Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-24

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) గ్రామ సరిహద్దు (4)
3) వికృతమైన విజ్ఞాపనం (3)
5) చంద్రుడు (4)
7) కురూపి నామ సంవత్సరం (3)
9) చీర చెంగు (3)
11) రక్షణ, కావలి (3)
15) ప్రత్యయం కోల్పోయిన ఆమని (3)
17) పరదా, తెర (4)
19) ఆడ గుర్రము (3)
20) కుండలాకారము (4)
21) అతి నెమ్మది నడక, ఆఖరక్షరం లేకున్నా అర్థం మారదు (4)
22) రాముని రెండు సార్లు రారమ్మని పిలవండి (4)
23) వక్క చెట్టు (4)
26) గుర్రములు (4)
28) సూర్యుడు (3)
29) తమిళనాట బాణాసంచా తయారు చేసే ఊరు (4)
33) మయసభలో ధర్మజుడు చేసిన యాగం (4)
36) విరిదండ ఆ వైపు నుంచి వేయండి (4)
38) చెదరిన మేఘము (4)
39) హర్మ్యములు (4)
40) తోక (3)
41) పిల్లా జల్లా (4)
43) తగరం తడబడింది (3)
46) జంతిక చెదిరింది (3)
47) రెప్పపాటు సేపు మాత్రమే ఉండునది (3)
49) చెలిమి! తెలంగాణా పలుకుబడి (3)
51) ఒక అచ్చర లేమ (4)
52) ఆధారకుడ్యం. మూల బంధము (3)
53) తుమ్మెద (4)

నిలువు:

1) పటోలిక (4)
2) 28 అడ్డమే (2)
3) ఆవిరిలో పూవు (2)
4) ధోవతి (2)
5) బదరి (2)
6) హల్లులను అచ్చులతో కలిపి చెప్పుట (4)
8) కలకత్తా దేవత (2)
10) కాపు; తావీదు (2)
12) గాలి (4)
13) తెల్లని వెంట్రుకలు, గొరిజ, తోక గల గుర్రము – తడబడినది (4)
14) అప్పడం తోడిది (5)
15) ఆఖరక్షరం పోయిన మన్మథుడు (4)
16) హింసాదులను విరమించి, ఓరిమితో నుండుట ( 4)
18) చూడము (3)
20) సింహచలంలో – –  – నరసింహుడు (3)
23) రక్కసుడు. పలలాశి గదా (3)
24) అప్పిచ్చు వాడితో, ఇతడు కూడా ఊళ్లో ఉండాలట (3)
25) వెలయాలు (3)
27) మహిషం (3)
30) జాలంతో మొదలయ్యే మన్మథ వ్యథ (4)
31) తొందరగా కోరిక తీర్చుకుందామనుకొనుట (4)
32) పాషాణాలు (3)
33) రజోగుణ స్వభావము (3)
34) సరిగ (4)
35) సంహరించుట (4)
37) ఆంధ్ర శాకం (3)
39) ఉత్తర రామాయణ కృతి కర్త(4)
42) అరవిరి మొగ్గ (4)
44) కైశికము, జడ (2)
45) కిష్కింధ దగ్గరి సరోవరం (2)
47) ఓరిమి, ఇది కవచం లాంటిది అన్నాడు ఏనుగు లక్ష్మణ కవి (2)
48) దుర్వాసన (2)
49) గంప, కర్రతో ఇండ్ల వద్దకు వచ్చి గ్రామీణ స్త్రీ చెప్పే భవిష్యవాణి (2)
50) నూరు యోజనాల నిడివిగల చేప (2)

ఈ ప్రహేళికని పూరించి 2025 మార్చ్ 11వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-24 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 మార్చ్ 16 తేదీన వెలువడతాయి.

పద శారద-23 జవాబులు

అడ్డం:

1) మినువాక 3) తాటాకు 5) జాతిపిత 7) లఘువు 9) క్షిప్రము 11) యమహా 15) రోజువా 17) ముసలాడు 19) కందుకం 20) మేజువాణి 21) కహలము 22) ఒనకూడు 23) కములంక 26) కలియుగం 28) నిలయం 29) రిషభము 33) బుధవారం 36) డాయంజని 38) ఠుడుర్మక 39) కనకన 40) పాతఱ 41) తజులురా 43) వానరం 46) రాజాజీ 47) గాడుపు 49) గాలిబు 51) పులిపంజా 52) రిపువు 53) సరంజామా

నిలువు:

1) మిరియము 2) కల 3) తావు 4) కుక్షి 5) జాము 6) తరవాణి 8) ఘుటం 10) ప్రభ 12) మసకము 13) హాలాహలం 14) నందుడు 15) రోజుకూలి 16) జువాడుయు 18) డులక 20) మేనక 23) కస్తూరి 24) మనిలా 25) నియంత 27) గండీరం 30) షడానన 31) భయంకరం 32) ముజన 33) బుడుత 34) ధర్మజురా 35) వాకలుజా 37) మాతలి 39) కవాటపు 42) రాజీనామా 44) జోడు 45) వాలి 47) గాజా 48) పురి 49) గావు 50) బుస

పద శారద23 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version