Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఓ మనిషీ.. నీ పయనమెటు

[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘ఓ మనిషీ.. నీ పయనమెటు’ అనే కవితని అందిస్తున్నాము.]

తోటి మనిషి తల్లడిల్లుతున్నాడు
కూటికి గుడ్డకు గూడుకు

నీ మానానా నువ్వు
బతికేస్తున్నావ్
వాడి మానాన వాన్ని వదిలి

చీము రక్తం వున్న మనిషి
చేసే పనా ఇది
సాటి మనిషి బాగోగులు
పట్టవా నీకు

దానధర్మాలు చేసే రోజులు కావు
ఆ రోజులొక గతించిన జ్ఞాపకం
I am busy.. you know
Please leave me

అది చేస్తాం ఇది చేస్తాం
శుష్క వాగ్దానాలు చేసి
అందలమెక్కిన నయా నవాబుల్లారా
వినబడుట లేదా..
అన్నార్తుల ఆకలి కేకలు

టైమ్ లేదు.
please excuse me
I have better things to do

అలా తప్పుకుంటా వేమిటీ
కుంటి సాకులు చెప్పి

పని కావాలోయ్
బతుకు తెరువు కావాలోయ్
అని అడిగే ధైర్యం లేదు బాధితులకు

అడిగితే కాని అమ్మైనా పెట్టదు
సామెత తెలియదు కాబోలు ఈ
మూగ మనసులకు

తినే వాన్ని చూస్తూ
తాగే వాన్ని చూస్తూ
కట్టే వాన్ని చూస్తూ
కాలం గడిపేసే మనిషీ

నీ పయనమెటు..

Exit mobile version