Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిను తలచి..!

[శ్రీ కయ్యూరు బాలసుబ్రమణ్యం రచించిన ‘నిను తలచి..!’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రియా..!
నువ్వు గుర్తొచ్చినపుడల్లా
నా మనసు పరవశిస్తుంది

నిను పలకరించినపుడల్లా
నా మది పులకరిస్తుంది

నిను చూసినపుడల్లా
నా ఎద ఉప్పొంగుతుంది

నీ ఊహల్లో తేలినపుడల్లా
నా హృదయం పరిమళిస్తుంది

నీతో క్షణం గడిపినపుడల్లా
నా గుండె లయ పెరుగుతుంది

నీ ధ్యాసలో ఉన్నప్పుడల్లా
నా శ్వాస నులివెచ్చనవుతుంది

నువ్వే నేనని తలచినపుడల్లా
నా జన్మ ధన్యమవుతుంది

Exit mobile version