Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పాడు తలపు

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘పాడు తలపు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

తోడు కోసం
నీడతో స్నేహం
అంతటా ఏదో
తెలియని సందేహం
అభిమానం అంటూనే
అడుగడుగునా అవమానం
అనుమానంతోనే
ఆసాంతం ప్రయాణం
నీడ సంగతేమో
పాడు తలపు
తనలోనే ఉంది
జాడ్యమంతా నింపుకుని
నీడనే పీడ అంటోంది

Exit mobile version