[ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు సంచిక పాఠకుల కోసం ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
వేసవికి వీడ్కోలు సమయము, పాఠశాలలు కొత్త ప్రారంభానికి పిలుస్తున్నాయి!!!
వేసవి సెలవుల చివరి రోజులు దగ్గర పడుతున్నాయి. ఉదయాన్నే అలారం మోగకుండా నెమ్మదిగా నిద్ర లేవడం, హోంవర్క్‌కి సెలవు ఇచ్చేయటం, ఆటలతో ఆడి పాడి అలసిపోయి మంచం చూడగానే నిద్రపోయే పిల్లలు కొందరైతే, యూట్యూబ్‌లో వీడియోలు చూసుకుంటూ లేటుగా పడుకునే పిల్లలు మరికొందరు. కానీ అందరి పిల్లల్ని పాఠశాలలు మళ్లీ పిలవడం స్టార్ట్ చేస్తున్నాయి అవి సరికొత్తగా అవుతున్నాయి మిమ్మల్ని రెడీ అవ్వడం స్టార్ట్ చేయమని చెప్తున్నాయి.
కొందరు పిల్లలు హ్యాపీగా జాలిగా స్కూల్‌కి వెళ్ళటానికి రెడీ అవుతుంటారు. మరికొందరు పిల్లలు అబ్బా ఎందుకు ఈ స్కూల్ స్టార్ట్ అయింది?, అని ఆలోచనలో లేనిపోని ఒత్తిడి కొని తెచ్చుకుంటారు. వాళ్ళకి ఒక రొటీన్ స్ట్రక్చర్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవ్వటం మొదలెడతారు. తల్లితండ్రులు కొంచెం తేలిగ్గా ఊపిరి వదిలే సమయం ఇది. ఎందుకంటే వాళ్ళ రోజువారి దినచర్యలో ఒక స్ట్రక్చర్ అంటూ వస్తుంది కాబట్టి. అయితే, ఈ మార్పు సాఫీగా జరగాలంటే, చిన్న చిన్న ఆచరణీయ అలవాట్లు, సానుకూలత అవసరం. ఈ వ్యాసంలో అలాంటి సింపుల్, ప్రాక్టికల్ టిప్స్ గురించి చర్చించుకుందాం.
1. మెల్లగా నిద్రించే సమయంలో మార్పు తీసుకురావాలి:
వేసవి సెలవుల్లో పిల్లలు రాత్రిళ్లు లేట్‌గా పడుకోవడం, ఉదయాన్నే లేటుగా లేవడం మామూలే. కానీ స్కూల్ రోజుల్లో ఇది సాధ్యం కాదు.
👉 వారానికి ముందు నుంచే, రోజుకో పది నిమిషాల చొప్పున నిద్రపోవడం/లేవడం టైమ్‌ను ముందుకు తీసుకురావడం ప్రారంభించండి.
👉 స్క్రీన్ టైమ్‌ను కుదించండి, నిద్రకు ముందు పుస్తకం చదవడం, జెంటిల్ మ్యూజిక్ వినడం వంటి అలవాట్లు తెచ్చే ప్రయత్నం చేయండి.
👉 ఇది పిల్లల శరీరానికి అవసరమైన ‘బాడీ క్లాక్’ మార్పుకు సహాయపడుతుంది.
ఒక చిన్న టిప్:
మీరు కూడా పిల్లలతో పాటు ఈ మార్పుల్లో భాగస్వాములవ్వండి. మీరు కూడా ముందుగా పడుకుంటే లేదా ఉదయాన్నే లేస్తే, పిల్లలకు మంచి ఉదాహరణ అవుతారు. పిల్లలు చూసి నేర్చుకునే ప్రాణులు, కదా!
2. కుటుంబమంతా కలిసి ఒక ఉదయం రొటీన్‌ని ఏర్పాటు చేసుకోండి:
ఊహించని ఉదయపు హడావుడి పక్కన పెట్టండి.
👉 పిల్లలతో కలిసి ‘స్మూత్ మార్నింగ్’ రొటీన్‌ను రూపొందించండి. చిన్న, చిన్న టైమ్ బ్లాక్స్ వేసుకోండి.
ఉదయం లేవడం → రెడీ అవడం → బ్రేక్ఫాస్ట్ → స్కూల్ టైమ్ → బ్రేక్ → హోం వర్క్ → ఫన్ టైమ్ → నిద్ర అనేలా విభజించండి.
ఒక చిన్న టిప్:
చిన్న అట్ట మీద ఈ రొటీన్‌ని అందంగా రాసి డెకరేట్ చేసి. గదిలో అతికించండి. అలా ఉంటే వారు దాన్నే ఒక చిన్న ప్రాజెక్టుగా భావిస్తారు.
👉 మీరు కూడా వర్కింగ్ పేరెంట్ అయితే, మీ ఆఫీస్ పనిని దృష్టిలో ఉంచుకొని అందరికీ సౌకర్యంగా ఉండేలా రొటీన్‌లు షేర్ చేసుకోండి.
- నైట్ పడుకునే ముందే మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ కావాల్సిన పదార్థాలని సిద్ధం చేసుకుని పెట్టుకోండి.
- పిల్లలు లంచ్ బ్యాగులు లంచ్ బాక్సులు రెడీగా కనిపించేటట్టు పెట్టుకుంటే మీకు సులువు అవుతుంది.
👉 రివార్డులను కూడా ఈ రొటీన్‌లో జతపరచండి:
అంటే సకాలంలో అన్ని పనులు సవ్యంగా చేస్తే 30 మినిట్స్ వాళ్ళకి టీవీ ఇవ్వటమో లేదు వీడియో గేమ్ ఇవ్వటమో చేయవచ్చు. ఇలా చిన్న లక్ష్యాలు ఏర్పరిచి, మీ పిల్లల్ని చిన్న బహుమతులతో ప్రోత్సహిస్తూ ఉంటే, మీ రొటీన్‌ని చక్కగా మెయిన్‌టైన్ చేయవచ్చు.
ఒక చిన్న టిప్:
వారం రోజుల పాటు ఇలా ఈ రొటీన్‌ని ప్రాక్టీస్ చేస్తే, స్కూల్ మొదలయ్యేసరికి ఆ రొటీన్ కష్టం కాకుండా సజావుగా జరగుతుంది.
3. స్కూల్ అవసరాలు సకాలంలో సిద్ధం చేయండి:
ఒక్కసారిగా షాపింగ్ మీద ఒత్తిడి కాకుండా, వారానికి ముందు స్కూల్ సరఫరాలను సెట్ చేయండి.
👉 పిల్లలతో కలిసి యూనిఫాం, బూట్లు, స్టేషనరీ, లంచ్ బాక్స్ వంటి అంశాల జాబితా తయారుచేయండి.
👉 స్కూల్ నుంచి కలెక్ట్ చేయాల్సిన అవన్నీ ముందే ప్లాన్ చేసి కలెక్ట్ చేసుకోండి.
👉 ఈ పనులన్నీ మీ పిల్లలతో కలిసి చేయటం వల్ల వాళ్లు మీకు ప్లానింగ్ లోని షాపింగ్ లోని హెల్ప్ కూడా చేస్తారు.
ఒక చిన్న టిప్:
కొత్త స్టేషనరీ లేదా కొత్త బ్యాగు ఇలాంటివి మీ పిల్లని ఎంచుకునేటట్టు చేయండి. దానివల్ల వాళ్లలో స్కూల్‌కి వెళ్లే ఆసక్తి పెరుగుతుంది.
4. హాలిడే మూడ్ నుండి స్కూల్ మూడ్‌కి మారేందుకు నెమ్మదిగా సహాయం చేయండి:
వేసవి సెలవులు ముగియబోతున్నాయి అనే మాట పలు పిల్లల మనసుల్లో టెన్షన్స్, స్కూల్ అనే పదమే ఒత్తిడిని రేపుతుంది. కొత్త క్లాస్, కొత్త టీచర్స్, కొత్త సబ్జెక్ట్స్ – ఇవన్నీ ఒకరకంగా ఒక చిన్న భయం కలిగించవచ్చు. అందుకే ఇప్పుడే మీ పిల్లలకి మీ ప్రేమ మీ తోడు ఇంకా ఎక్కువ కావాలి.
👉 రోజు పాటు స్కూల్ టాపిక్స్ గురించి చిన్న చిన్న చర్చలు చేయండి – ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? గత సంవత్సరం మంచి జ్ఞాపకం ఏది?
👉 వారిని మానసికంగా సన్నద్ధం చేయండి – “ఈ సంవత్సరం నువ్వు ఏమి నేర్చుకోవాలని అనుకుంటున్నావు?” వంటి ప్రశ్నలతో.
👉 హాలిడే హోమ్ వర్క్ ని కంప్లీట్ చేయించండి.
ఒక చిన్న టిప్:
సరదాగా కొన్ని ఫన్ రీడింగ్ ఛాలెంజెస్, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ మీ పిల్లల ఏజ్‌ని బట్టి పెట్టండి పెట్టండి. ఇవి మెల్లిగా మీ పిల్లల మైండ్‌ను స్కూల్ మూడ్‌కి మార్చుతాయి.
5. పాజిటివ్‌గా స్కూల్‌ను ప్రస్తావించండి – ఉత్సాహం నింపండి మీ పిల్లల్లో, భయం కాదు:
కొత్త స్కూలు కొత్త క్లాసు కొత్త టీచర్లు కొత్త ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ మీ పిల్లల్లో కొంచెం భయం కలిగించే విషయాలే.
👉 గత సంవత్సరం నువ్వు ఎదుర్కొన్న సవాళ్లు గుర్తున్నాయా వాటిని ఎంత బాగా ఎదుర్కున్నావో గుర్తుందా, అని అడగండి.
👉 “ఈసారి నీకు కొత్త యాక్టివిటీస్ కూడా ఉండబోతున్నాయ్!” లాంటి మాటలతో ఆసక్తి పెంచండి.
👉 వారు అడిగే డౌట్స్‌కి ప్రేమగా, జాగ్రత్తగా సమాధానమివ్వండి. భయాన్ని తొలగించండి – ధైర్యాన్ని నింపండి.
ఒక చిన్న టిప్:
మీరు చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్లిన జ్ఞాపకాలను పంచుకోండి. మీ భయాలు, మీ స్నేహాలు, మీ నవ్వులు. ఇది పిల్లలతో మీ అనుబంధాన్ని పెంచుతుంది. స్కూల్ అంటే ఒక కఠినమైన ప్రదేశం కాదు, ఒక అద్భుతమైన జీవన పాఠశాల అని వారి మదిలో నిలిచిపోతుంది.
6. తల్లిదండ్రులుగా – మీకు కూడా ఒక కొత్త ప్రారంభం:
స్కూలు మొదలైంది అంటే పేరెంట్స్‌కి ఉరుకులు పరుగులు హడావిడి జీవితం కూడా మొదలైనట్టే. కాకపోతే మన జీవితం కూడా ఒక రొటీన్‌లో పడిపోతుంది పిల్లలు స్కూల్‌కి వెళ్ళాక మనకి మన పని చేయడానికి వీలవుతుంది. వర్కింగ్ పేరెంట్స్‌కి వాళ్ళ వర్క్ మీద ఫోకస్ పెట్టటానికి వీలవుతుంది. కాకపోతే మీరు వారితో ప్రతిరోజు ఉదయాన్నే కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేయండి
👉 మీరు కూడా ఉదయాన్నే లేవటం, కాఫీతో పిల్లలతో మాట్లాడటం, బ్రేక్‌ఫాస్ట్ పంచుకోవటం – ఇవన్నీ రోజును కొత్త ఉత్సాహంతో ప్రారంభించాయి.
👉 ముందు రోజు రాత్రే స్కూల్ బాక్స్, డ్రెస్ వంటివి రెడీ చేయడం వల్ల ఉదయం హడావుడి ఉండదు.
👉 సహాయం కోరడం కూడా మరిచిపోవద్దు – మీ spouse, పెద్దల సపోర్ట్ వినియోగించుకోండి. ఇది జంటగా కలిసి ప్రయాణించాల్సిన మార్గం.
ఒక చిన్న టిప్:
తల్లిదండ్రులు తన కోసం టైమ్ కేటాయించారనే భావన పిల్లకు విశ్వాసాన్ని ఇస్తుంది. ఉదయం 5 నిమిషాలు మాట్లాడటం చాలు.
7. మెల్లగా, ప్రేమగా మార్పులు తీసుకురండి:
మార్పు అనేది ఒక్కరోజులో జరగదు. పిల్లలు కొత్త రొటీన్‌కి పూర్తిగా అలవాటు పడటానికి కావాల్సింది మీరు చూపించే ప్రేమ, సహనం.
👉 మెల్లగా అలవాటు పడే అవకాశం ఇవ్వండి. మొదటివారాల్లో కొన్ని తప్పులు సహజమే.
👉 “నీవు తలెత్తి ముందుకు పోతావు” అనే ధైర్యాన్ని వారిలో నింపండి.
👉 మార్పు అనేది కుటుంబం మొత్తానికి – కాబట్టి ప్రతి ఒక్కరూ మెల్లిగా adjust అవుతారు. పిల్లల పక్కన మీరు ఉన్నారని వారిని గుర్తు చేయడం చాలా ముఖ్యం.
ఒక చిన్న టిప్:
పిల్లల ప్రోగ్రెస్‌ని రోజూ పోల్చవద్దు – వారితో పాటు మీరూ మార్పును ఆస్వాదించండి.
ముగింపుగా..
వేసవికి వీడ్కోలు చెప్పడం = ఆనందాన్ని కోల్పోవడం కాదు.
అది కొత్త ఉత్సాహాన్ని ఆహ్వానించడమే.
ఈ మార్పుల ప్రయాణంలో పిల్లలకి మమకారంగా, మార్గదర్శకుల్లా ఉండడం ద్వారా, మీరు వాళ్ళ బాల్యాన్ని నెమ్మదిగా, సంతోషంగా, సురక్షితంగా పెద్దదిగా మారుస్తున్నారు.
ఈ కొత్త విద్యా సంవత్సరం మీ ఇంట్లో కొత్త వెలుగులు నింపాలనీ, మీ పిల్లల మనసుల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
(వచ్చే వారం మరో టాపిక్‌తో కలుద్దాం)
ఐ.పి. సుహాసిని గారు కిడ్స్ అండ్ పేరెంట్స్ లైఫ్ కోచ్‌గా పని చేస్తున్నారు. చైల్డ్ సైకాలజిస్ట్. పేరెంటింగ్ బ్లాగర్, యూట్యూబర్. పేరెంట్స్ కోసం వాట్సప్‌లో ఒక ఫ్రీ కమ్యూనిటీ నడుపుతున్నారు. ఆ కమ్యూనిటీ లింక్ Simplified Parenting with Suhasini. వారిని mommyshravmusings@gmail.com అనే మెయిల్ ఐడిలో సంప్రదించవచ్చు.