన పరిమితికి మించినది.

    సైన్స్ కి అందని ఒక అపురూపమైన శక్తి ఉందని నమ్మడం మూఢనమ్మకం అవదు.

    డా. సూరి భగవంతం , గోకక్ ల నమ్మకాలను నిష్కల్మష చరిత్రగల నరసింహయ్యగారు
    విమర్శించడం కొంచెం బాధాకరం అన్పించింది.

    సత్యసాయిబాబా కి పూర్వమే సూరి భగవంతం గారు రమణ మహర్షికి భక్తులు.

    ఏమైనా నరసింహయ్య గారు గత శతాబ్దంలో జీవించిన ఒక విశిష్టమైన వ్యక్తి. ప్రజల మనిషి.
    వారి ఆత్మకథ చాల ఆసక్తికరంగా ఉంది.
    మంచి ఆత్మకథను తెలుగువారికి సరళమైన తెలుగులో పరిచయం చేస్తున్నందుకు
    మీకు ధన్యవాదాలు.

  2. 2

    జి.యస్.బదరీనాథ్

    వారు దేవుని, పునర్జన్మని నమ్ముతున్నాను అని వైట్ ఫీల్డ్ మీటింగ్ లో చెప్పారని ఉటంకించారు.అది కూడ మూఢనమ్మకం కదా?

    1. 2.1

      కోడీహళ్ళి మురళీమోహన్

      ఇదే ప్రశ్నను నరసింహయ్యగారిని వారి శిష్యుడు ఎస్.ఆర్.హెరంజాల్ అనే విద్యార్థి ప్రశ్నించినప్పుడు వారు దానిని ఒప్పుకుంటూనే “కావచ్చప్పా, ఐతే అది హైక్లాస్ మూఢనమ్మకం కావచ్చు” అని సరదాగా బదులిచ్చారు.

    2. 2.2

      కోడీహళ్ళి మురళీమోహన్

      ఇదే ప్రశ్నను నరసింహయ్యగారిని వారి శిష్యుడు సుభాష్ రఘువీర హెరంజాల్ అనే విద్యార్థి అడిగినప్పుడు వారు దానిని ఒప్పుకుంటూనే “కావచ్చప్పా, ఐతే అది హైక్లాస్ మూఢనమ్మకం కావచ్చు” అని సరదాగా బదులిచ్చారు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!