Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిన్ను చూస్తే గాని

సూర్యుణ్ణి చూస్తే గాని పొద్దుపొడవదు
చంద్రుణ్ణి చూస్తే గాని నిద్రపట్టదు
నిన్ను చూస్తే గాని గుండె కొట్టుకోదు

మనం కలిసి నడిచిన బాటలు
మన కలిసి తడిసిన వర్షాలు
మనం కలిసి ఆడిన దాగుడుమూతలు
నిన్ను చూస్తే గాని గుండె కొట్టుకోదు

మనం కలిసి చూసిన ఇంద్రధనస్సులు
మనం కలిసి పాడిన పల్లవులు
మనం కలిసి ఎగిరిన గంతులు
నిన్ను చూస్తే గాని గుండె కొట్టుకోదు

మనం చేసిన బాసలు
మనల్ని కలిపిన బంధాలు
ప్రేమకు పునాదులు
పెళ్ళికి ఏడడుగులు!

Exit mobile version