Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేటి సమాజం

[సిహెచ్. కళావతి గారు రచించిన ‘నేటి సమాజం’ అనే కవితని అందిస్తున్నాము.]

మాజం నిండా మతోన్మాదులు
మదోన్మాదులు ప్రేమోన్మాదులు
సమాజంలో సంరక్షణ కరువై
బిక్కు బిక్కుమంటున్న ఆడపిల్లలు

చట్టాలు ఎన్ని తెచ్చినా
శిక్షలు ఎన్నిటినో వేస్తున్నా
బ్రతుకు భయం తెలియని
జులాయి వెదవలు
మేధావులు సైతం పెదవి విప్పక
చేస్తున్నారు మౌనవ్రతాలు

గాంధీజీ కలలు గన్న ఆశయాలు
కల్లలై పోతున్న వైనాలు
స్త్రీని స్త్రీగా చూడక భోగ్య వస్తువుగా
చూస్తున్న భోగలాలసులు
అత్యాచారాలలో ఆగని కిరాతక
మృగాళ్ళు చేస్తున్న హత్యోదంతాలు

మనసున్న మానవ హృదయాల్లో
భయకంపిత ప్రకంపనాల తీరని వేదనలు
విజ్ఞాన మేధతో గగన తలంలో
వీర విహారం చేస్తున్న మానవులు
అధః పాతాళానికి దిగజారుతున్న
ఉన్నత వ్యక్తిత్వాలు

Exit mobile version