ఆ గగనాస్తరణం ఉలకదు ఆ అరుణారుణం పలకదు ఆ సలిలాలయం ఏమనదు ఆ విటపావృతం కిమ్మనదు
ఆ కుధరాతిశయం ఉలకదు ఆ సికతావరణం పలకదు ఆ పాషాణశకలం ఏమనదు ఆ ప్రకృతి సర్వము, మౌనఘనం! *** మౌనమా?! ఇది మన అజ్ఞానమా?! ప్రకృతి ఓ నిరంతర సుభాషి! వినగలిగే ఆ చెవులే ఉంటే, కనగలిగే ఆ మానసముంటే!! *** ఆ రసాయనాలనే విషానుపానాలతో విరసం చేసేస్తే, జలాశయాలన్నిటినీ నరాధమా, నిర్లక్ష్యాని కిదె ఫలమ్మని వర్షించని గర్జలు, హెచ్చరిక ప్పల్కులే!! ~ గగనం యెదలోని చల్లని పల్కరింపే, వర్షం!! నీ నడవడిపై ఆకాశం ఇచ్చే, ఉత్తీర్ణపత్రం! *** కొరగానివన్నిటితో నింపే కూపం చేసి ఆ రత్నాల కలశి, సంద్రాన్ని పాడుచేస్తే నరాధమా, నిర్లక్ష్యాని కిదె ఫలమ్మని ధర ముంచే, ఆ సునామీ క్రోథావేశ ప్పల్కే!! ~ కట్టడిలో తానిచ్చే బహుమానమే, శాంతతీరం! నీ నడవడిపై, కడలి ఇచ్చే, ఉత్తీర్ణపత్రం! *** ఏ గొంకు లేక తరు సంపద కూల్చివైచి నిశ్శంకగ గిరి, ఖనిజాల దోచి వేస్తే నరాధమా, నిర్లక్ష్యాని కిదె ఫలమ్మని మారిపోయే ఆవరణం, విప్లవ ప్పిలుపే!! ~ వృక్షాలను రక్షిస్తే, ఆ నవ్వే హరిత సుందరం! నీ నడవడిపై ఆ వని ఇచ్చే, ఉత్తీర్ణపత్రం! *** ఆకాశం, పెనుసంద్రం, ఈ భూమి, ఆ తరులు ఏ యుగమూ, ఏ దినమూ, కావవి మౌనాలు! కనులు విప్పార్చి, చెవులు రిక్కించి వింటే అనునిత్యం విన్పిస్తాయి, నిశ్శబ్ద ప్రబోధాలు!!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కాశ్మీర్ యాత్ర -3
కాలంతోబాటు మారాలి – 7
భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 10
మహాభారత కథలు-6: ఉదంక మహర్షి
సమకాలీనుడా..!
చిరుజల్లు-69
కల్పిత బేతాళ కథ-16 ఒక వరం నాలుగు కోరికలు
డామిట్….
నా అక్షరాలు
నేను.. కస్తూర్ని-17
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®