Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిరీక్షణ

ఓ పువ్వుని వికసింపజేసే పరిమళంలాంటి తన నవ్వు కోసం వేచి ఉంటానంటున్నారు డా. విజయ్ కోగంటినిరీక్షణ” అనే కవితలో.

వేసవి సాయంత్రపు గాలి
నన్ను పరిక్షిస్తున్నట్లే వుంది
ఒక్క ఆకూ కదలదు
ఒక్క రెమ్మా బదులీయదు
విరిసి గుబాళించాల్సిన ఈ సంపెంగ కూడా
ఇంకా దేనికోసమో ఎదురుచూస్తోంది

నీకేం నువ్వలా కలలా నవ్వి వెళ్లి పోతావు
నేనేమో సుతారంగా పడ్డ
నీ అడుగుజాడల పువ్వులను వాడకముందే
ఏరుకోవాలనుకుంటూ
సతమతమౌతాను

ఒక్క నవ్వునైనా పంపు
ఆకుల కలలను కదిపే గాలిలా
ఈ సంపెంగను వికసింపజేసే పరిమళంలా
ఒకే ఒక్క నవ్వు.

Exit mobile version