[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నువ్వు.. నేను!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
కాటుక నీవైతే
నయనం
నేనవుతా
హాసం నీవైతే
అధరం
నేనవుతా
తిలకం నీవైతే
నుదురును
నేనవుతా
అద్దం నీవైతే
రూపం
నేనవుతా
ధ్యాసవు నీవైతే
శ్వాసను
నేనవుతా
ప్రేమవి నీవైతే
హృదయం
నేనవుతా
నేనే నవ్వైతే
నువ్వే
నేనవుతా