Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒంటరి..!!

[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘ఒంటరి..!!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


వును..
నేను ఒంటరినే..
మీరు అన్నా.. కాదన్నా
నేనిప్పుడు ఒంటరినే !
అప్పుడు.. నామెడలో
మూడుముళ్ళు వేసిన
నా సహచరుడున్నప్పుడూ
నేను ఒంటరినే..!
పాతికేళ్ళ నాడు
తన స్వార్థం కోసం
అతగాడు పైలోకాలకు
వెళ్ళిపోయినప్పటి నుండీ
ఇప్పుడూ నేను ఒంటరినే..!
కనిపెంచిన పిల్లలెందరు,
నా చుట్టూ వున్నా..
నిశీథి సమీపించే వేళకు,
నిండు పున్నమి
నా చుట్టూ అల్లుకునే వేళకు,
అసలైన ఒంటరిగా
మిగిలిపోతాను నేను..!

Exit mobile version