Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-22

[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ను మన పిల్లలలో ఎలా పెంచాలి? అది ఎందుకు అవసరం?

క రోజు సాయంత్రం, ఐదో తరగతిలో చదివే భాను బాగా బాధపడుతూ నిస్సహాయంగా కూర్చున్నాడు. “అమ్మా, నన్ను ఫ్రెండ్ ఓపెన్‌గా తిట్టేశాడు,” అని చెప్పగానే, ఆ అమ్మ ఆలోచించకుండా “వదిలేసేయ్! అందరూ ఏదో ఒకటి అంటారు దానికి మనం ఏం చేయగలము, అలాంటి వాటిని పట్టించుకోకూడదు” అని అన్నారు.

ఇక్కడే మొదలవుతుంది మనం పిల్లల భావాలను గుర్తించడంలో చేసే తప్పు. పిల్లల సమస్యల్ని చిన్నవిగా చూడటం, వారి భావాలకు విలువ ఇవ్వకపోవడం, భవిష్యత్తులో వారిని భావోద్వేగ పరంగా బలహీనులను చేయవచ్చు. దీని మూలంగా మన పిల్లలు వాళ్ళ భావాల్ని లేదా మనసులోని ఎమోషన్స్ ని వాళ్ళు సరిగా ఎక్స్ ప్రెస్ చేయలేక పోతారు.

ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి?

“మన మనసు ఒక గడియారం లాంటిది – టైమ్ చెబుతుంది గానీ, లోపల గేర్లన్ని సరిగ్గా పని చేయాలి!”

మన మనసు కూడా ఒక గడియారం (watch or clock) లాంటిది.

మన ప్రవర్తన అంటే – గడియారం చూపే టైమ్ లాంటి విషయం. బయటికి కనిపించేది అదే. కానీ ఆ టైమ్ సరిగ్గా రావాలంటే, లోపల ఉన్న గేర్లు (gears), చక్రాలు, స్ప్రింగ్‌లు అన్నీ సవ్యంగా పనిచేయాలి కదా?

అలాగే, మన బిడ్డల్లో:

ఇవన్నీ బయటికి కనిపించే లక్షణాలు. కానీ ఇవన్నీ సరిగ్గా రావాలంటే, లోపల ఉన్న భావజాల గేర్లు సమంగా తిరగాలి:

ఈ గేర్లన్నీ సరిగ్గా పని చేస్తేనే మన బిడ్డలు సరిగ్గా వారి ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతారు. ఒక గేర్ సడలిపోతే, మొత్తం వ్యవస్థ తలకిందులవుతుంది – మనకి తెలియకపోయినా.

అందుకే, పిల్లలు ప్రవర్తిస్తున్న తీరు పైన కాకుండా, ఎందుకు ఇదంతా జరుగుతోంది ఏ ప్రభావం మూలంగానూ అని ఆలోచించడమే నిజమైన పేరెంటింగ్.

ఇది పుస్తకాలలోనూ, స్కూల్లోనూ పిల్లలు నేర్చుకోలేరు. ఇది నేర్పించాల్సిన బాధ్యత ఇంట్లోని తల్లిదండ్రులదే. ఇది పిల్లలకి, పెద్దలకి కూడా కావాల్సిన ఒక ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ (జీవన నైపుణ్యం).

Daniel Goleman చెప్పినట్లు, “ఈ క్షణంలో ఏం అనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది అని మనకు అర్థం అయ్యే విధంగా మన మనసును మనం చదవగలిగితే – అదే అసలైన విజయం.”

పిల్లల్లో ఈ నైపుణ్యం ఎందుకు ముఖ్యం?

మనందరికీ తెలుసు – పిల్లలు తెలివిగా ఉండాలి, పాఠాలలో ముందుండాలి. కానీ ఈ రోజుల్లో, కేవలం ఐ.క్యూ (IQ) సరిపోదు. పిల్లల వ్యక్తిత్వ వికాసం కోసం ఈ.క్యూ (EQ), అంటే భావోద్వేగ బుద్ధి చాలా ముఖ్యం.

ఎంత మంచి మార్కులు వచ్చినా..

అప్పుడు జీవిత విజయం అసాధ్యమవుతుంది. ఎందుకంటే మనిషి బుద్ధి ఒక భాగం మాత్రమే; భావజాలం కూడా అంతే అవసరం.

ఒక చిన్న ఉదాహరణ:

ఒకరోజు ఇద్దరు పిల్లు – రమ్యా, అన్విత – రెండవ తరగతిలో చదువుతున్నారు. ఇద్దరికీ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయి.

ఇద్దరికీ తెలివి ఉంటుంది. కానీ రమ్యకు ఒక స్థిరత ఉంది, అంటే, అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్లే.

ఐ.క్యూ (IQ) vs. ఈ.క్యూ (EQ) సరళంగా:

పరంగా ఐ.క్యూ (IQ) ఈ.క్యూ (EQ)
ఏమి నేర్చుకున్నారు సైన్స్, మ్యాథ్స్, లాజిక్ భావాలు, స్పందనలు, ఇతరుల పరంగా అవగాహన
మంచి సంబంధాలు తక్కువ ప్రభావం గాఢమైన ప్రభావం
తీవ్ర పరిస్థితుల్లో స్పందన ఒత్తిడి తట్టుకోలేకపోవచ్చు సంయమనంతో స్పందించగలరు
వ్యక్తిత్వ వికాసం పరిమితంగా సహాయపడుతుంది సంపూర్ణంగా అభివృద్ధికి దారితీస్తుంది
జీవిత నిర్ణయాలు లాజిక్ ఆధారంగా మనస్సు+బుద్ధి కలయికగా

గుర్తుంచుకోవాల్సిన విషయం:

మార్కులు జీవితం కాదు. భావాలపై అవగాహన కలిగితే – పిల్లలు మంచి మనుషులవుతారు, నాయకులవుతారు, జీవితాన్ని గౌరవిస్తారు.

తల్లిదండ్రులు మరియు తాతయ్యలు–అమ్మమ్మల పాత్ర:

ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పాఠం పిల్లలు పుస్తకాల్లో కాదు, ఇంట్లోనే మొదటగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు మరియు పెద్దల ప్రవర్తన, మాటలు, భావాల వ్యక్తీకరణ.. ఇవే పిల్లలకు మొదటి పాఠశాల.

మన కుటుంబాల్లో ఇప్పటికీ చాలామంది పెద్దలు పిల్లలకి సలహాలు, బోధనలు ఇస్తూ ఉంటారు. కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది బోధన వల్ల రాదు కానీ ప్రదర్శన అంటే మోడలింగ్ వల్ల అభివృద్ధి చెందుతుంది.

ఒక చిన్న ఉదాహరణ:

బాలుడు ఓ చిన్న ఆటలో ఓడిపోయాడు.

ఇక్కడే తేడా ఉంది. ఒకరు వేగముగా తీర్పు ఇచ్చారు. మరొకరు భావాన్ని అర్థం చేసి ఆదరించారు.  ఏ పిల్లవాడి తల్లి, అయితే తన  భావాన్ని అర్థం చేసుకొని ఆదరించారో, ఆ పిల్లవాడు జీవితంలో ఎంతో హ్యాపీగా ఉన్నత స్థానంలో సెటిల్ అవుతాడు.

మనం చేయగలిగేది ఏమిటి?

ఉదా: “నీకు ఇప్పుడు అసహనంగా ఉంది కదా?”

“అలా అనిపించిందా? ఎందుకు అనిపించిందో చెప్పవా?” అని అడగండి.

“ఇప్పుడు నీకు ఏమనిపిస్తోంది?” అని అడగండి.

కథల ద్వారా భావాల బోధన చేయండి.

పంచతంత్రం, తెనాలి రామలింగ కథలు, లేదా రామాయణ/భారత కథలు ఉపయోగించండి.

“నాకు తెలుసు నువ్వు వారి మీద కోపంతో ఇలా చేశావు కదా” అనే బదులు ఎందుకు అలా చేశావో చెప్పగలవా అని అడగండి.

ఉదా: “నిన్ను అలా ఏడుస్తూ చూడడం నన్ను కలచివేసింది.”

పిల్లలు మానవత్వాన్ని నేర్చుకుంటారు.

ఒక చిన్న టిప్:

తల్లిదండ్రులుగా మీరు రోజు అలోచించవలసిన ప్రశ్న:

ఈ రోజు మీ బిడ్డ ఏ భావాన్ని ఎక్కువగా చూపించాడు/చూపించింది? మీరు దాన్ని గమనించారా?

మీరు ఎలా స్పందించారు? మరింతగా అర్థం చేసుకునేందుకు మీరు ఇంకేం చేయగలరు?

ముగింపు:

ఈ కాలంలో పిల్లల్ని మంచిగా చదివించడమే కాదు, మంచి మనుషులుగా తీర్చిదిద్దడమే అసలైన పేరెంటింగ్. భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వాటిని సమతుల్యంగా వ్యక్తీకరించడం, ఇతరుల భావాలకు గౌరవం ఇవ్వడం వంటి నైపుణ్యాలు జీవితం అంతా తోడుండే బలమైన పునాది. ఇవి మనం చిన్నప్పుడే పిల్లలకు నేర్పాలి – కథలతో, మాట్లాడే శైలితో, మన ప్రవర్తనతో. మన మాటలు కన్నా మన తీరే వాళ్లకు బోధగా మారుతుంది. మనం పిల్లల మనసును బాధించకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, వారు కూడా ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకేరోజు వచ్చే పాఠం కాదు – ప్రేమ, ఓర్పు, గమనించగలిగే తత్వం ఉన్న ప్రతి రోజూ పిల్లల మనసులో ఒక చిన్న మార్పు నాటుతాం. ఆ మార్పే భవిష్యత్తును నిర్మిస్తుంది.

చిన్న చర్య పెద్ద మార్పు:

ఈ వారం మీరు ప్రతి రోజూ కనీసం ఒక్కసారి మీ పిల్లలతో 5 నిమిషాలు కూర్చుని, వారేం అనుకుంటున్నారో, ఏమి అనుభవిస్తున్నారు అనే విషయంలో ఓ చిన్న సంభాషణ చేయండి. అడగండి:

“ఈ రోజు నీ మనసులో ఏమి నడుస్తోంది?”

ఈ ప్రశ్న వల్ల మీ బిడ్డ మనసులోకి మీరు చేసే ప్రయాణం మొదలవుతుంది.

(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)

Exit mobile version