Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నిద్ర మాత్రలు వేసుకున్న నిజం

[శ్రీ సాహితి రచించిన ‘నిద్ర మాత్రలు వేసుకున్న నిజం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నురెప్పలపై చీకటి కురిసి
చెవులకు వేలాడే సన్నని శబ్దంతో
గొంతు గోతులెక్కడో
కళ్లకు అడుగు వేయాలంటే భయంగా ఉంది.

ఐనా సరే ఆకాశాన్ని కప్పుకుని
దారిని గిల్లుకుంటూ
నక్షత్రాల చిరునామాతో
వేకువ జపం చేస్తూ
నిద్ర మాత్రలు వేసుకున్న నిజం
తప్పు తెలుసుకుని
మెలుకువ ఇంటి తలుపు కొట్టింది.

తూర్పు దిక్కు మబ్బు వాకిలి తెరిచి
నులి వెచ్చని కిరణం
ముఖంపై ముద్దు పెట్టీ
వెలుగుని వడ్డించింది.

Exit mobile version