కాయం భారాన్ని కాళ్ళమీద మోపి కాళ్ళను ఏదో ఆధారం మీద ఆన్చి నలుదిక్కులవైపు నాజూగ్గా చూస్తూ దూరాన్ని కళ్ళతోనే కొలుస్తుంటావు
అక్కడేదో కనిపించిందనో ఇక్కడుండి చేసేదేముందనో ఒక్క ఊపున లేచి, అంతెత్తున ఎగిరి రెక్కలకింద అంతో ఇంతో గాలిని పోగేసుకుని ఆకాశం కప్పుకింద ఆయాసం లేకుండా అంతంత దూరాలకు సాగిపోతుంటావు
ఎక్కడో ఓ పచ్చని కంకి పలకరిస్తే పరామర్శించి కాసిన్ని పాలగింజల ఆతిథ్యం ఆనందంగా స్వీకరిస్తావు ఏరు ఏదైనా, పేరులేని నీటిదొరువేదైనా దవ్వున కనిపిస్తే, రివ్వున ఎగిరెళ్ళి అవీ ఇవీ అనే తేడాలేకుండా ఓ గుక్కెడు నీళ్ళు, గమ్మున తాగి నచ్చిన దిక్కుకు హాయిగా ఎగిరిపోతావు
పిడికిలంత పిట్టవే ఐనా కొండంత ఆత్మవిశ్వాసం నీది రెక్కల కష్టంతో రోజును నెమ్మదిగా కరిగిస్తూనే ఉంటావు కాలం కత్తిగట్టిన వేళ కరువునైనా కసిదీరా ఎదిరిస్తూనే ఉంటావు
ఈరోజే నాదైనప్పుడు రేపటికై దాచుకొనేది ఏమీ లేనపుడు ఎవరిదో దోచుకుని చేసేదేముందిలే ఎక్కడికో మోసుకుని వెళ్ళేదేముందిలే అని అనుకుంటుంటావు
గూడెక్కడుందో గుర్తున్న నీకు పొద్దు వాలిపోతుంటే చుట్టూ చీకటి ముసురుకుంటుంటే గూడు గురుతుకొస్తుంందో ఏమో ! ఈ రోజుకిక చాలు అని అనుకుంటూ ఖాళీ రెక్కల విసుర్లతో దారి వెతుక్కుంటూ వెనక్కి తిరిగి వచ్చేస్తావు రేపటి సుప్రభాతానికి రాతిరి తలుపు బిగిస్తూ !!
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
పిడికడంత పిట్ట నిత్యజీవనస్రవంతిని మీ కవితలో బహు చక్కగా వెలయించారండీ… 🙏🏻🙏🏻🙏🏻
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నియో రిచ్-20
అలనాటి అపురూపాలు-99
ఆది అంతం లేని విజ్ఞానానికి నెలవు విశాల విశ్వం
దిగులు పూలు
ఎందుకీ బ్రాహ్మణద్వేషం??????
వారెవ్వా!-47
ఫొటో కి కాప్షన్-32
అలనాటి అపురూపాలు – 207
నీలమత పురాణం-65
సంగీత సురధార-48
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®