Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-31

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) తపస్సే సంపదగా గలవాడు (5)
5) ఏడో మాసం (5)
9) విలువైన రాయి (3)
10) పట్టింపులకు ముందు (3)
12) తిరగబడిన చెడు ఉపాయం (3)
13) చేయి మధ్యలో విరిగింది (2)
16) వెనుదిరిగిన లేగ (2)
17) భీముడు దుర్యోధనుని ఇది విరిచాడు (3)
18) దుఃఖము (3)
19) అటు నుంచి వచ్చిన ఇల్లు (2)
22) సౌకుమార్యము, శ్రమ ఎరుగని తనం (2)
23) సరిగ (2)
24) పార్వతీదేవి (3)
25) కేవలం భ్రాంతి (2)
26) కరరుహము (2)
29) అతి పెద్ద జలచరం (2)
31) పరాక్రమము (3)
32) మృతి (3)
33) ‘మో’ కవితాసంపుటి _ _ చింత (2)
36) జడి లేని అలజడి (2)
37) వెనక్కు వెనక్కు (3)
39) మత్స్య విశేషము (3)
41) కలగూరగంప తొలి సగం (3)
42) దేవతలతో సమానమైనవాడు అటునుంచి వస్తున్నాడు (5)
43) బ్రిటిషు వారితో పోరాడిన కర్నూలు జిల్లా వీరుని ఇంటి పేరు (5)

నిలువు:

1) అమ్ములపొది (5)
2) పిల్ల, పదేండ్ల ఏనుగు (3)
3) దుడ్డు (2)
4) పైకెగసిన పక్వ ఫలం (2)
5) భార్య (2)
6) యాభై రెండో ఏడు లోని ఉపాయం (2)
7) విష్ణుదేవుని ద్వారపాలకుల్లో ఒకడికి ఆఖర్న కొమ్ము విరిగింది (3)
8) ముక్కు నడిమి ఎముక (5)
11) తపతీ నదిని ఇలా కూడా పిలుస్తారు (2)
14) బంగారుకొండ కదూ (3)
15) కొమ్ము (3)
20) నీరు వేడి చేసే యంత్రము. అన్య దేశ్యము (3)
21) దేవతల భాష (3)
22) గంగానది ఉపనది అయిన ఈ వాగు వశిష్ఠుని కుమార్తె (3)
26) కొన్ని ప్రాంతాల్లో వీటిని మటిక్కాయలు అంటారు. క్లస్టర్ బీన్సు (5)
27) క్రూరత్వము (3)
28) పనులు (3)
30) నల్గొండ జిల్లాలోని ఒక పట్టణం. చారుగింజలతో దీనికేమి సంబంధం లేదు (5)
34) మేం భుజించమండీ (3)
35) అల వైకుంఠపురములో సినిమా నాయిక (2)
36) ఆఖరి అక్షరం పోయిన వాడుక (3)
38) వేగము (2)
39) _ _ మాతరం! (2)
40) ఎదురెక్కిన ఎదుర్రొమ్ము (2)
41) ఉన్నట్టి (2)

ఈ ప్రహేళికని పూరించి 2025 జూన్ 17 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-31 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 జూన్ 22 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-30 జవాబులు

అడ్డం:

1) పాంచజన్యము 5) కారెనుబోతు 9) చాతురి 10) సినిమా 12) సినారా 13) లష్క 16) లుసా 17) దిదృక్ష 18) శింఘాణం 19) శంక 22) జోడు 23) పాడి 24) చిహ్నము 25) జరీ 26) బిలం 29) గద 31) శుభ్రము 32) నర్తకి 33) బిస 36) ఆన 37) లావరి 39) విన్నపం 41) చెవాకు 42) క్షితిపాలుడు 43) తంత్రీపాలుడు

నిలువు:

1) పాంచాల దేశం 2) చతుష్క 3) జరి 4) ముసి 5) కామా 6) నుసి 7) బోనాలు 8) తురాసాహుడు 11) నిగ్గు 14) అదృష్టం 15) జంఘాల 20) కపాలం 21) జాహ్నవి 22) జోరీగ 26) బిలబిలాక్షి 27) అభ్రకం 28) గర్తము 30) దమనకుడు 34) సవతి 35) నిన్న 36) ఆవాలు 38) రిపా 39) విడు 40) పంతం 41) చెపా

 

పద శారద-30 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version