[డా. కందేపి రాణీప్రసాద్ గారు రచించిన ‘ప్లాస్టిక్ కాలుష్యం’ అనే రచనని అందిస్తున్నాము.]
ప్లాస్టిక్ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. గ్ర్రీకు పదమైన ‘ప్లాస్టికోస్’ నుండి ప్లాస్టిక్ అనే పదం ఉత్పత్తి అయింది. ‘ప్లాపికోస్’ అంటే ‘అచ్చు’ లేదా ‘అచ్చు వేయగల సామర్థ్యం’ అని అర్థం చెప్పవచ్చు. పాలిమర్ లను ప్రధాన పదార్థంగా ఉపయోగించే వాటినే ప్లాస్టిక్లు అంటారు. సింథటిక్ లేదా సెమీ సింథటిక్ పదార్థాల విస్తృత శ్రేణియే ప్లాస్టిక్‌గా రూపొందుతుంది. ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేయడంలో చవకగా తయారవుతుంది. ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటుంది. తేలికగా ఉంటుంది. వాడుకోవడానికి శుభ్రంగా ఉoటుంది. సహజ వాయువు, పెట్రోలియంల వంటి శిలాజ ఇంధనాల నుండి వచ్చే రసాయనాల తోనూ ప్లాస్టిక్లు తయారుచేయబడతాయి.
పాలిమర్ ఫిజిక్స్ యొక్క పితామహుడిగా పేరు పొందిన రసాయన శాస్త్రవేత్త పేరు ‘హర్మన్ మార్క్’, న్యూయార్క్ లోని లియో బాక్ల్యాండ్ మొదటి సారిగా ప్లాస్టిక్ అనే పదాన్ని 1907లో రూపొందించారు. 20వ శతాబ్దంలో ప్లాస్టిక్ సాధించిన విజయాన్ని, ఆక్రమించుకున్న స్థలాన్ని అంచనా వేయలేనంతగా పెరిగింది. కేవలం 2020 లోనే 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అయింది. ప్లాస్టిక్ తన ప్రపంచాన్ని విస్తృతంగా పెంచుకుంటూ పోయింది.
సహజ రబ్బరు సెల్యులోజ్, కొల్లాజేన్ వంటి పదార్థాల రసాయన మార్పుల వలన ప్లాస్టిక్‌గా మారతాయి. పందొమ్మిదో శతాబ్దంలో పారిశ్రామిక విప్లవంలో భాగంగా రసాయన శాస్త్రం అభివృద్ధి చెంది ప్లాస్టిక్ కనుగొనబడింది. ఇంత ఆనందంగా కనుగొనబడ్డ ప్లాస్టిక్ భూమిలో కలవడానికి ఎక్కువ సంవత్సారాలు పడుతుండడం వలన కష్టాలు మొదలైనాయి. భూమిని కప్పేసినట్లుగా ప్లాస్టిక్ కవర్లు తుట్టెలు తుట్టెలుగా ఉండటం మూలంగా భూమి లోపలి పొరల్లో ఉండే జీవులు చనిపోతున్నాయి.
1907లో బేకలేట్చే ఆవిష్కరింపబడ ప్లాస్టిక్ నేడు మానవ మనుగడకే కాదు ప్రతి జీవి మనుగడకూ చేటుగా మారింది. ప్లాస్టిక్‌తో డబ్బాలు, కవర్లు, బకెట్లు, మగ్గులు, ఆహారపదార్థాలు నిలవచేసుకునే ప్రతి వస్తువూ తయారవుతోంది. పూర్వo రాగి, ఇత్తడి, స్టీలు వంటి వాటి స్థానాన్ని ప్లాస్టిక్ పూర్తిగా ఆక్రమించేసింది. అంతే కాక మామిడాకులు, పూలగుత్తులు సైతం ప్లాస్టిక్‌తో తయారవుతున్నాయి. ఇదంతా చూసిన సాహిత్యాకారులు ప్లాస్టిక్ నవ్వులే వచ్చేశాయి అని కవిత్వీకరిస్తున్నారు. చైనా తయరీ ప్లాస్టిక్ బొమ్మల్లో అధిక విష రసాయనాలున్నాయని చెప్పండంతో చాలా మంది పిల్లలకు వాటిని ఇవ్వడం లేదు. ప్లాస్టిక్ భూప్రపంచంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి అందర్ని తన కవచం కిందికి లాక్కునే సూచనలున్నాయిు.
ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి 1950వ సంవత్సరంలో ఒకటిన్నర మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లుగా లెక్కల్లో తేలింది. అదే 2018వ సంవత్సరం నాటికి దాదాపుగా 4.8 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకున్నదని అంచనా వేస్తోంది. ఎవరెస్ట్ శిఖరం మీద సైతం ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టల్లా పేరుకుంటూ ఉన్నాయని పర్యావరణ వేత్తలు పేర్కోoటున్నారు. ప్రపంచం లోని సముద్రాల్లో సైతం ప్లాస్టిక్ వ్యర్థాలు కొండల్లా అడ్డుకుంటున్నాయని వాపోతున్నారు.
భూమి, నీటిని ప్లాస్టిక్ కాలుష్యం ప్రభావితం చేస్తున్నది. ఆకాశం లోకి కూడా అనేక ఉపగ్రహాలను పంపడం వలన కూడా ఎన్యో వ్యర్థాలు చేరుకుంటున్నాయి. నదులు, చెరువులు, వాగులు, వంకలు, కాలువలు, సముద్రాలు, సరస్సులు అన్నీ ప్లాస్టిక్ కు బలవుతున్నాయి. ప్లాస్టిక్ చెత్త, కాలవల్లో అడ్డం పడటం వలన వీరు సరిగా పారకపోవడం వల్ల పంటలకు సరిగా నీరు అందక ఎండిపోతున్నాయి. అదే విధంగా డ్రైనేజి కాల్వలకు ప్లాస్టిక్ నిల్వలు అడ్డుపడటం వలన మురుగు నీరు సరిగా ప్రవహించక రోడ్ల మీదకు పొంగి పోర్లి అనేక జబ్బులకు దారి తీస్తోంది. చెరువుల్లో పూడికలు నిండిపోయి ఎక్కువ వాన నీరు నిలవటానికి అవకాశం లేకుండా ఉంటుంది సముద్రాల్లోకి చేరిన ప్లాస్టిక్ వ్యర్థాల వలన అనేక సముద్ర జీవులు చనిపోతున్నాయి తీర ప్రాంతాల నుండి సముద్రం లోకి ప్రతి ఏటా 1.1 నుండి 8.8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు మూడు రకాలు. కాలుష్యానికి కారణమైన మైక్రో, మాక్రో, మెగా ప్లాస్టిక్స్ అనే మూడు రకాల ప్లాస్టిక్కులు ఉన్నాయి. ఉత్తరార్ధ గోళంలో మైక్రో ప్లాస్టిక్లు, మెగా ప్లాస్టిక్కులు అత్యధిక సాంద్రతతో పేరుకుపోయాయి. ఇంకా ఇవి నీటి నిల్వల చుట్టూ పేరుకుపోయి ఉన్నాయి చెత్తను మోసుకుపోయే వాగులు, ప్రవాహాల వలన ద్వీపాల తీరంలో గుట్టలుగా పేరుకున్నాయి. ప్యాకేజింగ్ వస్తువులు, పాదరక్షలు, ఫిషింగ్ నెట్లు వంటివి ఎన్నో ద్వీపాలలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఓడల నుండి పడవల నుండి విసిరేయుడిన ప్లాస్టిక్కులు సముద్రాల అడుగున గుట్టల్లా ఉoడటం వలన ఎన్నో చేపల మృతికి కారణమవుతున్నాయి.
ప్లాస్టిక్ వ్యర్థాలతో ప్రాథమిక, ద్వితీయ చెత్తగా వర్గీకరించవచ్చు. ప్రాథమిక ప్లాస్టిక్ వ్యర్థాలంటే వాటి అసలు రూపాలలోనే ఉండేవి. అంటే సీసాల మూతలు సిగరెట్టు పీకలు, మైక్రో బీడ్ల వంటి వాటిని ప్రాథమిక రూపాలు అనవచ్చు. సీసాల వంటివి విరిగిపోయి చిన్న చిన్న రూపాలుగా మారిపోతే వాటిని క్షీణించిన ప్లాస్టిక్ ద్వితీయ కాలుష్య కారకాలుగా వర్గీకరించవచ్చు. ప్లాస్టిక్ శిథిలాలు 20 మి.మీ ల కంటే ఎక్కువగా ఉంటే ‘మైక్రోడెబ్రిస్’ అంటారు.
2004లో జరిపిన ఒక అధ్యయనంలో యూరప్, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా వంటి ఖండాలలోని నీళ్ళలో మైక్రో డెబ్రిస్ ఉన్యాయని ‘రిచ్చర్డ్ థాంప్సన్’ అనే శాస్త్రవేత్త తెలిపారు. పారిశ్రామిక వనరుల నుండి ప్లాస్టిక్ గుళికలు అతిచిన్న ప్లాస్టిక్ ముక్కలుగా విభజించ బడుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ ప్లై వ్రౌత్ నుంచి థాంప్సన్ చేసిన పరిశోధనలో సముద్ర గర్భంలో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో లక్ష ప్లాస్టిక్ కణాలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే సముద్ర ఉపరితలంలో అయితే చదరపు కిలోమీటర్ పరిధిలో మూడు లక్షల ప్లాస్టిక్ కణాలు ఉంటాయని తెలిపారు. అలాగే సముద్రాల అడుగున ఉన్న భూమిపై ఎంత మందంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకున్నయనేది కనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దీని కోసం పదిహేడు దేశాలలోని బీచ్ లలోని ప్లాస్టిక్ గుళికలను సేకరించారు. దక్షిణాఫ్రికా లోని బీచ్ లలోని ప్లాస్టిక్ గుళికలను పరిశీలించినపుడు పురుగు మందుల అణువులు ఉన్నట్లుగా తెలుస్తోంది అంటే అక్కడ అధిక పురుగు మందుల వినియోగం జరుగుతున్నట్లుగా అర్థమవుతోంది. తీరాలకు 300 కి.మీ ల దూరంలోని సముద్రాల అడుగున ఉన్న భూమి పై ప్లాస్టిక్ ఎంత మేరకు పేరుకున్నదో ఖచ్చితంగా లెక్కలు కడితే గానీ కాలుష్యం ఎంత తీవ్రంగా ఉన్నదో తెలుస్తుంది. భూమి యొక్క సముద్ర అడుగు భాగంలో దాదాపు 14 మిలియన్ టన్నుల మైక్రో ప్లాస్టిక్ ఉన్నాడని ప్రస్తుత అంచనా.
ప్లాస్టిక్ కాలుష్యం అనేది ప్రపంచం యొక్క ప్రధాన సమస్య. ఈ సమస్య ఏటేటా పెరుగుతున్నది ప్లాస్టిక్ భూతం నివాసాలను, ఆవాసాలను దెబ్బ తీస్తున్నది. మానవ జీవితాలను నేరుగా ప్రమాదం లోకి నెట్టి వేయగల సామర్థ్యం కలిగి ఉన్నది. పర్యావరణ వ్యవస్థ క్షీణించటంతో పాటు పర్యావరణ ఒత్తిళ్ళు మరియు సామజిక, ఆర్థిక ప్రమాదాలను తెచ్చి పెడుతుంది.
ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడానికి అన్ని దేశాలూ కంకణం కట్టుకున్నాయి. ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యం వలన వచ్చే ఉపన్యాసాలు, వ్యాసాలు, రచనలు విద్యార్థుల చేత చేయించి వారిని చైతన్య పరుస్తున్నాయి. కొంత ప్లాస్టిక్ సామగ్రిని రీ-సైక్లిoగ్ చెప్పాలoటే సమస్యకు పూర్తి పరిష్కారం కాదు. రీ-సైక్లిoగ్, రీప్రాసెసింగ్ అనేవి పరిణామ తీవ్రతను తగ్గిస్తాయి. రీ-సైక్లిoగ్ యూనిట్లకు ప్రభుత్వం నుండి సబ్సిడీ లభిస్తున్నది. అయితే ఇన్నీ చర్యలు తీసుకునే బదులు ప్లాస్టిక్ తయారినే నిషేధిస్తే మంచిది కదా! ఎవరికైనా ఈ ఆలోచనే కలుగుతుంది. సింథటిక్ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన వన్య ప్రాణులకూ నష్టం కలుగుతోంది..
ప్లాస్టిక్ సీసాలలో నీళ్ళను అమ్మడం కొనడం కూడా ప్రధాన సమస్య. తిరిగి ఉపయోగపడని ప్లాస్టిక్కులను వదిలించుకోవాలి. మైక్రోబీడ్ లను బహిష్కరించాలి. కొన్నిటిని రీ-సైక్లిoగ్ చేయాలి. ఇలాంటి సూత్రాలను పాటించటం వాళ్ళ ప్లాస్టిక్ కాలుష్యం తగ్గే అవకాశముంది.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జై శ్రీరామ్
నిర్ణయం
దశావతార సూర్యకాంతం!!
కోయెన్ సోదరుల చిత్రాలు: కలియుగం ఇంతే!
శాపమా
కొంచెం భరోసా ఇవ్వండి
గ్రహణం
జీవన రమణీయం-82
చదువుల గుడి
నేను.. కస్తూర్‌ని-7
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®