‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) పెక్కురు స్త్రీలు చేరి మండలాకారముగా తిరుగుచు చేయు నృత్యము (4) |
3) నేయి (3) |
5) వార వనిత (4) |
7) సూర్యుడు (3) |
9) ధనము (3) |
11) వెనుదిరిగిన వెలది (3) |
15) చిన్న పిట్ట, ఈ జాతి అంతరించిపోతున్నది (3) |
17) కృష్ణునికి (4) |
19) గాడిద (3) |
20) వరిపైరు (4) |
21) వినికిడి, ఒక నక్షత్రము (4) |
22) ప్రసవించు వరకూ కాపాడి — అని అర్థం. —- నక్కల పాలు చేయటం అని సామెత (4) |
23) నాగవల్లి, స్థాలీపాకంతో పాటు, ఇదీ వివాహ సాంప్రదాయంలో ఒక ఘట్టం (4) |
26) తడబడిన ఆపదలు (4) |
28) మోకు, త్రాడు (3) |
29) రహస్యాన్ని గుట్టుగానే ఉంచడం (4) |
33) వెలుగు, తెలివి, ప్రగతి (4) |
36) ఇది ఇంగువ, సన్యాసులు ఉంచే చోటు కాదు (4) |
38) మకిలి, ఇనుము – ప్రత్యయం పోయింది (4) |
39) వైభవమే (4) |
40) కుంకుమము, సిందూరము (3) |
41) మెరయుట యందలి ధ్వన్యనుకరణము (4) |
43) హా! వేగం! ఆపద (3) |
46) తూర్పు మహారాష్ట్ర లోని ప్రాంతం (3) |
47) ఆముదపు చెట్టు (3) |
49) నిపుణత (3) |
51) చంపుట (4) |
52) భ్రమరము (3) |
53) లకుముకి పిట్ట (4) |
నిలువు:
1) పచ్చదనము (4) |
2) బొరియ (2) |
3) వెలుగు, కిరణము (2) |
4) సంజ్ఞాక్షరములు చెక్కిన ఉంగరము (2) |
5) ఈ నగరం తగలబడిపోతుంటే, రాజు ఫిడేలు వాయిస్తున్నాడట (2) |
6) తారీఖు, తేదీ (4) |
8) వెలుతురు, ఒక జబర్దస్తు యాంకర్ (2) |
10) కేవలం దండుగ (2) |
12) ఆశ్రయం లేనిది, మూడో అక్షరం గుడి లేదు, నాలుగో అక్షరం సరళమైంది (4) |
13) ధాన్యంతో మొదలయ్యే పరిచర్య (4) |
14) బురద (3) |
15) బాలుడు, ఫిదా సినిమాలోని పాటని గుర్తు చేసుకోండి. (4) |
16) గాయపు మంట యందగు ధ్వన్యనుకరణము (4) |
18) గరకు వస్తువులను పట్టుకొనుట వలన చేతికి గాసెడి కాయ, కణితి (3) |
20) కోపించు, మండు (3) |
23) పరదా కాదు, వేడుక (3) |
24) సదరు విరోధము, నది (3) |
25) వెన్నెల (3) |
27) నజరానా, అన్యదేశ్యం లోనే (3) |
30) అవమాన నామ సంవత్సరం (4) |
31) శాలిధాన్యపు క్షేత్రఖండము – చెదిరింది (4) |
32) కంధరము (3) |
33) కరగిపోయిన _ ఆఖరి అక్షరంలో గుడి వచ్చింది (3) |
34) ఈవుల మొదవు (4) |
35) రెండు షడ్జములు, ఒక నిషాదము, ఒక ధైవతము (4) |
37) తీగ పెరిగి పరుచుకునేందుకు ఇది కావాలి (3) |
39) ఆకాశము (4) |
42) కడుపుకోత (4) |
44) ఫిడేలు నాయుడుగారి ఇంటిపేరు (2) |
45) పాతకాలపు కొలమానం (2) |
47) జింక (2) |
48) బడాయి (2) |
49) అపరాధం (2) |
50) పూలబుట్ట, దొప్ప (2) |
ఈ ప్రహేళికని పూరించి 2025 ఫిబ్రవరి 11వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-22 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 ఫిబ్రవరి 16 తేదీన వెలువడతాయి.
పద శారద-21 జవాబులు
అడ్డం:
1) మందాకిని 3) హేళన 5) కూటికోసం 7) జంధ్యాల 9) దండన 11) సాధక 15) మహిమ 17) నిరాలయ 19) సన్మానం 20) సౌదామని 21) మరనది 22) తరలము 23) కొరవంజి 26) భసనము 28) రంధ్రము 29) విదేహజ 33) ధురంధర 36) వరిగడ్డి 38) బొగ్గుగని 39) ఆయాతము 40) సాహిణి 41) కువకువ 43) వనము 46) ల్లిడున 47) లూమము 49) కాహలి 51) యమదూత 52) డిగ్గియ 53) పిరదౌసి
నిలువు:
1) మంత్రసాని 2) నిజం 3) హేల 4) నదం 5) కూన 6) సంయమని 8) ధ్యానం 10) డబ్బీ 12) ధరామర 13) కలరవం 14) ఉన్మాదం 15) మదాలస 16) హిమమున 18) యనజి 20) సౌరభ 23) కొరివి 24) సైరంధ్రి 25) చమురు 27) మధుర 30) దేవయాన 31) హరితము 32) జగము 33) ధుగ్గుకు 34) రంగవల్లి 35) ధనికుడు 37) రోహిణి 39) ఆవకాయ 42) వనవాసి 44) ఆమ 45) ఈహ 47) లూత 48) ముడి 49) కాయ 50) లిపి
పద శారద-21 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- భద్రిరాజు ఇందుశేఖర్, హైదరాబాద్
- భాగవతుల కృష్ణారావు, సికింద్రాబాద్
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావఝల శారద
- రామకూరు నాగేశ్వరరావు, శ్రీకాకుళం
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- శంభర వెంకట రామ జోగారావు, బెంగుళూరు/ముంబయి
- శిష్ట్లా అనిత
- శ్రీనివాసరావు సొంసాళె, ఎమ్మిగనూరు
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.