Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-36

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) అనేక రాగాలు కలిపి పాడిన గీతం (5)
5) ఒకటిగా చేర్చు (5)
9) కొంత కాలం ఉండే ఠికానా (3)
10) మఱ్ఱి చెట్టు (3)
12) పెరుమాళ్ళకే తెలిసినది (3)
13) చక్కెర, తొలి అక్షరం పొట్టిదైంది (2)
16) తిరగబడిన సభాకూటానికి ఆఖరి అక్షరం లోపించింది (2)
17) నికార్సయిన బంగారము (3)
18) మన్మథోద్దీపన గుళిక (3)
19) తిరగబడిన పొట్టు (2)
22) ఖండించుట (2)
23) స్త్రీ పురుష సంగమ కార్యము (2)
24) ఛత్రపతి మహారాజ్ (3)
25) బేసి కానిది (2)
26) జలమూరు జల (2)
29) సున్నా కోల్పోయిన మాజీ రాష్ట్రపత్రి (2)
31) బాధతో సన్నగా చేయు శబ్దము (3)
32) ఒక నదితో మొదలయ్యే ఏనుగు (3)
33) ఆంగ్ల హేతువు, జీడిపప్పు (2)
36) కచ బంధము (2)
37) ప్రయాగలో గంగతో కలిసే నది (3)
39) లక్ష్మణ పత్ని కాదు, అల (3)
41) నిలిచిపోకు (3)
42) ఆడవారు గుండ్రంగా తిరుగుతూ చేసే నృత్యం – అట్నుంచి (5)
43) రౌహిణీయుడు, రేవతీ పతి (5)

నిలువు:

1) రాఘవ కీరము (5)
2) భారత్ పై 17 సార్లు దండెత్తిన ముస్లిం ముష్కరుడు (3)
3) పెరూ రాజధాని – క్రింది నుంచి (2)
4) సింహానికీ, తులకీ మధ్య రాశి (2)
5) కోపము (2)
6) బిందువు కోల్పోయి తిరగబడిన జగతి (2)
7) ఉంగరాలు (3)
8) వైశాల్యం కాదు, పరిధి (5)
11) రెండు యోజనాల నాలుగు వంతుల దూరం; తొలి అక్షరం సరళమైంది (2)
14) ఈ దేశపు రాజుధాని ఖార్టూమ్ (3)
15) ఒక పారశీక కవి. ఈయన కవిత్వాన్ని ‘పానశాల’ పేరుతో దువ్వూరి రామిరెడ్డి అనువదించారు (3)
20) ఓదార్పు (3)
21) నీరాజనము (3)
22) ఇచ్ఛ (3)
26) భారీ శరీరం (5)
27) సన్మానం చెయ్యాలంటే ఇది తప్పదు (3)
28) దక్షిణ తమిళనాడులోని ఒక పెద్ద పట్టణం. మీనాక్షమ్మ కొలువైన ఊరు (3)
30) లక్షణాలు తెలిసినవాడు (5)
34) పైకెగిరిన కపింజల పక్షి (3వ్)
35) ప్రేమ (2)
36) త్వర, వడి (3)
38) విసుగు పుట్టించే ముచ్చట (2)
39) తెలుగు నటుడు శ్రీకాంత్ శ్రీమతి (2)
40) తిరగబడ్డ ఈ అసురుడు ఏకచక్రపురంలో భీముని చేతిలో చచ్చాడు (2)
41) ఆచూకీ (2)

ఈ ప్రహేళికని పూరించి 2025 ఆగస్టు 26వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-36 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 ఆగస్టు 31 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-35 జవాబులు

అడ్డం:

1. చైత్రరథము 5. గాలిగోపురం 9. లయము 10. నుడువు 12. లుడజా 13. ధాము 16. మిను 17. క్షితిజ 18. వానరం 19. డుపో 22. మీసం 23. రాట్నం 24. అపర్ణ 25. ఇమాం 26. వాటం 29. సమం 31. సందేహం 32. మైథిలి 33. పేడు 36. సోల 37. యముహ 39. వారుణి 41. లుమచీ 42. ముసలి తాత 43. సినిమా నటి

నిలువు:

1. చైలధావుడు 2. త్రయము 3. రము 4. మును 5. గావు 6. గోలు 7. పుడమి 8. రంజాను మాసం 11. డుల్లు 14. తితిక్ష 15. జానకి 20. పోరాటం 21. నెపము 22. మీమాంస 26. వాజపేయము 27. వైదేహి 28. ప్రథితి 30. మందుల చీటీ 34. డుముస 35. బారు 36. సోమన 38. హలి 39. వాత 40. ణిసి 41. లుమా

పద శారద-35 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version