Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-30

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) కృష్ణుని శంఖం పేరు (5)
5) అడవి దున్న (5)
9) నైపుణ్యం (3)
10) కదిలే బొమ్మల బారు (3)
12) తెలుగుకు రెండో జ్ఞానపీఠం పొందిన కవి పేరులో మొదటి మూడక్షరాలు (3)
13) సికింద్రాబాదుకి ఉన్న ఈ పాత పేరు, ఆఖరి అక్షరం పోయింది (2)
16) అట్నుంచి ఏడాది (2)
17) చూడాలనే కోరిక (3)
18) ఇనుప చిట్టెము (3)
19) అనుమానము (2)
22) కళ్ళకూ, కాళ్ళకూ, ఈడుకూ (2)
23) న్యాయము పాలు (2)
24) గురుతు (3)
25) చీర, పంచె అంచుల నుండే వెండి పోగులు (2)
26) గహ్వరము, బొరియ (2)
29) భీముడు దుర్యోధనుడు, హనుమంతుడు వీరి ప్రధానాయుధం (2)
31) శుచి తోటే ఇదేను (3)
32) డాన్సింగ్ గర్ల్ (3)
33) యంత్రపు కీలు (2)
36) ఒట్టు, ఆజ్ఞ (2)
37) బలవంతుడు (3)
39) విజ్ఞాపనము (3)
41) కర్ణభూషణము, కమ్మ. అవాకులతో ప్రేలునది (3)
42) రాజు (5)
43) విరటుని కొలువులో దామగ్రంధి తమ్ముడు (5)

నిలువు:

1) ద్రౌపది పుట్టిన దేశం (5)
2) నాలుగింటి సమూహం. ‘ము’ కారం లేకుండా (3)
3) ముసలివాడు (2)
4) తొలి వర్ణం హ్రస్వమైన భాగ్యనగర నది (2)
5) విరామ చిహ్నము (2)
6) బూడిద (2)
7) ఒక తెలంగాణ పండుగ (3)
8) ఇంద్రుడు (5)
11) సారము, చేవ (2)
14) కనుపించని భాగ్యము (3)
15) సాక్షి వ్యాసాల్లోని శాస్త్రి (3)
20) శివుని భిక్షాపాత్రం (3)
21) గంగానది (3)
22) పశువుల చెవుళ్లోకి దూరే ఒక రకం ఈగ (3)
26) పంటలు తినిపోయే ఒక రకం పిట్టలు, ‘_ _ _ _ _  తినిపోయె తిలలు పెసలు’ అని శ్రీనాథుడు బాధపడ్డాడు. ఏకవచనం (5)
27) మైకా (3)
28) గుంత, గొయ్యి (3)
30) మిత్రభేదంలోని ఒక నక్క (5)
34) వసతిని సర్దితే సపత్ని (3)
35) గతించిన దినం (2)
36) పోపుగింజల్లోని ఒక దినుసు (3)
38) పలాయనంచేసి తలక్రిందైనాడు (2)
39) వదిలెయ్! (2)
40) పట్టుదల (2)
41) రాజుగారి ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళి తెచ్చిన వాటిలో ఒకటి ఎండలేదు, ఎందుకెండలేదు అని అడిగారు, తొలి అక్షరం హ్రస్వమైంది (2)

ఈ ప్రహేళికని పూరించి 2025 జూన్ 03 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-30 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 జూన్ 08 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-29 జవాబులు

అడ్డం:

1) పరభృతము 5) వేడివేలుపు 9) నవతి 10) నుదురు 12) వియన్నా 13) సడి 16) లగ 17) ధూర్జటి 18)  చిన్నయ 19) యవ్యం 22) రేవు 23) జయం 24) ముత్తిగ 25) సరే 26) పెనం 29) డుఇ 31) చూర్ణము 32) శిక్షణ 33) రమ 36) గరి 37) దోరము 39) మోదకం 41) తిరిక 42) సెలవురోజు 43) పురాకృతము

నిలువు:

1) పనసకాయ 2) రవడి 3) భృతి 4) మును 5) వేరు 6) వేవి 7) లుయల 8) పున్నాగపూవు 11) దుమ్ము 14) తర్జని 15) నన్నయ 20) వ్యంజనం 21) భిత్తిక 22) రేరేడు 26) పెసరదోశ 27) తూర్ణము 28) ఉక్షము 30) ఇల్లరికం 34) మరల 35) పద 36) గరిత 38) మువు 39) మోజు 40) కంపు 41) తికృ

పద శారద29 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version