Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-28

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) జగములను పునీతం చేసే దేవి (5)
5) వంకర వెంట్రుకలు గల స్త్రీ (5)
9) కొ.కు. గారి ఒక ప్రసిద్ధ నవల, విద్య (3)
10) నాటు మద్యము (3)
12) ఏరులు (3)
13) ప్రత్యయం లేని మానవుడు (2)
16) తిరగేసిన గారె (2)
17) కనురెప్ప వెంట్రుక (2)
18) పితృదేవతల కీయదగిన అన్నము, శ్రాద్ధ భోజనము (3)
19) నిరంకుశుడి తొలి అక్షరం తొలగిస్తే, రథ సారథి (2)
22) తాంబూలము (2)
23) రోగము (2)
24) ఇంద్రుడు చంపిన ఒక దైత్యుడు (3)
25) పిఱుదు, మొల (2)
26) చేయి (2)
29) ఛందస్సులోని సన్యాసి (2)
31) తనుత్రాణము (3)
32) చదివేవాడు (3)
33) మకరందము (2)
36) హిందీ గాడిద (2)
37) ఒక శబ్దాలంకారము (3)
39) ప్రయాసతో వచ్చే అలసట (3)
41) మృదువైన (3)
42) అడవి పెసలు (5)
43) మేఘము (5)

నిలువు:

1) రెండు కళ్ళూను (5)
2) రాట్నంతో నూలు వడికే తిక్కడి (3)
3) చంపావు పో! నాలుగో వంతు తీసుకో చాలు (2)
4) తిరగబడ్డ వెల వెలది (2)
5) మొఱ (2)
6) అగ్ని ద్రవం (2)
7) అఖరి అక్షరం పోయిన దుడ్డుకర్ర (3)
8) ఉత్పలాక్షి (5)
11) పున్నమ, అరుదెంచక (2)
14) క్షయ రోగము (3)
15) చెవుల కింపైనది, వినసొంపైనది (3)
20) వయసులో ఉన్న ఆడుది (3)
21) అంతేవాసి (3)
22) సాగిన విపంచి (3)
26) పర్వత సంబంధి; పొద్దు తిరుగుడు చెట్టు (5)
27) పురుకుత్సుని ప్రేయసి, ఒక నది (3)
28) ముందుమాట, పెద్దపీట (3)
30) కనిపించకుండా పోవుట (5)
34) వెదకుట (3)
35) ఈ చిక్కుళ్ళుంటాయి (2)
36) ఉపద్రవము (3)
38) ఇబ్బంది. ఒక అక్షరానికి ఉండాల్సిన అనుస్వారం రెండో అక్షరానికి వచ్చింది (2)
39) మదము, కావరము (2)
40) రేపవళ్ళ నడిమి కాలము (2)
41) పొట్టిదైపోయిన తెలివి (2)

ఈ ప్రహేళికని పూరించి 2025 మే 06 వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-28 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 మే 11 తేదీన వెలువడతాయి. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

పద శారద-27 జవాబులు

అడ్డం:

1) చిలుకరౌతు 5) నేతపురుగు 9) గుప్తత 10) దవంత్రి 12) రివాజ 13) రాము 16) ణంగు 17) ఊర్వశి 18) వింశతి 19) లుక 22) డులు 23) సజ్జ 24) గ్రీష్మము 25) ఔడు 26) రేవు 29) మాజా) 31) బృంహితం 32) నృహరి 33) తీపా 36) తలి 37) పవలు 39) గ్రామణి 41) వామము 42) తిలాపాపము 43) ఏలికసాని

నిలువు:

1) చిగురాకులు 2) లుప్తము 3) కత 4) తుద 5) నేత్రి 6) పురి 7) రువాణం 8) గుజగుజలు 11) వంట 14) ఔర్వము 15) త్రింశత్తు 20) కసవు 21) రసము 22) డుడుమా 26) రేవతీపతి 27) సింహిక 28) ప్రహరి 30) జాబాలిముని 34) పావలా 35) దోమ 36) తమసా 38) లుపా 39) గ్రాము 40) ణిఏ 41) వాక

పద శారద27 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version