‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.


ఆధారాలు:
అడ్డం:
1) మన్మథుడు (5) |
5) సాలీడు (5) |
9) రహస్యంగా ఉంచడం (3) |
10) కోట చుట్టూ రక్షణకై ఉండే నీటి మడుగు (3) |
12) వాడుక; అన్యదేశ్యం – ఆఖరి అక్షరం కొమ్ము లేడు (3) |
13) రా రా కృష్ణయ్య అనే పాట ఈ చిత్రం లోనిదే (2) |
16) వెనుదిరిగిన నారి (2) |
17) పురూరవుని ప్రేయసి (3) |
18) ఇరువది (3) |
19) తిరగబడ్డ బండి చక్రము (2) |
22) మొదటి విభక్తి తొలి మలి ప్రత్యయాలు (2) |
23) పూల బుట్ట, ఒక ధాన్యవిశేషము (2) |
24) వేసంగికాలము (3) |
25) క్రింది పెదవి (2) |
26) ఓడలు ఆగేదీ, చాకివారు పెట్టేది (2) |
29) మామిడి రసం అని భ్రమింపజేసే కూల్ డ్రింకు (2) |
31) ఏనుగు ఘీంకారం (3) |
32) ప్రహ్లాద వరదుడు (3) |
33) మధురమా? (2) |
36) తొలి అక్షరం లోపించిన ఇంద్రుని రథ చోదకుడు (2) |
37) పగలు – విరోధాలు కావు (3) |
39) శ్రేష్ఠుడు, వేశ్య, మంగలి (3) |
41) ఎడమ (3) |
42) నువ్వుల పాపమా! ఈ పాపం తలా పిడికెడని ఒక సామెత (5) |
43) చివర్న వెలయాలు అనిపిస్తున్నా ఈమె పరిపాలకురాలు (5) |
నిలువు:
1) కిసలయములు (5) |
2) లోపించినది, దొంగ సొత్తు (3) |
3) వికృతమైన కథ (2) |
4) చివర (2) |
5) నాయకురాలు (2) |
(6) బర్హము, మెలిక (2) |
7) దివాణం కాదు, కాంతి (3) |
8) గుసగుసల్లాంటివే అనుకోండి (5) |
11) పాక కార్యము (2) |
14) బడబాగ్ని (3) |
15) ముప్పది (3) |
20) గడ్డీగాదం, ఇంటి చెత్త (3) |
21) భయానకమైనది (3) |
22) ఒడిసా రాష్ట్రంలో, మాచ్‌ఖండ్ నది మీది ఒక జలపాతం (3) |
26) బలరాముడు (5) |
27) నీడతో ఆకర్షించి ప్రాణులను చంపి తినెడి రాక్షసి, హనుమంతుని చేత చచ్చింది (3) |
28) ప్రాకారము (3) |
30) స్వర్గం లేదు, నరకం లేదు, పితృ దేవతలు లేరు అంటూ చిత్రకూటంలో రామునితో అడ్డదిడ్డంగా వాదించిన ఋషి (5) |
34) ఈ నాలుగణాల శ్యామల ఒక ఎక్స్ట్రా సినీ నటి (3) |
35) మలేరియా కారక క్రిమి (2) |
36) వాల్మీకి ఈ నదికి స్నానానికి పోయినప్పుడే క్రౌంచ పక్షి మరణం చూశాడు (3) |
38) క్రిందకు ఒలికిన దుగ్ధం (2) |
39) కిలోలో వెయ్యోవంతు బరువు (2) |
40) పైకి చూస్తున్న నల్ల లేడి (2) |
41) ఏరు, ఏరుతో కలిస్తే తొలి దుక్కి (2) |
ఈ ప్రహేళికని పూరించి 2025 ఏప్రిల్ 22వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘పద శారద-27 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 ఏప్రిల్ 27 తేదీన వెలువడతాయి.
పద శారద-26 జవాబులు
అడ్డం:
1) ధూమశకటం 5) అమలాపురం 9) మట్టియ 10) కంబళి 12) జలగ 13) కేక 16) గంనా 17) విశ్రుతి 18) మల్లడి 19) వుతా 22) వీడు 23) హల్లు 24) ప్రఖ్యాతి 25) బిస 26) మంతు 29) ముది 31) సాత్యకి 32) బెజ్జము 33) రవి 36) కంక 37) గిరక 39) పాయసం 41) నగరు 42) రిక్తహస్తము 43) తమిళనాడు
నిలువు:
1) ధూమకేతువు 2) మట్టిక 3) శయ 4) టంకం 5) అళి 6) లాజ 7) పులగం 8) రంగనాథుడు 11) బజ్జి 14) శ్మశ్రువు 15) హల్లకం 20) తాహతు 21) ఆఖ్యానం 22) వీసము 26) మందరగిరి 27) ప్రత్యయం 28) కజ్జలం 30) దినకరుడు/దివాకరుడు 34) విరక్త 35) లయ 36) కంగనా 38) కహ 39) పాము 40) సంత 41) నల
పద శారద–26 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- ద్రోణంరాజు వెంకట మోహన రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాదు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.

శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్‌గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.