‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) కోయిల (5) |
5) సూర్యదేవర (5) |
9) తొంబది (3) |
10) విధివ్రాత ఇక్కడ రాస్తాడంటారు (3) |
12) ఆస్ట్రియా ముఖ్యపట్టణం (3) |
13) చప్పుడు, _ _ సేయకో గాలి అనే కృష్ణశాస్త్రి మధుర సినీ గీతం (2) |
16) ఒక లఘువు ఒక గురువు (2) |
17) స్తుత మతి ఐన శివ కవి. ఈయన కవిత్వం అతులిత మాధురి మహిమ కలది (3) |
18) తెలుగులో నీతిచంద్రిక రాసిన సూరి (3) |
19) యవ ధాన్యం పండే పొలం (2) |
22) నావలు ఆగు తావు (2) |
23) మహాభారతం (2) |
24) మూడు మూళ్లు, తొమ్మిది (3) |
25) ఓకే, అలాగే (2) |
26) అట్టు వేసే పనిముట్టు (2) |
29) ఇచ్చుట – అటు నుంచి (2) |
31) ఉత్తరాంధ్ర గుండ, పొడి, సున్నం (3) |
32) తగురీతిని నేర్చుకొనుట ట్రెయినింగు (3) |
33) లక్ష్మీదేవి (2) |
36) సాము తోడిదే గాని ఆఖరి అక్షరం పోయింది (2) |
37) ద్వారము, తోరణము (3) |
39) కుడుము (3) |
41) మెలిక (3) |
42) హాలీడే (5) |
43) గత జన్మల్లో చేసిన శుభాశుభ కర్మము (5) |
నిలువు:
1) వేద భాగపు కాయ (5) |
2) అప్పు (3) |
3) వేతనం, కూలీ (2) |
4) పూర్వము, ముందు (2) |
5) మూలము, అన్యము (2) |
6) గర్భ లక్షణం, ఆఖరి అక్షరం లోపం (2) |
7) శ్రుతితో కలిసినవి క్రింది నుంచి (3) |
8) పొన్న పూవు, కలువ (5) |
11) ధూళి (2) |
14) చూపుడు వ్రేలు (3) |
15) తెలుగున తొలి కవి (3) |
20) అన్నంలోకి. ఆదరువు (3) |
21) గోడ (3) |
22) చందురుడు (3) |
26) ఉప్మాతో ఈ అట్టు మంచి కాంబినేషను (5) |
27) త్వర (3) |
28) వృషభము (3) |
30) అల్లుడు అత్తగారింట ఉండిపోవడం (5) |
34) ఇంకోసారి (3) |
35) నడు! ఒక పంచమం, ఒక ధైవతం (2) |
36) ఉత్తమ స్త్రీ (3) |
38) మధ్యలోని రెండు ప్రథమా విభక్తి ప్రత్యయాలు (2) |
39) ఇష్టము, అభిలాష (2) |
40) ఇంపు గాని వాసన (2) |
41) పైకెక్కిన కావ్యము (2) |
ఈ ప్రహేళికని పూరించి 2025 మే 20 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-29 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 మే 25 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
పద శారద-28 జవాబులు
అడ్డం:
1.లోకపావని 5. కుటిలాలక 9. చదువు 10. సారాయి 12. వాగులు 13. నరు 16. డవ 17. పక్ష్మము 18. కవ్యము 19. యంత 22. వీటి 23. రుజ 24. వృత్రుడు 25. శ్రోణి 26. పాణి 29. యతి 31. వర్మము 32. పఠిత 33. తేనె 36. గధా 37. యమకం 39. ఆయాసం 41. మెత్తన 42. ముకుష్టకము 43. జలధరము
నిలువు:
1.లోచనద్వయం 2. కదురు 3. పావు 4. నిసా 5. కుయి 6. లావా 7. లగుడ 8. కలువకంటి 11. రాక 14. యక్ష్మము 15. శ్రావ్యము 20. తరుణి 21. ఛాత్రుడు 22. వీణియ 26. పార్వతేయము 27. నర్మద 28. పీఠిక 30. తిరోధానము 34. నెమకు 35. సోయా 36. గత్తర 38. కంష్ట 39. ఆము 40. సంజ 41. మెధ
పద శారద–28 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అరుణరేఖ ముదిగొండ, హైదరాబాద్
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన రావు, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్తా కె., ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళురు/ముంబయి/టెక్సాస్
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- ఉషారాణి జి, తిరుపతి
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.