Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-34

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) పాలకులు చేయవలసినది (5)
5) రాణి (5)
9) మధుర ధ్వని (3)
10) వ్రాసినది (3)
12) ఒక రిషభం, ఒక మధ్యమం, ఒక గాంధారం (3)
13) మఱ్ఱి, జువ్వి రావి – ఏదైనా (2)
16) మౌనంగా ఉండేవాడా? (2)
17) కోట బురుజు (3)
18) నాగస్వరము (3)
19) అట్నుంచి రుద్దు (2)
22) రోమ జీవులు (2)
23) డబ్బు, దండం (2)
24) వేకువ. రాత్రి పోయాక వచ్చేది కదా (3)
25) శివుడు (2)
26) మమేకములో దాగిన జంతువు (2)
29) ముందు వృషా చేరిస్తే విష్ణువు, శివుడు (2)
31) శిశుపాలుని తల తరిగినది (3)
32) గ్రహించగలిగినది (3)
33) నులకకు ముడిసరుకు (2)
36) గస్తీ! హుషార్ (2)
37) అస్తవ్యస్తమైన కృష్ణుని వంశం (3)
39) సౌందర్యం (3)
41) అతివదరుబోతు ముందు స్త్రీ (3)
42) గ్రంథి తో ప్రారంభమయ్యే సరంజామా; ఏ పనికైనా ప్రాథమిక సంబారం (5)
43) శివుని వాద్యము (5)

నిలువు:

1) హాయిని అనుభవించడం (5)
2) సన్న కొమ్మ (3)
3) తాపీ ధర్మారావు గారు పాతదీ కొత్తదీ రాశారు. రెండో అక్షరం హ్రస్వం (2)
4) నలిగినది. కొంచెం తామర (2)
5) పాతాళపు నీరు తెచ్చి బయలం జల్లునది (2)
6) ఏనుగు (2)
7) నాల్గు ఉపాయాల్లో తొలిది (3)
8) మెరుపు నందలి ధ్వన్యనుకరణలు (5)
11) ఒక మధ్యయుగాల ముస్లిం రాజ వంశం (2)
14) రూపం మారిన కర్పూరం (3)
15) వికృతి పొందిన విజ్ఞానం (3)
20) పధ్నాలుగేళ్ళు అయోధ్యను పాలించిన వాటిలో ఒకటి (3)
21) నెల్లూరు జిల్లా కోవూరు MLA (3)
22) చినుగుగుడ్డ (3)
26) ఉరుము (5)
27) వంకర (3)
28) నాకి తినేది. ఉదా॥ చ్యవన ప్రాశ (3)
30) కోయిల కూత (5)
34) ఋణము (3)
35) ముత్యమంత పసుపు ముఖమంతటికీ ఇస్తుందిట (2)
36) ఇరవై ఐదు; సగంలో సగం (3)
38) భాషోచ్చారణా ప్రత్యేకత (2)
39) ఎయ్! నీ _ _ మాడ! ఒక సినీగీతంలోని పదం (2)
40) బిరుదుగా కాలికి తగిలించుకొను పెండారము తొలి రెండక్షరాలు (2)
41) ఆఖరి అక్షరం లోపించిన తిన్నె (2)

ఈ ప్రహేళికని పూరించి 2025 జూలై 29 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద34 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 ఆగస్టు 03 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-33 జవాబులు

అడ్డం:

1) చదరంగము 5) కంచికామాక్షి 9) క్రమణం 10) రగడ 12) సమితి 13) వాము 16) డిపా 17) సంతూరు 18) శర్మిష్ఠ 19) ముగ్రా 22) వీడు 23) సక్థి 24) ప్రత్యయం 25) ళచో 26) వేము 29) పుటి 31) సర్కారు 32) స్వార్థము 33) రము 36) శోభ 37) పానకం 39) రిరంస 41) గణిక 42) టుపాకిలిఉ 43) సుమదామము

నిలువు:

1) చక్రవాకము 2) దమము 3) రంణం 4) ముర 5) కండ 6) కాస 7) మామిడి 8) క్షితిపాలుడు 11) గగ్గు 14) వాతూలం 15) అర్మిలి 20) గ్రాసము 21) సాత్యకి 22) వీచోపు 26) వేగిరపాటు 27) హర్కారా 28) ప్రార్థన 30) టిట్టిభకము 34) మునపా 35) బేరం 36) శోణిమ 38) కంకి 39) రిఉ 40) ససు 41) గదా

 పద శారద-33 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version