‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) స్నేహితము, కలసి వసించుట (5) |
5) మెతుకు పట్టి చూసే న్యాయం (5) |
9) ఒక పంచమీ విభక్తి ప్రత్యయం (3) |
10) ఒక పదాతి దళ సభ్యుడు (3) |
12) వ్యావహారికంలో మహమ్మదీయుడు (3) |
13) తొలి అక్షరం హ్రస్వమైన నోరు అటునుంచి (2) |
16) అలెగ్జాండరు మాతృభాష అటునుంచి (2) |
17) చూపుడు వ్రేలు (3) |
18) పైకి సాగడంతో మొదలయ్యే నిజం (3) |
19) ఇది చేసే మేలు తల్లి కూడా చేయదట (2) |
22) వదనం (2) |
23) ఇచ్ఛ, కోరిక (2) |
24) ఎడార ఓడ అంటారు దీన్ని (2) |
25) అయ్యప్ప స్వామి (2) |
26) రక్షించమని కాకి అరుపులు (2) |
29) కసి, కోపము (2) |
31) బంగారము (3) |
32) ఎల్లప్పటికీ ఉండునది (3) |
33) తిరిపపు కూడు (2) |
36) మొగ్గ, పూవు (2) |
37) తడబడిన వజ్రాయుధం, బిందువు లేదు (3) |
39) తెడ్డు, వల (3) |
41) మంత్రిగారు, కూర్చునే పీట బల్ల (3) |
42) గిరికావసువులు కథాకావ్యం (5) |
43) అనిరుద్ధుని మామగారు (5) |
నిలువు:
1) అసలు తల్లి కాదు (5) |
2) అరక (3) |
3) వర్షము (2) |
4) పిన్నగా, నిశ్శబ్దంగా నవ్వుట యందలి ధ్వన్యనుకరణం ఒకటి (2) |
5) ఉండుట, స్థానము (2) |
6) క్రింద నుంచి శుభ్రపరచండి (2) |
7) తగినది, అన్యదేశ్యం (3) |
9) శంఖము వంటి మెడ (5) |
11) వరుణుడు, యముడు (2) |
14) శ్రీకాళహస్తి మాహాత్మ్యం కావ్యకర్త (3) |
15) ఒక్కరు కాదు, చాలా మంది (3) |
20) శబ్దము (3) |
21) దేశంలోని ఒక పరిపాలనా విభాగము (3) |
22) మాదిరి (3) |
26) కాశీనగరి కొత్వాలు (5) |
27) ఈ నది జన్మస్థానం ఛత్తీస్‌గడ్ లోని అమరకంటక్ (3) |
28) నశించిపోయేది (3) |
30) ఆరు మోముల సామి (5) |
34) కరువు లేని తనం క్రింద నుంచి (3) |
35) తెప్ప, రక్షణ (2) |
36) మంచానికి అల్లే పట్టి (3) |
38) కొ.కు. ప్రసిద్ధ నవల చివర కోల్పోయి పైకి వచ్చింది (2) |
39) ప్రత్యయం లేని తీర్థస్థలి (2) |
40) తలక్రిందైన ధోరణి (2) |
41) వస్తువు మధ్యక్షరం లుప్తం (2) |
ఈ ప్రహేళికని పూరించి 2025 సెప్టెంబర్ 23వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-38 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 సెప్టెంబర్ 28 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-37 జవాబులు
అడ్డం:
1.వింధ్యవాసిని 5. పురుహూతిక 9. జానకి 10. ధిక్కారి 12. ణరిభ 13. మము 16. పండు 17. క్షుద్రుడు 18. బాణలి 19. లుకా 22. హుకుం 23. మాఘం 24. ఫాల్గుణం 25. లూత 26. కుక్షి 30. ముభ్ర 31. చాముండి 32. సేనాని 33. దేసి 36. వరాం 37. వగ్గఅ 39. సాకిరి 41. గులాబి 42. తరిగంబము 43. అభిసారిక
నిలువు:
1.వింజామరలు 3. ధ్యనము 3. వాకి 4. నిధి 5. పురి 6. హూణ 7. తిరిపం 8. కభడుర్ణుకుం 11. క్కాహు 14. విద్రుమం 15. శాణము 20. కామాక్షి 21. వల్గువు 22. హుతము 26. కులదేవత 27. ఏముంది 28. మీనాక్షి 30. భ్రమరాంబిక 34. సిగ్గరి 35. పైకి 36. వలారి 38. అగం 39. సాము 40. రిఅ 41. గుసా
పద శారద-37 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కంభం చంద్రశేఖర్, హైదరాబాద్
- కర్రి ఝాన్సీ, హైదరాబాద్
- కాళిపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్తా కె., ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావజ్ఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళురు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి. తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.