[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘పచ్చని పిలుపు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
చీకటిని శ్వాసిస్తూ
రహస్యం ఎన్నాళ్ళు?
పగటి భయంతో
ఒంటరి కోటలో
జీవితమంతా ఇంతేనా?
గుబురు ఆలోచనలలో
గుట్టుగా గుండె చప్పుళ్లు
దాచడం సాధ్యమేనా?
చిక్కుపడ్డ మనసులో
బందీ కాబడ్డ కలకు
విముక్తి లేదా?
పచ్చని పిలుపు అల్లుకుని
ఏపుగా పాకితే
కోసుకునేవన్నీ కోరుకున్నవేగా