Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిరీక్షణ

[డా. షహనాజ్ బతుల్ రచించిన ‘నిరీక్షణ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

పేదవాళ్లు కూలీ చేసుకునేవారు
మా బ్రతుకులు బాగుపడతాయా
అనే ఆశతో కొత్త వేకువ కోసం
నిరీక్షిస్తున్నారు.

రైతులు ఈ వరదలు పోయి,
అకాల వర్షాలు అతివృష్టి పోయి,
పంటలు బాగా పండే రోజు,
పంటలకు లాభాలు వచ్చే రోజు
వస్తుందేమో,
అనే ఆశతో కొత్త వేకువ కోసం
నిరీక్షిస్తున్నారు.

రోగాలతో బాధపడేవారు,
ఈ రోగాలు తగ్గుతాయా,
అందరిలా ఆరోగ్యంగా ఉండగలమా
ఆరోగ్యంగా ఉండటం కోసం
రోగం తగ్గాలని
ఆశతో కొత్త వేకువ కోసం
నిరీక్షిస్తున్నారు.

పేదవారైన
ఆడపిల్లల తల్లిదండ్రులు,
మా కూతుళ్లకు పెళ్లిళ్లు అవుతాయా
ఆశతో కొత్త వేకువ కోసం
నిరీక్షిస్తున్నారు.

డిగ్రీలు చేత పుచ్చుకొని,
ఉద్యోగం లేని, దొరకని,
వారు ఉద్యోగం కోసం,
ఉద్యోగం వస్తుందని
ఆశతో కొత్త వేకువ కోసం
నిరీక్షిస్తున్నారు.

ఆడపిల్లలు
భయపడకుండా,
నిర్భయముగా,
బయటికి వెళ్లే రోజు వస్తుందా?
ఆడపిల్లల మీద
అత్యాచారాలు ముగిసిపోతాయా?
ఆశతో కొత్త వేకువ కోసం
నిరీక్షిస్తున్నారు.

Exit mobile version