‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) రైలు బండిని ఇలా కూడా పిలుస్తారు, పొగ లేకపోయినా (5) |
5) అ అంటే.. ఒక సినిమా పాట (5) |
9) వివాహిత కాలి వ్రేలికి పెట్టుకునేదాన్ని ఇలా కూడా అనొచ్చు (3) |
10) సీతాకోకచిలుక పూర్వరూపం లోని మొదటి మూడక్షరాల్లాంటిది (3) |
12) నీటి క్రిమి, నెత్తురు పీల్చేది (3) |
13) కెవ్వు (2) |
16) వెనుదిరిగిన వేదండం (2) |
17) ప్రసిద్ధి (3) |
18) పరితాపము, పెనకువ (3) |
19) స్థలం అట్నించి (2) |
22) అతడు కాదు, ఇల్లు (2) |
23) అచ్చు కాదు (2) |
24) 17 అడ్డమే, మరో రకంగా (3) |
25) యంత్రపు కీలు (2) |
26) ఇదీ 24 అడ్డమే (2) |
29) జర (2) |
31) శిని అనే యాదవరాజు మనమడు, భారత యుద్ధంలో ఒంటి చేతి భూరిశ్రవుని చంపాడు (3) |
32) రంధ్రము (3) |
33) సూర్యుడు (2) |
36) గుడి కోల్పోయిన వెన్ను (2) |
37) నూతి రాట్నము, ఘంటయంత్రము (3) |
39) దశరథ పుత్రుల జన్మకారకం (3) |
41) రాజ గృహము (3) |
42) వొట్టి చేయి (5) |
43) అరవ రాష్ట్రం (5) |
నిలువు:
1) తోకచుక్క (5) |
2) గోరుచిక్కుడు (3) |
3) వత్తు లేని పడక (2) |
4) పదహారు డబ్బుల బంగారునాణెం (2) |
5) పుష్పంధయము (2) |
6) పేలాల గింజ (2) |
7) పెసరపప్పుతో వండిన అన్నము (3) |
8) శ్రీరంగక్షేత్ర స్వామి (5) |
11) జూరుడుగా, పల్చగా చేసిన వ్యంజనం (2) |
14) మీసము (3) |
15) చెంగలువ (3) |
20) శక్తి, సమర్థత (3) |
21) ప్రత్యుత్తరము; కథ (3) |
22) పదహారో భాగము (3) |
26) తఱిగొండ (5) |
27) విశ్వాసము; విభక్తులకు ఇవి ఉంటాయి (3) |
28) కాటుక, మేఘము (3) |
30) 33 అడ్డంలో ఆయనే (5) |
34) రక్తి లేని స్త్రీ (3) |
35) శ్రుతితో పాటు ఇదీను (2) |
36) హిమాచల్ నుంచి యం.పి.గా గెలిచిన హిందీ దువ్వెన, ఒక నటి (3) |
38) కురచయిన హిందీ ఎక్కడ (2) |
39) సర్పము (2) |
40) వారానికోసారి జరిగే పల్లెబూరి అంగడి; వేద పాఠము (2) |
41) తెలుగు సంవత్సరాలలో యాభైయో ఏడు (2) |
ఈ ప్రహేళికని పూరించి 2025 ఏప్రిల్ 08వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-26 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 ఏప్రిల్ 13 తేదీన వెలువడతాయి.
పద శారద-25 జవాబులు
అడ్డం:
1) దావానలము 5) సంక్రందనుడు 9) నిరుక్తం 10) నిరుకు 12) గదుము 13) మ్మణి 16) రురా 17) బొక్కసం 18) శార్వరి 19) డుసూ 22) ఊబ 23) తిక్తం 24) చైత్రము 25) వేపి 26) వాక 29) రిమ్మ 31) కప్పలి 32) అర్ణవం 33) యమి 36) ఆజా 37) నసవా 39) ఆక్రోశం 41) రవల 42) ముమ్మనుమడు 43) పరివర్తన
నిలువు:
1) దానిమ్మపండు 2) వారుణి 3) నక్తం 4) ముని 5) సంకు 6) దగ 7) నుదురు 8) డుమురాలబ 11) రుక్మం 14) వెక్కసం 15) కర్వలి 20) సూతిక 21) క్షాత్రము 22) ఊపిరి 26) వాతాయనము 27) టిప్పణి 28) వర్ణము 30) మ్మరజాలన 34) మిసమ్మ 35) ధిక్రో 36) ఆవర్త 38) వాను 39) ఆడు 40) శంప 41) రవ
పద శారద–25 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాదు
- కాళీపట్నపు శారద, హైదరాబాద్
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావఝల శారద, హైదరాబాద్
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, పూణె
- రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, ఆదోని
- శిష్ట్లా అనిత, బెంగుళూరు
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.