Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పదసంచిక-13

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. అన్యోన్యమైన జంటను కృష్ణంరాజు తొలి సినిమాతో పోలుస్తారు. (3,3)
4. సాగేను జీవిత నావ ______ లేక ఈ త్రోవ తోబుట్టువులు సినిమాపాట. (4)
7. మర్మం (2)
8. సగం డబ్బులో మొక్కుబడి. (2)
9. మువ్వల చేతికర్ర కవిగారి అసలు సిసలు పేరు. (2,5)
11. ఒక అర్థాలంకారము. హైబ్రీడు (3)
13. అగ్రిమెంటు (5)
14. పేచీకోరు (5)
15. ఆటంకము మొదలు తొలగితే దీనారము లభ్యమౌనా?
18. భక్త తుకారాం చిత్రంలో సినారె వ్రాసిన పాట. (3,4)
19. అవహితములోని లెక్కలపుస్తకము. (2)
21. రేణువులో దాగిన ఓడలు నిలుచుచోటు. (2)
22. శంకరమఠములో బాహ్లికము (4)
23. కంసాలి (6)

నిలువు

1. పగడాల _____________ తెరచాటు తేటినై / ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా అని కృష్ణశాస్త్రి పాటలోని ఒక చరణం. (4)
2. పూలచెట్టులో బొంగరం. (2)
3. కావ్యకర్త గారి బ్రతుకు తెరువు. Palindrome. (2,3)
5. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ఇంటి పేరులో త్యాగం. (2)
6. పాటిబండ్ల ఆనందరావు వ్రాసిన పేరుమోసిన నాటకం. (6)
9. బంగారు వస్త్రకుసుమాలు. కానీ చివరి రెండక్షరాలు అటూఇటయ్యాయి. (5,2)
10. అనువాద హనుమంతుడని బాపు రమణలు కొనియాడిన నండూరి వారు ఇక్కడ శీర్షాసనం వేశారు. (7)
11. పిల్లికి చెలగాటం. ఎలుకకు ప్రాణ ____________(3)
12.  నరకములలోని విధము (3)
13. జంగమదేవర (6)
16. “కవేరకన్య నుదురు” చూచినంతనే కలుగు వలపు (5)
17. మన సారథి, మన __________, మన వియ్యము, మన సఖుండు అని భాగవత పద్యం. (4)
20. మహిమలోని మంచు (2)
21. ఇత్తడి మొదలగు ధాతువుల పలుచని యాకు లేక లోహముతో చేయఁబడిన అట్టవంటిది. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను ఆగస్టు 13వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా ఆగస్టు 18 తేదీన వెలువడతాయి.

పదసంచిక-11 జవాబులు:

అడ్డం:

1.హస్తసాముద్రికం   4.మౌనంగానే   7.లవం  8.దితి  9.వజ్ఝల కాళిదాసు  11.రుడాలి  13.కలికాలమా  14.దిఆశగ్నేయ/ దిగ్నేశఆయ  15.లులాపం  18.నుడువరితనము 19.కుబా 21.జాడ 22.డుబుక్కుమే 23.నందివర్ధనము

నిలువు:

1.హలధారి  2.స్తవం  3.కంచుకాగడా  5.గాది  6.నేతిబీరకాయ  9.వరుడు కావలెను  10.సుమతీ శతకము 11.రుమాలు 12.లిదిపం 13.కథంకథికుడు 16.లావరితనం 17.అఖండము 20.బాబు  21.జాన

పదసంచిక-11కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

 

Exit mobile version