Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నేను నేల తల్లిని! నీ ఉపశమనాన్ని!

బంజరునని నన్ను
నిరసనగా చూడకు
వర్షాభావం వలన ఏటా
నీకు పంటనీయలేకపోవచ్చు
కాని చినుకుపడి నేలతడిసి
నువ్వు విత్తిన నాడు
అన్ని సంవత్సరాల పంటనూ
ఒక్కసారే నీకందించి
మళ్ళీ నాలుగైదు
సంవత్సరాలకు సరిపడా
తిండిగింజల భద్రతను
నీకందించడం లేదూ?

Exit mobile version