ప్రియా.. ఎదురుచూపులు
ప్రేమంటే వలపంటే
ప్రేమంటే మోహమైతే
నా తలపుల తలుపులు తీసి
నీ కోసం నే చూస్తున్నా
కళ్ళళ్ళో వత్తులు వేసి
నా జీవనజ్యోతిని ఆరనీయక నిలిపి
వలపు తీపి ఒడలంతా పాకి
కుదురుగా నన్ను నిలవనీయక
నీ చెంత నిలచి కావి వైరాగ్యముతో
నీవు నా వరసంపదవనీ
నీవే నా అష్టైశ్వర్యాలవనీ
నీ తలపులే నా కీర్తిసంపదలనీ
ఈ లోకానికంతా నేచాటాలని
నేను సన్యసిస్తున్నా
.. భావి జీవితాన్ని..
డా. హేమావతి బొబ్బు తిరుపతి వాసి.
వీరి ప్రాథమిక విద్య తిరుమలలో, ఉన్నత విద్య తిరుపతిలో జరిగింది.
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. ఆర్ జి యు కె టి ఇడుపులపాయలో అధ్యాపకురాలిగా పనిచేసారు.