[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘నివ్వెరబోయింది కాలం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
కాలం పడింది అంతర్మథనంలో
తాను ఊహించని మార్పుకు
మూలాన్ని వెదుకుటలో
చవిచూసింది నాటి చూస్తోంది నేటి
రాజ్యాలను రాజులను
మంత్రులను సైన్యాధ్యక్షులను
వీరందరి పోకడలను మరియు పరిపాలనను
గమనిస్తోంది
ప్రజల పశుపక్ష్యాదుల మనుగడను
ప్రకృతివనరుల పరిరక్షణను
పర్యావరణ పర్యవేక్షణను
ఆవేదనతో
వెదుకుతోంది తన మార్పుకు గల సూత్రధారులను
తన స్వీయ పరిశీలనలో తేలింది
ప్రజలే పెను మార్పులకు మూలం అని
ముమ్మాటికి ప్రజలదే బాధ్యత అని
నివ్వెరబోయింది కాలం
అసలైన వాస్తవికతను తెలుసుకొని
డా. మైలవరం చంద్ర శేఖర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రోగ్రాం హెడ్ – బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్
హైదరాబాద్