సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “పాపం దేవుడు” కథ వెరైటీ గా ఉన్నది…రవి కాంచనిది కవి కాంచును అన్నట్లు ఎవరికీ రాని ఆలోచనలు ఈ కవులకు, రచయితలకు వస్తుంది..చదువుతున్నంత సేపూ నవ్వుకుంటూనే ఉన్నాను…”నాయనమ్మకు చెవుడు ఉన్నదా, లేదా!” అని అడిగితే “ఏమోరా! దేవుడు ఉన్నాడా లేడా అన్న ప్రశ్న లాంటిదే ఆవిడ చెవుడు కూడా!” అనేవారు మా నాన్న. ఎందుకంటే నాయనమ్మ ఎదురుగా నిలబడి గొంతు చించుకుని అరిచినా వినబడేది కాదు. ఎవరైనా రహస్యంగా చెప్పుకునే మాటలు మాత్రం వినబడేవి చిత్రంగా..కథ చదువుతుంటే ఆ విషయం గుర్తు వచ్చింది………కథ ముగింపు బాగుంది.

  2. 2

    డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు

    కథ చదువుతున్నంత సేపూ నవ్వుతూనే వున్నాను ..’ అన్న మీ మాటలు కథకు మీరిచ్చిన సర్టిఫికెట్ లా అనిపించి అలరించాయి మురళీకృష్ణ గారూ .కథ బాగుంది ‘ అంటూ ప్రశంసించినందుకు ధన్యవాదాలు .బోలెడు ప్రోత్సాహం లభించినట్లయింది ఈ రోజు . మీ బామ్మ గారి చెవుడు కు , దేవుని ఉనికి కీ భలేగా లింక్ పెట్టారు .నవ్వుతెప్పించాయి మీ నాన్నగారి మాటలు 😊మీ విలువైన సమయాన్ని వెచ్చించి కథ విని ,చక్కటి పరిశీలనతో మంచి కామెంట్ పెట్టినందుకు థాంక్యూ 🙏

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: * దొంగతనం చేయడానికి బయలుదేరిన దొంగ, గుడికి వెళ్ళి, రక్షక భటునికి దొరక్కుండా చూడు స్వామి నేను కొట్టుకొచ్చిన సొమ్ములో కొంత నీ హుండీ లో వేస్తా అని మొక్కుకుంటాడు. వాడిని పట్టుకోవడానికి బయలుదేరిన రక్షక భటుడు కూడా అదే గుడికి వచ్చి ఆ దొంగ నాకు దొరికేలా చేస్తే నా జీతంలో కొంత నీ హుండీ లో వేస్తా అని మొక్కుకుంటాడు.
    మరి పాపం దేవుడు ఎవరికి సాయం చేస్తాడో తెలియదు.
    మనసులో అసూయా ద్వేషాలు నింపుకుని, పక్కవాడు అధోగతి పాలవడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుని బ్రతుకుతూ ఉపవాసాలు, నోములు, వ్రతాలు ఎన్ని చేసి ఏమి ఉపయోగం?
    మా నాన్నగారు అనేవారు, సంవత్సరం అంతా చదవకుండా, సరిగ్గా రేపు పరీక్ష అనగా గుడికి వెళ్ళి ఎన్ని టెంకాయలు కొట్టినా ఎన్ని మొక్కులు నొక్కినా ప్రయోజనం లేదు అని.
    చేసే పాపాలు చేస్తూ, దేవుని హుండిలో లక్షలు వేసే వారి కంటే, దేవుని పేరుతో (వాళ్ళ నమ్మకం..వాళ్ళ బలం ఆ దేవుని పేరుతో షాప్ ఉంటె వారికి మంచి జరుగుతుంది అని) పెట్టుకున్న వైన్ షాప్ అయినా, మటన్ షాప్ అయినా ఏదైనా సరే వారి వృత్తిని దైవంగా భావించి , సాటి మనుషుల పట్ల మానవతా దృష్టి ఉన్నవారే గొప్ప.
    వాణీ చలపతిరావు గారి ‘పాపం దేవుడు’ కథ, హాస్య వ్యంగ్యం కంటే కూడా ఒక చక్కటి అంతర్లీనమైన సందేశాన్ని ఇచ్చింది. చక్కటి కథ.*

    1. 3.1

      కొల్లూరి సోమ శంకర్

      ఇది డా. శ్రీమతి కొఠారి వాణీచలపతిరావు గారి వ్యాఖ్య:*సంచిక లో వచ్చిన నా కథ.. ‘పాపం దేవుడు’ మీద అరుణ గారి వ్యాఖ్యను చదివాను. అద్భుతంగా వుంది. వారు కథను ఆసక్తిగా చదవటమేగాక దాని లోతుకి వెళ్లి అంతరార్థాన్ని పట్టుకొని ప్రస్తుత సామాజిక పరిస్థితులు, మనుషుల మనస్తత్వాలతో అనుసంధానం చేస్తూ వ్యాఖ్యానించిన తీరు బాగుంది.. పాపం దేవుడు.. అని మీకు కూడా అనిపించింది కదా అరుణ గారూ 👍😊
      మీ నాన్నగారు మీ చిన్నప్పుడు మీతో అన్నమాటలను నేను ఎప్పుడూ మా students కి చెపుతుంటాను. అరుణ గారూ..! సారాకొట్టువాళ్ళు, మటన్ షాప్ వాళ్ళు వాళ్ళ shop కి దేవుడి పేరు పెట్టుకోవచ్చు.. వాళ్ళదీ ఒక వృత్తే గనుక! కాకుంటే దానిమీద చుట్టుపక్కల వారి నుంచి విమర్శలు ఎలా వస్తాయో ‘అది’ నేను కథలో చెప్పింది. అవునండీ.. పోలీస్, దొంగ ఇద్దరు గుడికి వెళతారు. దొరకాలని ఒకరు.. దొరకొద్దని మరొకరూ కోరుకుంటారు.. మరి దేవుడు ఎవరి కోరిక తీర్చాలి 😄 సమస్యే కదా.. అందుకే ఈ కథకు పాపం దేవుడు అన్న పేరు పెట్టానండి. నిజంగా ఒకరోజు కూర్చొని ఆలోచిస్తుంటే.. మనకన్నా దేవుడికి ఎన్ని సమస్యలు, ఎన్ని సంకటస్థితులో కదా అని అనిపించింది.. అప్పుడే ఈ కథకు మనసులో అంకురార్పణ జరిగింది. అరుణ గారూ.. నేను ఊహించని విధంగా ఈ రోజు మీ కామెంట్ నాకు అంది ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించింది. ‘చక్కటి కథ’ అన్న మీ మాటల్ని ఎన్ని సార్లు చదువుకున్నానో. రచయితలకు మంచి పాఠకులు దొరికితే మృష్టాన్నభోజనం తిన్నంత సంతోషంగా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా మనకు పరిచయం లేకపోయినా మీ మాటలు నా మనసుని తాకి మంచి స్నేహితురాలిని కలిసిన భావనను కలిగించాయి.. అనేక ధన్యవాదాలండీ 🙏🙏*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!