[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘పూల రెక్కల పులకరింతలు’ అనే రచనని అందిస్తున్నాము.]
చెట్టు యొక్క భాగాలలో పువ్వు అత్యంత అందమైనది. అధిక ప్రాధాన్యత కలిగినది కూడా. ఎందుకంటే పువ్వు ఒక ప్రత్యుత్పత్తి అవయవం. ఇందులో అండాలు, కేసరాలు, కీలాగ్రం, కీలం, రెక్కలు అనే ఆకర్షణ పత్రాలు, రక్షక పత్రాలు, పుష్పవృంతం, పుష్పాసనం అనే అనేక భాగాలుంటాయి. రక్షక పత్రావళి సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పుష్పానికి అడుగు భాగాన రక్షక పత్రాలు ఉంటాయి. ఆకర్షణ పత్రాలు రంగు రంగుల్లో పేరుకు తగ్గట్టుగా ఆకర్షణీయంగా ఉంటాయి. నీలం, తెలుపు, పసుపు, ఎరుపు, నారింజ వంటి అనేక రంగుల్లో పువ్వులు అత్యంత మనోహరంగా ఉంటాయి. పువ్వు మధ్యభాగంలో అండాశయం ఉంటుంది. అండాశయంలో అండాలు తయారవుతాయి. అండాశయం పైభాగాన కీలము, చివర భాగాన కీలాగ్రం ఉంటుంది. వీటికి పక్కగా అనేగా కేసరాలుంటాయి. కేసరాల చివరి భాగాన పరాగ కోశం, పుప్పొడి రేణువులు ఉంటాయి. అయితే నేనీ రోజు పూరెక్కలతో బొమ్మలు చెయ్యాలనుకుంటున్నాను. పుష్పంగా ఉన్నప్పుడే కాకుండా విడివడిన రెక్కలతో సైతం ఎన్నో అలంకారాలను చేయవచ్చు. నేను చేసిన కొన్ని పూలరెక్కల అందచందాలను చూడండి.
‘జింజిబరేలిస్’ క్రమానికి చెందిన ‘జింజిబరేసి’ మొక్కల పూలు ఎర్రగా మొక్కజొన్న కంకి లాగా ఉంటాయి. వీటిని సంప్రదాయ వైద్యంలో వాడతారట. చాలా చోట్ల వీటితో తల స్నానం చేస్తారు. ఈ పూల కంకిని పిండుకుని వచ్చే రసాన్ని షాంపూ వలె ఉపయోగించుకుంటారు. ఈ పూల యెక్క శాస్త్రీయ నామం ‘అల్పీనియా పర్పురాటా’ అంటారు. ఈ చెట్టు ఆకులు చాలా పొడవుగా ఉంటాయి. కొన్ని చారలతో ఉంటాయి. పుష్పగుచ్ఛం అత్యంత ఆకర్షణీయంగా దూరం నుంచి కూడా కొట్టొచ్చినట్లు కనబడుతుంది. బహుశ అందుకే గార్డెన్లలో పెంచుతారేమో! మా బెంగుళూరు ఇంటి గార్డెన్లో సైతం అందంగా మెట్ట తామర చెట్ల పక్కన అంతే అందంగా పోటీపడుతూ ఉంటుంది. నేను వాకింగ్ చేస్తూ దీని అందానికి రోజూ ముగ్ధురాలై పోతాను. దీనితో బొమ్మలెలా చేయాలా అని ఆలోచించి ఒక రోజూ కంకిని కోసుకెళ్ళాను. తీరా గమనించాక రెక్కలు చక్కగా విడివడుతున్నాయి. రెక్కల్ని తుంపి తెల్లని పళ్ళెంలో పేర్చటం మొదలు పెట్టాను. తెల్లని తెలుపు మీద ఎరుపు రంగు రెక్కలు అందంగా కనిపించాయి. ఇంకా మధ్యలో ముగ్గులాగా అందంగా అమర్చాను. నా కళ్ళకు ముచ్చటగా అనిపించింది. ఇంకా అక్కడక్కడా కరివేపాకు, కొత్తిమీర ఆకుల్ని కాంట్రాస్ట్‌గా అమర్చాను. జింజిబరేసి పూల అందం రెట్టింపంయింది కదూ!
ఎక్కడ చూసినా బంతులు, చామంతులు పూల అలంకారంలో చోటు చేసుకుంటాయి. పెద్ద పెద్ద రంగవల్లలు, రూమ్ డెకరేషన్‌కు బంతులు, చామంతులే ప్రధాన పాత్ర వహిస్తాయి. అయితే నేను ముళ్ళుండే ముళ్ళ గోరింట పువ్వును ఎందుకు వాడకూడదు అని ఆ పూలను కోసుకోచ్చాను. పచ్చని పసుపు రంగుతో పొడుగైన రెక్కలతో అందంగా ఉటుందీ పువ్వు. చిన్నప్పుడు ఈ పూల రెక్కల్ని తెంపి నోట్లో పెట్టుకుని బుడుగలు చేసేవాళ్ళం. తడికి పూల రెక్క ఉబ్బి ఋడుగలా మారేది. దాన్ని చెల్లి నుదిటి మీదో తమ్ముడి బుగ్గ మీదో పెట్టి కొడితే ‘టాప్’ మంటూ పగిలేది. ఈ ఆట పిల్లలకు చాలా సరదాగా ఉండేది. ‘అకాంథేసి’ కుటుంబానికి చెందిన ముళ్ళ మొక్క దీని శాస్త్రీయనామం ‘బార్లేరియా ప్రియోనిటిస్’. ఇది కేవలం అలంకారానికే కాకుండా జానపద ఔషధాలలో ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పెరిగే మొక్క ఇది. ఈ పూలను కుండీ నుంచి తెంపి పెట్టుకున్నాను. ఒక్కో రెక్కను విడదీసి ఒక వస్త్రoపై పరిచాను. ఇప్పుడు గులాబీ రెక్కలను జంటగా కలిపి డిజైనుగా మార్చడం ప్రారంభించాను వీటిలో రెక్క నందివర్దనాలను సైతం పెట్టాను. అందమైన అలంకరణ తయారయింది. మేము బి.ఎస్.సి చదివేటప్పుడు టెక్స్ట్ బుక్‌లో ఈ కొమ్మ ఫొటో లేనందున చెట్టు కొమ్మను తెచ్చి వెయ్యమన్నారు. అలా వేసిన బొమ్మలలో నా ముళ్ళ గోరింట కొమ్మ బాగుందని మా మేడమ్ పొగడ్త నాకిప్పుడు గుర్తొచ్చింది.
పిచ్చి మొక్కలు, తుమ్మ చెట్లు మొలిచే చోట జిల్లేడు, ఉమ్మెత్త, చెట్లు కూడా కనిపిస్తుంటాయి. మామూలుగా ఇవి పిచ్చిమొక్కల్లా ఎక్కడంటే అక్కడ పెరుగుతాయి కాబట్టి ఎవరూ పట్టించుకోక పోయినా సైన్స్ స్టూండెంట్లకు జిల్లేడు, ఉమ్మెత్త చెట్లు ఆయా కుటుంబాల చెట్లుకు ఉదాహరణలుగా చెపుతారు. వాటి బొమ్మలు రికార్డులలో వేయిస్తారు. ఈ చెట్టు కొమ్మను కోయగానే పాలు కారతాయి. తెలుపు, లామెడర్ రంగుల మిశ్రమంతో పూష్పాలుంటాయి. ఇది మైనపు పూతతో ఉంటాయి ప్రతి పువ్వు ఐదు కోణాల రేకులతో ఉంటుంది. కేసరాల పైన చిన్న కిరీటంలా ఉంటుంది. దీని పేరు ‘కేలోట్రాపిస్ జైగాన్షియా’. ఈ పూల కోసం కీటకాలు, సీతాకోక చిలుకలు వస్తుంటాయి. ఈ పువ్వులను ధాయిలాండ్‌లో రాజరికపు చిహ్నాలలో ఉపయోగిస్తారు. నేను ఈ పువ్వులతో అలంకరణ చేశాను. పూల గుత్తులు కోసుకొచ్చి ఓవల్ ఆకారంలో పరిచాను. మధ్యలో పీస్ లిల్లీ పూల కేసరాలను పెట్టాను. దానిమ్మ పువ్వు అందానికి లోనైన నేను అన్ని డిజైన్స్‌లో పెట్టటం మొదలుపెట్టాను. ఎవరూ పట్టించుకోని, విలువ ఇవ్వని పువ్వులతో డిజైన్లు చేసి అందం రాబట్టింది నా ప్రయత్నం.
మరొక అలంకారం మెట్టతామర పూలతో చేశాను. మామూలుగా మెట్టతామర పూలు ఎర్రటి ఎరుపురంగు పూలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. పల్లెటూర్లలో నీళ్ళ తోట్ల పక్కనే ఈ చెట్లు ఉంటాయి. పసుపురంగు మెట్ట తామరలు కూడా అక్కడక్కడా కనిపిస్తాయి. ఇది కూడా జింజిబరేలిస్ క్రమానికి చెందిన మొక్క పెద్ద పెద్ద ఆకులతో ఉంటాయి. అరటి ఆకుల్లా చుట్టలు చుట్టుకుని ఉంటాయి. చిన్నగా ఉన్నప్పుడు ఉండే చుట్టలు చుట్టుకున్న ఆకులలో సైతం ఎన్నో అలంకరణలు చేశాను. ప్రస్తుతం నేను అరుదుగా ఉండే కనకాంబరం రంగులోని మెట్ట తామర పూల రెక్కలతో అలంకరణ చేశాను. ఆ ‘కన్నా కాక్సీనియా’ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పువ్వు రెక్కల్ని తెంపి నల్లని పళ్ళెంలో అమర్చాను. దీనికి జింజిబరేసి పువ్వుల్ని జత పరచాను. ఇంకా పసుపు రంగు మెట్ట తామర రెక్కల్ని మధ్యలో పెట్టాను. పసుపురంగు మెట్ట తామరను ‘కన్నాగ్లాకా’ అంటారు.
మోదుగు పూల రెక్కల అలంకారాన్ని చూద్దాం. శివరాత్రి సమయంలో చెట్టు నిండా పువ్వులే కనిపిస్తాయి. ఈ పూలను అగ్ని పూలు అని కూడా పిలుస్తారు. ఇది పాబేసి కుటుంబనికి చెందింది. ‘బుటియా మోనోస్పెర్మా’ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మోదుగు పూలతో రంగుల్ని తయారు చేస్తారు. హోలీ పండుగకు కావాల్సిన రంగుల్ని తయారు చేస్తారు. పరమశివుడికి ఈ పూలంటే ప్రీతి కావున శివరాత్రికి ఈ పూలతో పూజ చేస్తారు. మోదుగు పూలు పేరుతో నవలలు, ఇతర సాహిత్యమూ చాలా వచ్చాయి. సాంప్రదాయ వైద్యంలో దీనికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. కన్నడంలో దీనిని బ్రహ్మవృక్ష, ముత్తుగ అని పిలుస్తారు. తెల్లని పళ్ళెంలో మోదుగు పూలను అందంగా అలంకరించారు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జ్ఞాపకాల తరంగిణి- కొత్త ఫీచర్ ప్రారంభం – ప్రకటన
మలిసంజ కెంజాయ! -3
పరిత్యక్త ఎవరు?
ఫస్ట్ లవ్-20
క్వీన్ ఆఫ్ ఇండియన్ రివల్యూషన్… మేడమ్ భికాజీ రుస్తుంజీ కామా
నియో రిచ్-13
నవలా రాణికి పద్య నివాళి!
సినిమా క్విజ్-11
ఎండమావులు-2
భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 1
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®