‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.
సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1) గంగానది, హరిచరణోద్భవ కదా! (4) |
3) గుర్రమే (3) |
5) మోసము, వంచన (4) |
7) దాశరథి దేనితో సమరం చేశాడు (3) |
9) మకుటధారి ఐన కౌంతేయుడు (3) |
11) సాగిన రేయి (3) |
15) రాగి పైరు (3) |
17) కులంలో గౌరవం పొందే స్త్రీ (4) |
19) పొగ (3) |
20) తిరుమల గేట్ వే (4) |
21) మంత్రం మననం చేసుకునేప్పుడు పట్టుకొనే దండ(4) |
22) పురోహితునికిచ్చే దక్షిణ (4) |
23) తారుమారైన తరువాతి దినం (4) |
26) సమ్మతి చెదరినది (4) |
28) ఆడ ఏనుగును సరిచేస్తే జమదగ్ని పత్ని (3) |
29) సృజింప నిచ్చ గలవాడు (4) |
33) పావురము (4) |
36) పాములవాడు ఆఖర్న తడబడ్డాడు (4) |
38) వారికి తెలియదు. వారు – – – – (4) |
39) మగ కోతి (4) |
40) శుచి తోడిది (3) |
41) వానలు పడగానే ప్రారంభించే తొలి దుక్కి (4) |
43) గుట్టు చెదిరింది (3) |
46) ‘చిన్నా’ తో జోడు పదం (3) |
47) సమీర కుమారుడు (3) |
49) అనర్హులు; పొట్టేలు (3) |
51) మత్తెక్కించే కండ్లు గల స్త్రీ (4) |
52) వెనక్కొచ్చిన తండ్రి సోదరి (3) |
53) శ్రీనివాస నివాసము (4) |
నిలువు:
1) అన్నం వడ్డించే ఆకు (4) |
2) రాక్షసుల తల్లి (2) |
3) నక్క; భయంకరము (2) |
4) వెన్ను; కండె (2) |
5) వరాహము (2) |
6) ఆడుది (4) |
8) 2013 లో వచ్చిన ప్రభాస్ సినిమా, కారంగా ఉంటుంది (2) |
10) రివాజుకు ముందుది (2) |
12) నువ్వులలో ఇచ్చే నివాళి (4) |
13) రిషభం, గాంధారం, పంచమం, మధ్యమం (4) |
14) తుమ్మెద (3) |
15) శయ్య, తల్పమునకు మరో రూపం (4) |
16) అడవి (4) |
18) ముస్లిముల ప్రార్థన (3) |
20) రసాభాస కావడం (3) |
23) ఆకాశం (3) |
24) 28 అర్థం సరిచేస్తే ఆడ ఏనుగు, ఆఖరక్షరం లుప్తం (3) |
25) మంచము (3) |
27) మిణుగురు పురుగు (3) |
30) జంబుకము (4) |
31) మంగలి వాని పని (4) |
32) దీని పట్టు గట్టిది. హల్లుతో ప్రారంభించండి, ఫర్వాలేదు (3) |
33) అతిశయించడం తడబడింది(3) |
34) కావి కాంతి (4) |
35) తరువాత కాదు; పొద్దున్నే (4) |
37) ఆశ్చర్యం (3) |
39) 1995 లో రామగోపాల వర్మ నిర్మించిన శివనాగేశ్వరరావు వంశీ దర్శకత్వ సినిమా. కింది నుంచి (4) |
42) రెండు కకారాలతో సన్యాసుల సంచి (4) |
44) పూచీ (2) |
45) శోకము, దిగులు (2) |
47) ఒక పత్రిక పేరుతో వచ్చిన బావు సినిమా (2) |
48) ఖాళీ (2) |
49) పశు గ్రాసం కింది నుంచి (2) |
50) ధ్వని, శబ్దము (2) |
ఈ ప్రహేళికని పూరించి 2025 జనవరి 14వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-20 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 జనవరి 19 తేదీన వెలువడతాయి.
పద శారద-19 జవాబులు
అడ్డం:
1) శ్రమదానం 3) దీనారం 5) గర్భజాత 7) దిదృక్ష 9) ధిక్కారం 11) వాతెర 15) మానీవా 17) రిక్కరేడు 19) పతంగం 20) వరిలత 21) రక్షకుడు 22) త్తిరచుక 23) క్రముకము 26) కుడుచయా 28) దేవర 29) చదరంగం 33) సత్రాజిత్తు 36) రాజతము 38) కనచుల 39) నెపములు 40) కంధరం 41) దుపాకర 43) లతిక 46) మురస 47) బేజారు 49) మురమ్య 51) కలకండ 52) చివర 53) యామవతి
నిలువు:
1) శ్రమవారి 2) నంది 3) దీక్ష 4) రంధి 5) గరం 6) తరువాత 8) దృష్టి 10) క్కాసి 12) తెక్కరము 13) రరేక్షక 14) ఆతంకం 15) మారిచుడు 16) నీలకచ 18) డుకుము 20) వరకు 23) క్రకచ 24) వైదేహి 25) కురరి 27) యావత్తు 30) దరాపతి 31) రంజముక 32) గంతలు 33) సనదు 34) త్రాచుపాము 35) జిలకర 37) బంధకి 39) నెలవంక 42) రసవతి 44) మజా 45) తార 47) బేడ 48) రుచి 49) ముర 50) మ్యయా
పద శారద-19 కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనూరాధ సాయి జొన్నలగడ్డ
- అరుణరేఖ ముదిగొండ
- దేవగుప్తాపు ప్రసూన, విశాఖపట్టణం
- ద్రోణంరాజు వెంకట మోహన రావు
- ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
- కర్రి ఝాన్సీ, హైదరాబాదు
- కాళీపట్నపు శారద, హైదరాబాదు
- మధుసూదనరావు తల్లాప్రగడ, బెంగుళూరు
- మంజులదత్త కె, ఆదోని
- పి. వి. రాజు, హైదరాబాదు
- రంగావఝల శారద
- రామలింగయ్య టి, తెనాలి
- రామవరపు గిరిజాశంకర రావు, బెంగుళూరు
- రాయపెద్ది అప్పాశేషశాస్త్రి, ఆదోని
- శిష్ట్లా అనిత
- వర్ధని మాదిరాజు, హైదరాబాద్
వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.
గమనిక:
- ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
- ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
- గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
శ్రీ సిహెచ్.వి. బృందావనరావు తపాలా శాఖలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్గా పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి ప్రస్తుత నివాసం నెల్లూరు.
వీరికి సాహిత్యం మీద ఎంతో అభిరుచి ఉంది. రెండు కథా సంపుటాలు, రెండు కవితా సంపుటాలూ, ఒక ఖండకావ్యమూ, ఒక నానీల కవితాసంపుటీ వెలువరించారు. ఇటీవలే వాల్మీకి రామాయణం లోని సుందరకాండకు 1500 పద్యాల – మూల విధేయ మైన అనువాదాన్ని ప్రచురించారు. గడినుడి పూరణలంటే ఉన్న అభిరుచి కారణం దాదాపు అరవై ఏళ్ళ నించే వివిధ పత్రికల్లోని గడినుడులను పూరణ చేస్తూనే ఉన్నారు.
సంచిక వారు సంకలించి, ప్రచురించిన ‘రామకథాసుధ’ సంకలనంలో వీరి కథ ‘కౌగిలి’ కూడా ఉన్నది. వీరిని 9963399189 అనే నెంబరులో సంప్రదించవచ్చు.