[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘పెద్దోళ్ళు అంతే’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
గద్దెనెక్కిన పెద్దవాళ్ళు
పదవులలో పవళిస్తున్నారు
పేదింటి కూడును సైతం
వదలకుండా పలహారం చేస్తున్నారు
నాది అన్నది ఏదీ లేని
దీనురాలు రోడ్డు మీద
కని పారేసిన పసికూన
గుక్క పట్టి ఏడుస్తోంది
డొక్క ఎండి గోలెడుతోంది
లక్ష్ల కోట్ల అప్పులు చేసి
అంతా తమ గొప్పగా చెప్పే
జన నాయకులకు
ఈ గోడు వినిపించేనా
ఈ నేలపై ఇంకా
నీతీ న్యాయం నిలిచేనా.
పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.