[బాలబాలికల కోసం పండ్ల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది 2వ భాగం.]
~
ప్రశ్నలు:
11.
సపోటా వుర్ల గడ్డలతో పోలికలు
అడ్డుకోతలో సూర్యకిరణాల చిత్రాలు
తింటే బిపి, ఎల్.డి.ఎల్ ల తగ్గుదల
12.
గుత్తులు గుత్తులుగా పండ్లు
కానీ ద్రాక్ష గుత్తులు కాదు
మెత్తని జెల్లీ లాంటి కండలు
కానీ తాటి ముంజలు కాదు
13.
ఉసిరిలా కాండానికి కాస్తాయి
ద్రాక్షలా గుత్తులుగా కాస్తాయి
చైనా దేశంలో అధికంగా కాస్తాయి
14.
ఎరుపు తెలుపులలో ఉంటుంది
చలి కాలంలో ఎక్కువ కాస్తుంది
దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది
15.
పైన సన్నగా కింద లావుగా
నీటి చుక్క వలే బుడగగా
వగరు తీపి పులుపు కలగలుపుగా
16.
ఆకుపచ్చని గుండ్రని బంతులు
గర్భాన దాచి పెట్టుకున్న ముత్యాలు
రసం పిండామంటే గ్లాసులు
17.
పొట్ట నిండా రత్నాల రాసులు పెట్టి
కనపడకుండా ఎర్రని తోలు కప్పారు
18.
కాయలన్నింటిలో చాలా పెద్దది
పసిమి ఛాయ పిల్లలు కలది
ఘాటైన సువాసన కలది
చిటారు కొమ్మన కాస్తుంది
19.
ఇల్లేమో ముళ్ళకంప
పళ్ళేమో డ్రూప్ జాతి
రుచేమో తీపి పులుపు
రంగేమో ముదురు ఎరుపు
20.
చూపుకు మేలిమి దేహాలు
పొట్ట విప్పితే పురుగులు
చెట్టు కాండానికి గుత్తులు
జవాబులు:
11.కివి 12. లిచి 13. మల్బరీ 14. జామ 15. పియర్ 16. బత్తాయి 17. దానిమ్మ 18. పనస కాయ 19. రేగి పండు 20. మేడి పండు
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.