Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిద్రదేవతా!

[‘నిద్రదేవతా’ అనే పద్య కవితని అందిస్తున్నారు శ్రీమతి సూర్యదీప్తి.]

ఉ.
యెంతయొ బాధనందు మది
నించుకశాంతియులేనివారినిన్
చింతనసేయుచున్
కినుకచేతను నొచ్చినమానసమ్ములన్
కొంతయునూరడింపుకని
కోరియువేచిన జీవకోటినిన్
మంతనమాడిచేరెదవు
మామది మెచ్చిన నిద్రదేవతా!

ఉ.
ఆకలి వేళలన్ అలసి హాయినికోరెడి నేత్రయుగ్మమున్
సాకెదవమ్మ ప్రేమగను జాలిని బూనియు గారబమ్ముగన్
చీకటి గూటిలో కనులు చిక్కని రేయిన తృప్తినొందగా
వేకువ దాక నీ యొడిన పేర్మిగ దాచెదవోదయామయీ!

Exit mobile version