Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పద శారద-19

‘సంచిక’ వెబ్ పత్రికలో మరో గళ్ళనుడికట్టుకు స్వాగతం.

సిహెచ్.వి. బృందావనరావు గారు ‘పద శారద’ అనే గళ్ళనుడికట్టు రెండు వారాలకి ఒకసారి నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1) గ్రామానికి సంబంధించిన పనిని కూలి తీసుకోకుండా గ్రామస్థులే చేసే పద్దతి (4)
3) పైడి నాణెము (3)
5) కడుపున పుట్టినది (4)
7) చూడాలనే ఇచ్ఛ (3)
9) తిరస్కారం; ఎదిరించుట (3)
11) పెదవి (3)
15) మానుకోవా – ఉత్తరాంధ్ర యాసలో (3)
17) చంద్రుడు (4)
19) పక్షి; గాలిపటము (3)
20) చెదిరిన గ్రామ బంట్రోతు (4)
21) కాపాడేవాడు (4)
22) తడబడిన ఛురిక (4)
23) పోక చెట్టు (4)
26) చెదిరిన బిచ్చగాడు (4)
28) ప్రభువు; జంగంను ఇలా పిలుస్తారు (3)
29) బొమ్మసైన్యంతో ఆడే క్రీడ (4)
33) శమంతక మణి అసలు ఓనరు (4)
36) వెండికి సంబంధించినది (4)
38) చాలా సులువు – చెదిరింది (4)
39) వంకలు, మిషలు (4)
40) మేఘము, మెడ (3)
41) తొలి అక్షరం కోల్పోయి చెదిరిన కాకరపాదు (4)
43) తీవ (3)
46) తిరగబడిన దండ (3)
47) తబ్బిబ్బు, గుబులు – అన్యదేశ్యం (3)
49) అందమైనది, క్రమం తప్పింది (3)
51) పటిక బెల్లం (4)
52) ఆఖరున (3)
53) రాత్రి (4)

నిలువు:

1) చెమట (4)
2) శివుని ఎక్కిరింత (2)
3) పట్టుదల, ఏకాగ్రత (2)
4) కిరికిరి. విశాఖ మాండలికంలో కథలు రచించిన సోమరాజు ఇంటి పేరు (2)
5) వేడి అన్యదేశ్యం (2)
6) ఇప్పుడు కాదు; ఆనక (4)
8) చూపు (2)
10) అన్యదేశ్యంలో నాణెము; క్రింద నుండి (2)
12) విలాసము (4)
13) తావీదు లాంటిది, తడబడింది (4)
14) విఘ్నము (3)
15) సుబాహుని అన్న, రెండో అక్షరం పొట్టిదైంది (4)
16) నల్లని కురులు గల స్త్రీ (4)
18) హేరంబుని ఇష్టమైన పిండివంట, తడబడింది (3)
20) దనుక; పర్యంతము (3)
23) బిందువు లుప్తమైన రంపము (3)
24) సీతమ్మ (3)
25) ఆడుగొఱ్ఱె (3)
27) భార్య లో ‘ర’ అక్షరానికి ఉన్నది – మొత్తము (3)
30) తొలి అక్షరం ఒత్తు కోల్పోయిన రాజు (4)
31) చెదిరిపోయిన ఇంగిలీకం (4)
32) గాంధారి కళ్ళకు (3)
33) బిరుదు; అధికారపత్రం అన్యదేశ్యం(3)
34) అసిత బిలేశయము(4)
35) సింగినాదం దినుసు (4)
37) రంకుటాలు (3)
39) వంకర జాబిల్లి (4)
42) వంటయిల్లు (4)
44) తిరగబడిన ఒక పండు, తిరగబడకుంటే సంతోషం (2)
45) బుధుని తల్లి (2)
47) పాతకాలపు రెండణాల నాణేం (2)
48) చవి, ఇష్టము (2)
49) చంద్రగుప్త మౌర్యుని తల్లి (2)
50) దక్షిణ దిశ; భరణీ నక్షత్రం క్రిందనుంచి (2)

ఈ ప్రహేళికని పూరించి 2024 డిసెంబర్ 31వ తేదీ లోపు puzzlesanchika@gmail.com కు సమాధానాలను మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘పద శారద-19 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసిన వారి పేర్లు 2025 జనవరి 05 తేదీన వెలువడతాయి.

పద శారద-18 జవాబులు

అడ్డం:

1) అజరామరం 4) వందేమాతరం 8) లేని 9) వని 11) సకలము 13) తిరకాసు 15) తపాలా 17) సతిమ్మ 19) నారద 21) సేద్యము 22) లఅరు 23) యావత్తు 24) లుఠనము 27) సురవాసం 30) వర్మ 31) క్కరె 33) సరదారు 35) పసివారు 38) వశము 40) దుబాసి 42) ధిక్కారం 44) సర్వదా 45) రాతిరి 46) రసిత 47) యంత్రనౌక 50) కలభము 53) యష 54) హరి 55) దేశముదురు 56) పరిణయము

నిలువు:

2) రాలేక 3) మనిల 5) దేవర 6) మానికా 7) వసంతసేన 10) చారుదత్తుడు 11) సలాములు 12) ముసలము 13) తిమ్మరుసు 14) సునాయాసం 16) పాద్య 18) తిఅ 20) రవ 25) ఠవర 26) నర్మదా 28) రక్కసి 29) వారెవా 32) అవసరము 33) సముదాయం 34) రుదురాక 35) పసిరిక 36) రుధిరము 37) నిరంతరము 39) శర్వ 41) బాతి 43) క్కాసి 48) త్రయము 49) నౌషదు 51) లహరి 52) భరిణ

పద శారద-18 కి సరైన సమాధానాలు పంపిన వారు:

వీరికి అభినందనలు. జవాబులు పంపేవారు, తమ పేరుతో పాటు ఊరి పేరు కూడా వ్రాయగలరు.

గమనిక:

  1. ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
  2. ఈ పద ప్రహేళికలో అడ్డం, నిలువు ఆధారాలతో ఏవైనా సందేహాలు కలిగితే నిర్వాహకులు సిహెచ్.వి. బృందావనరావు గారిని 9963399189 నెంబరులో, chvbraossp@gmail.com లో గాని సంప్రదించగలరు.
  3. గడి ఆధారాలకు సంబంధించిన సందేహాలకు గడి నిర్వాహకులను సంప్రదించాలి. సంచిక మెయిల్ ఐడిలో ఉత్తరప్రత్యుత్తరాలకు తావు లేదు.
Exit mobile version